ETV Bharat / spiritual

'మ్యారేజ్​ ఫిక్స్​ చేసుకుంటున్నారా? - అయితే, వివాహ పొంతనలో ఈ విషయాలు తప్పకుండా చూడండి!' - Horoscope for Marriage

How to Check Horoscope for Marriage : హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లికి ముందు అమ్మాయి-అబ్బాయి జాతకం పొంతన కుదిరిందా? లేదా? అనేది చూస్తారు. మరి.. ఆ జాతకాల్లో తప్పనిసరిగా చూడాల్సినవి ఏంటో మీకు తెలుసా? ఆ వివరాలు ప్రముఖ జ్యోతిష్యుడు 'నిట్టల ఫణి భాస్కర్​' చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Horoscope for Marriage
How to Check Horoscope for Marriage (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2024, 3:37 PM IST

Horoscope for Marriage : ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. పచ్చని పెళ్లి పందిరిలో వివాహ బంధంతో ఒక్కటయ్యే జంటలు.. నిండు నూరేళ్లు, పిల్లా పాపలతో పచ్చగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే.. హిందూ సంప్రదాయాల ప్రకారం.. పెళ్లి జరిపించే ముందు అమ్మాయి, అబ్బాయి జాతకాల మధ్య పొంతన కుదిరిందా? లేదా? అని తప్పకుండా చూస్తారు. ఇద్దరి జాతకాలు కలిస్తేనే.. పెళ్లి కుదుర్చుకుంటారు. అయితే.. ఈ వివాహ పొంతనలో ఏ విషయాలు ఖచ్చితంగా చూడాలో ప్రముఖ జ్యోతిష్యుడు నిట్టల ఫణి భాస్కర్​ చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..

ఫలానా నక్షత్రం సెట్​ అవుతుందని చెప్పలేము..

ఎక్కువ మంది అమ్మాయి, అబ్బాయి జాతకాల్లో ముందు తారా బలం చూస్తుంటారు. అయితే.. అసలు తారా బలం కుదరకపోయినా పెద్దగా సమస్య ఏమి ఉండదట. అలాగే కొంతమంది తల్లిదండ్రులు.. 'అమ్మాయి లేదా అబ్బాయి జాతకానికి తగినటువంటి నక్షత్రాల పేర్లు ఇవ్వండి. ఆ నక్షత్రాలన్న వారితో మేము మ్యాచ్​ ఫిక్స్​ చేయించుకుంటాము' అని అడుగుతుంటారట. కానీ.. ఒక అమ్మాయి లేదా అబ్బాయికి ఫలానా నక్షత్రం సెట్​ అవుతుంది అని రాసి ఇవ్వడం జరగదని ఫణి భాస్కర్​ చెబుతున్నారు. అయితే, ఇక్కడ మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. నక్షత్రాలు కుదిరినంత మాత్రాన జాతకాలు నప్పుతాయి.. అనేది తప్పని ఫణి భాస్కర్​ చెబుతున్నారు.

వివాహానికి ముందుకు వెళ్లేవారు ఇవి చూసుకోండి..

  • ముందు జాతకం చూసుకోవాలి.
  • వారి జాతక బల ప్రభావం బాగా ఉంటే వివాహ బంధం సుఖంగా ఉంటుంది.
  • అలాగే లగ్నాలు బాగున్నాయా? లేదా? అనేవి చూసుకోవాలి.
  • కుజ దోషం ఉందా? లేదా అనేది తప్పకుండా చూసుకోవాలి.
  • చంద్ర లగ్నాలు.. అంటే రాశుల మధ్యలో గ్రహమైత్రి ఉందా? లేదా అనేవి పరిశీలించాలి.
  • దాదాపు ఇవి మూడు బాగుంటే పెళ్లికి 70 శాతం వరకు ముందుకు వెళ్లవచ్చు.
  • ఇక మిగతా 30 శాతం డీప్​గా చూసుకోవాలి. అవేంటంటే.. వారి వైవాహిక జీవిత స్థానాలు, ఆయుర్భాగ్యాలు, సౌభాగ్యాలు, సంతాన స్థానాలు బాగున్నాయా..? లేదా ? అనేవి కొంత లోతుగా చెక్​ చేసుకోవాలని ఫణి భాస్కర్​ సూచిస్తున్నారు. అమ్మాయి లేదా అబ్బాయి జాతకాల విషయంలో ఏవైనా దోషాలుంటే పెళ్లికి ముందే కొన్ని పరిహారాలు చేయాలి. ఇలా చేస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవి కూడా చదవండి :

మహాలయ అమావాస్య + సూర్య గ్రహణం - ఈరోజున ఏం చేయాలో తెలుసా?

లవర్స్​ కోసం స్పెషల్ టెంపుల్​! అక్కడికి వెళ్లి ఆ 'రాక్షసి'ని పూజిస్తే పెళ్లి గ్యారెంటీ!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.