ETV Bharat / spiritual

ఆంజనేయుడి అనుగ్రహం లభించాలంటే - హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! - Hanuman Chalisa Chanting Rules - HANUMAN CHALISA CHANTING RULES

Hanuman Chalisa Chanting Rules : హిందువులు ఆరాధించే దేవుళ్లలో హనుమంతునికి విశేషమైన స్థానం ఉంటుంది. కష్టంలో ఆపద్బాంధవుడిలా, కోరిన కోర్కెలు తీర్చే అభయాంజనేయ స్వామిగా వాయుపుత్రుడిని పూజిస్తారు. అంతే కాకుండా చాలా మంది హనుమాన్ చాలీసా పఠిస్తుంటారు. అయితే, హనుమాన్​ చాలిసా చదివే సమయంలో ఈ పొరపాట్లు చేస్తే పుణ్యఫలం దక్కదంటున్నారు పండితులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

HANUMAN CHALISA RULES
Hanuman Chalisa Chanting Rules (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 12:18 PM IST

These Mistakes to Avoid While Chanting Hanuman Chalisa : ఆంజనేయుడిని ప్రసన్నం చేసుకునేందుకు చాలా మంది హనుమాన్ చాలీసాను పఠిస్తుంటారు. దీనిలో మొత్తం నలభై శ్లోకాలు ఉంటాయి. తులసీదాస్ ఈ పద్య సంపుటిని రచించారు. దీన్ని పఠించడం వల్ల ఆంజనేయస్వామి అనుగ్రహం, బలం, రక్షణ, జ్ఞానం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే.. హనుమాన్ చాలీసా చదివినా, విన్నా అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

అయితే, మీరు అనుకున్న పనులన్నీ పూర్తి కావాలంటే హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) చదివేటప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలంటున్నారు పండితులు. ముఖ్యంగా ఈ పొరపాట్లను ఎట్టిపరిస్థితుల్లో చేయవద్దని సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల పుణ్యఫలం దక్కదని చెబుతున్నారు. ఇంతకీ, హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆ టైమ్​లో హనుమాన్ చాలీసా చదవండి : హనుమాన్ చాలీసాను పఠించడానికి బ్రహ్మ ముహూర్తం అనువైన సమయంగా చెబుతున్నారు పండితులు. అంటే.. తెల్లవారుజామున చదవాలి. ఎందుకంటే.. ఈ టైమ్ ఏదైనా ఆధ్యాత్మిక కార్యకలాపాన్ని ప్రారంభించడానికి అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి, ఈ సమయంలో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు మరింత పెరుగుతాయంటున్నారు పండితులు.

శుభ్రమైన బట్టలు ధరించండి : హనుమాన్ చాలీసా పఠించే ముందు తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. శుభ్రమైన వస్త్రధారణ సానుకూల శక్తిని తెస్తుందని నమ్ముతారు. అలాగే ఇది మీ అభ్యాసానికి పవిత్రమైన, సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుందని పండితులు సూచిస్తున్నారు.

వేగంగా పూర్తి చేయడానికి తొందరపడొద్దు : చాలా మంది హనుమాన్ చాలీసా చదివేటప్పుడు వేగంగా పూర్తి చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాకాకుండా తగినంత సమయాన్ని వెచ్చించి తొందరపడకుండా నెమ్మదిగా చదవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు పండితులు.

శాపానికి ఉపశమనం- ఆంజనేయ స్వామి జననం- హనుమంతుడి జన్మ రహస్యం తెలుసా?

చదవడం మధ్యలో ఆపవద్దు : మీరు ఒకసారి హనుమాన్ చాలీసాను పఠించడం ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆపకూడదంటున్నారు పండితులు. అంటే.. నిరంతరంగా అది కంప్లీట్ అయ్యే వరకు చదవాలని సలహా ఇస్తున్నారు. అయితే, 21 లేదా 40 రోజుల పాటు నిరంతరం హనుమాన్ చాలీసా చదవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.

మాంసం, మద్యం తీసుకోవద్దు : హనుమాన్ చాలీసాను పఠించాలని అనుకున్నప్పుడు మాంసం, మద్యం, ధూమపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అంటున్నారు. అలాగే.. హనుమంతుని ఆశీర్వాదం పొందాలంటే కేవలం సాత్విక ఆహారాలను మాత్రమే తీసుకోవాలంటున్నారు.

శ్లోకాలను స్పష్టంగా ఉచ్చరించాలి : హనుమాన్ చాలీసా చదివేటప్పుడు మీ ఉచ్చారణపై సరైన అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా శ్లోకాల మధ్య ఒకటి లేదా రెండు పదాలను వదిలివేయడం వంటి లోపాలు లేకుండా చూసుకోవాలి. మీరు ఎంత కచ్చితంగా, స్పష్టంగా శ్లోకాలు జపిస్తే మీ ప్రార్థన మరింత విజయవంతమవుతుందని గుర్తుంచుకోవాలంటున్నారు పండితులు.

మహిళలు పాటించాల్సిన నియమాలు : మహిళలు పీరియడ్స్ టైమ్​లో హనుమాన్ చాలీసా చదవద్దని అంటున్నారు. అదే విధంగా.. హనుమాన్ చాలీసా చదివిన తర్వాత మహిళలు హనుమంతుని ముందు మోకరిల్లడం వంటి పనులు చేయొద్దని చెబుతున్నారు. ఎందుకంటే.. అతను స్త్రీలందరినీ తన తల్లులుగా భావిస్తాడని.. అందుకే తన ముందు తల వంచడాన్ని హనుమయ్య ఇష్టపడడని పండితులు చెబుతున్నారు.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇంట్లో హనుమాన్ చిత్రాన్ని ఏ దిశలో పెట్టాలి? - వాస్తు ఏం చెబుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.