ETV Bharat / spiritual

ఆ రాశివారికి త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి, వివాహ యోగం - శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభకరం - HOROSCOPE TODAY

నవంబర్ ​3వ తేదీ (ఆదివారం) రాశిఫలాలు - ఎలా ఉన్నాయంటే?

Horoscope
Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2024, 4:30 AM IST

Horoscope Today November 3, 2024 : నవంబర్ ​3వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి విజయసిద్ధి ఉంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక అంశాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. దైవబలం అండగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారి పట్ల చూసీ చూడనట్లు వ్యవహరిస్తే మంచిది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో పైచేయి సాధిస్తారు. మీ ప్రశాంతతకు భంగం కలిగే ఘటనలు జరగవచ్చు. చివరకు విజయం సాధించేవి మీ మంచితనం, సత్ప్రవర్తనే! ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శివారాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గతంలో చేసిన తప్పులు సరిచేసుకుంటే వృత్తి, ఉద్యోగాలలో రాణిస్తారు. వ్యాపారంలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు రావచ్చు. ప్రమోషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉండేవారికి ఈ రోజు బాగా లాభదాయకంగా ఉంది. ఆరోగ్యం, ఫిట్​నెస్ మీద దృష్టి సారిస్తారు. విష్ణువు ఆలయ సందర్శన శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో సామాన్య ఫలితాలు ఉండవచ్చు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు. దీనితో అశాంతితో ఉంటారు. అనవసరమైన గాసిప్స్​నకు దూరంగా ఉంటే మంచిది. పనిమీద ఏకాగ్రత పెట్టడం అవసరం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనవసరమైన కలహాలు ఏర్పడతాయి. శారీరక , మానసిక ఆరోగ్యాలు అంత బాగుండవు. ఈ రోజంతా అయోమయం, నెగిటివ్ ఆలోచనలలోనే ఉంటారు. మీ తల్లిగారి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తిపరంగా చాలా ఒత్తిళ్లు ఉంటాయి. ఉద్యోగంలో పనిభారం పెరగడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆస్తి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. నీటిగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి. ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రోజు శారీరకంగా దృఢంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అన్ని పనులు అనుకున్నట్లుగా జరగుతాయి. దీనితో సంతోషంగా ఉంటారు. ఎక్కువ సమయం పనిలో కాలం గడుపుతారు. సంపాదన పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రియమైన వారితో విహారయాత్రలకు వెళతారు. వృత్తి పరంగా ఎదగడానికి సన్నిహితుల సహకారం అందుతుంది. మీ ఆధ్యాత్మిక అనుభవానికి సామాజికంగా తగిన గుర్తింపు దొరుకుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో అనిశ్చితి ఇంకా వీడకపోవడం వల్ల గందరగోళంగా ఉంటారు. కుటుంబ సమస్యలు అంతకంటే గందరగోళమైన పరిస్థితికి నెట్టేస్తాయి. ఓర్పు, సహనంతో ఉండాలి. పరిణితితో, బాధ్యతతో ప్రవర్తించండి. సర్దుబాటు ధోరణితో ఉంటే మంచిది. ఎవరితోనూ గొడవలకు దిగవద్దు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీ ప్రియమైన వారి నుంచి కానుకలు అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులకు ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. ఈశ్వరుని ఆలయ సందర్శన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మాటలను నియంత్రణలో పెట్టుకోలేని మీ అశక్తత కారణంగా సమస్యల్లో చిక్కుకుంటారు. మాటతీరును మార్చుకునే ప్రయత్నం చేయండి. లేని పక్షంలో రోజంతా వాదనలతో గడపాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి మానసికంగా మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. ఆరోగ్య పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు గొప్ప శుభయోగం ఉంది. సన్నిహితుల సహకారంతో అన్ని పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆదాయవృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది. అదనపు ఆదాయం సమకూరుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉంటారు. అన్ని పనులు మీకు అనుకూలంగా జరుగుతాయి. వృత్తిపరంగా కూడా మీరు చక్కగా రాణిస్తారు. మీ పనికి తగిన ప్రశంసలు దక్కుతాయి. ఇది మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. మీ సహోద్యోగుల నుంచి లభించే సహకారంతో తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శివాష్టకం పఠిస్తే మేలు జరుగుతుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాలలో సమస్యలు ఎదురుకావచ్చు. ప్రతికూల ఆలోచనలతో కీలక నిర్ణయాలు తీసుకునే శక్తి కోల్పోతారు. అనారోగ్య సమస్యలతో అశాంతిగా ఉంటారు. కుటుంబంలో నిరంతర కలహాలు చికాకు కలిగిస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో వ్యవహరించేటప్పుడు వినయంతో లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.