Horoscope Today 3rd September 2024 : 2024 సెప్టెంబర్ 3న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు ఉద్యోగులకు శుభ ఫలితాలు ఉంటాయి. గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారంలో సానుకూల ఫలితాలై ఉంటాయి. మంచి లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో పని చేసి అఖండ విజయాలను అందుకుంటారు. దృఢ సంకల్పం, సాహసంతో వృత్తి వ్యాపారాలలో నూతన శిఖరాలు అధిరోహిస్తారు. ఉద్యోగులకు సర్వత్రా విజయమే గోచరిస్తుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పితృ సంబంధమైన ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు. ఆర్థికంగా మీకు బాగా లాభాలు ఉంటాయి. గణపతి ఆరాధన శుభకరం.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు కొత్త కొత్త పనులు, ఒప్పందాలు చేసుకోడానికి శుభకరంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతుతో నూతన బాధ్యతలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనంకంగా ఉంటుంది. కొంతమంది ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. గొడవలకి, వివాదాలకి దూరంగా ఉండండి. మోసపూరిత ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. శివారాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీదే పై చేయి అవుతుంది. మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఎదురయ్యే పోటీ, సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మాతృ వర్గం నుంచి అందిన శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. ఈ రోజు కొన్ని ముఖ్య వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ రోజు కలిసి వస్తుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల మద్దతు ఉంటాయి. ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. సంపద వృద్ధి చెందుతుంది. పితృ సంబంధమైన వ్యవహారాల్లోలాభాలు అందుతాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా, అంతటా విజయమే. వృత్తిపరమైన అభివృద్ధి, పదోన్నతి, ఆదాయం వృద్ది ద్వారా మీకు కలిసి వస్తుంది. అన్ని విషయాల్లో తారాబలం చాలా అనుకూలంగా ఉంది. పిత్రార్జిత ఆస్తులు కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. స్థిరాస్తి రంగం వారు కొనుగోలు, అమ్మకాలతో మంచి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు తమ తమ రంగాలలో విజయం సాధిస్తారు. చిన్ననాటిస్నేహితులను కలుసుకొని సరదాగా గడుపుతారు. విహారయాత్రలకు వెళతారు. వ్యాపారులకు విపరీతమైన లాభాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం, ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ మంచి మనసుతో అందరినీ ఆకట్టుకుంటారు. అన్ని రంగాల వారు ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో పనిచేసి ఆశించిన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో మీదే పై చేయి అవుతుంది. ఆర్థిక లాభాలు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆలయ సందర్శన శుభకరం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. గత కొంతకాలంగా వేధించిన ఆనారోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారు పట్టుదలతో పనిచేసి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా ఓ మెట్టు పైకి ఎదుగుతారు. సమాజంలో హోదా, పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో, బంధువులతో సంతోషంగా, సమయాన్ని గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు, సవాళ్లు ఎదురవుతాయి. భావోద్వేగానికి లోను కాకుండా ప్రశాంతం ఉంటే అన్నీ సర్దుకుంటాయి. ఈ రోజు ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండండి. కీలకమైన వ్యవహారాలు ముందుకు సాగక పోవడంవల్ల మానసికంగా చికాకుగా ఉంటారు. కోర్టు వ్యవహారాలలో తీర్పు మీకు వ్యతిరేకంగా ఉంటుంది.ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కీలకమైన వ్యవహారాల్లో మొండిగా లేకుండా పట్టువిడుపుల ధోరణిని అవలంబించండి. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తివ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచే ప్రయత్నంలో పొరపాట్లు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతిని పూజిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.
మీనం (Pisces) : మీనంరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి అభివృద్ధి, ఆర్థిక పరమైన లాభాలు మెండుగా ఉంటాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య ముఖ్యమైన చర్చలు ఫలవంతంగా వుంటాయి. మాతృవర్గం నుంచి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికినీ అధిగమిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇష్ట దేవతారాధన శుభప్రదం.