ETV Bharat / spiritual

ఆ రాశి వారు కొంచెం దూకుడు తగ్గించుకుంటే మేలు! - Daily Horoscope Today - DAILY HOROSCOPE TODAY

Horoscope Today April 20th 2024 : ఏప్రిల్​ 20న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today April 20th 2024
Horoscope Today April 20th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 3:08 AM IST

Horoscope Today April 20th 2024 : ఏప్రిల్​ 20న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యల కారణంగా నీరసంగా ఉంటారు. విశ్రాంతి అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటే మంచిది. సూర్య ఆరాధనతో స్వస్థత చేకూరుతుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతమైన రోజు. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నాయకత్వ ధోరణితో అందరినీ ఒక తాటిపై నడిపిస్తారు. అందరి సహకారం ఉంటుంది. వృత్తిఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిధునరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్ధికంగా ఎలాంటి లోటు ఉండదు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం ద్వారా మేలు జరుగుతుంది. బంధుమిత్రులతో విందువినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ప్రతికూల ఆలోచనలు వీడి ప్రశాంతంగా ఉండండి. మాటలు అదుపులో పెట్టుకోకపోతే కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. ఇంట్లో అశాంతిగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. నూతన బాధ్యతలు చేపడతారు. మీదైనా శైలిలో సమర్ధవంతంగా పనిచేసి అందరి ప్రశంసలు పొందుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అన్నింటా విజయమే ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధికంగా లాభపడతారు. గణపతి ధ్యానం శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ మొండి స్వభావంతో ఈ రోజు చాలా నష్టపోతారు. ఆత్మీయుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తే మేలు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. శివారాధనతో అన్ని సమస్యలు తొలగుతాయి.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళతారు. విందువినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రకు కూడా వెళతారు. దైవబలం తోడుగా ఉంటుంది. ఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది. కొన్ని సందర్భాల్లో హుందాగా ఉంటే మేలు. మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. గృహంలో శాంతి నెలకొంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. ఒక శుభవార్త మీ ఆనందాన్నిరెట్టింపు చేస్తుంది. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన సమయం. అనేక రకాల అనారోగ్యాలు వేధిస్తాయి. పూర్తి విశ్రాంతి అవసరం. పనులు వాయిదా వేస్తే మంచిది. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. పై అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. హనుమన్ చాలీసా పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యల కోసం ధనం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రతికూల ఆలోచనలు వీడండి. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. వృత్తిఉద్యోగాలు చేసేవారికి, హస్త కళల వారికి కలిసి వచ్చే కాలం. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పనిచేసి అద్భుతాలు సృష్టిస్తారు. ఎటు చూసినా శుభాలే గోచరిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాల నిమిత్తం ధన వ్యయం ఉంటుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారులకు పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధనలాభం, వస్త్ర లాభం ఉంటుంది. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మంచి ఆరోగ్యం, ఆర్ధిక లాభం ఉండడం వల్ల ఈ రోజంతా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. అన్నింటా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. గృహంలో సంతోషం నెలకొంటుంది. కొంచెం దూకుడు తగ్గించుకుంటే మేలు. శివారాధన చేస్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.