ETV Bharat / spiritual

కలియుగం అంటేనే దుష్టకాలం- కానీ ఈ సింపుల్ టిప్​తో పుణ్యం మీ సొంతం! - భగవన్నామ సంకీర్తన

Bhagavan Nama Smarana : కలియుగంలో భక్తి సన్నగిల్లి, మనుషులు తారతమ్యాలు మరిచి, విచక్షణ కోల్పోయి విపరీతాలకు తెర తీస్తారు అనేది సత్యం. అయితే కలియుగంలో కేవలం దేవుడిని స్మరించుకోవడం ద్వారా మోక్షం పొందవచ్చని, దేవుడి కృపకు పాత్రులు కావచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ వివరాలు మరింత లోతుగా తెలుసుకుందాం.

bhagavan-nama-smarana in kaliyugam
bhagavan-nama-smarana in kaliyugam
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 7:01 AM IST

Bhagavan Nama Smarana : కలియుగంలో భగవన్ నామస్మరణకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రస్తుతం కలియుగం నడుస్తుంది. ఈ యుగంలో ప్రజల ఆయుర్దాయం చాలా తక్కువగా ఉంటుంది. కనుక కృతయుగం, త్రేతాయుగం, ద్వారయుగంలో చేసినంత గొప్ప తపస్సులు, యజ్ఞ, యాగాదులు, పూజలు, వ్రతాలు చేయడం కష్టం. వీటిని సమకూర్చుకుని ఆచరించడం ఆర్థికంగానూ ఇబ్బందే. అంత పరివారమూ, వేదం, వాటి నిష్ట వంటివి సన్నగిల్లుతూ వచ్చే కాలం కలికాలం. అసలు కలికాలం అంటే దుర్మర్గమైన కాలం అని అర్థం.

Vishnu Nama Smaranam In Telugu : అయితే కలికాలం మాత్రం ఒక్క విషయంలో చాలా గొప్పది. ఈ కాలంలో యజ్ఞ, యాగాదులు వంటి క్రతువులు చేయకపోయినా, తపస్సులు, ధర్మములను చేయకపోయినా, కేవలం నామస్మరణ చేయడం ద్వారా మోక్షం పొందుతారు. అంటే నామస్మరణ చేయగా, చేయగా, మనలో బుద్ధి అంకురిస్తుందని అర్థం. 'హరే రామ హరే రామ రామ రామ హరేహరే హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే' అనే నామ మంత్రమే ముక్తికి మార్గం. ఈ మంత్రంలోని రామ శబ్దం, హరి శబ్దం పరబ్రహ్మవాచకమైన శ్రీకృష్ణుడినే సూచిస్తాయి. నామస్మరణకు ఎటువంటి నియమాలు లేవు. కేవలం మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనసులో జ్ఞానం చేసుకోవచ్చు. శ్రీరామ, శ్రీకృష్ణ ఏదైనప్పటికీ ఫర్వాలేదు. దీనికి ఎటువంటి నియమాలు లేవు, నామస్మరణ చేతే ప్రతి ఒక్కరూ తరించవచ్చు. ఏ సందర్భంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నామస్మరణ చేయడం మంచిదే.

దేవుడి పేర్లు పెట్టడానికి కారణమిదే:
పూర్వం ఇంట్లో పిల్లలకు దేవుడి పేర్లు పెట్టడానికి వెనుక కారణం కూడా నామస్మరణే. నిత్యం ఏదో రూపంలో భగవంతుని నామస్మరణ చేయడం కోసం పిల్లలకు రామ, కృష్ణ, నారాయణ వంటి పేర్లతో భగవన్నామస్మరణ చేసుకోవచ్చని భావించేవారు. కార్తీక పురాణంలో దీని గొప్పతనం చెప్పేందుకు అజామరుడి వృత్తాంతాన్ని చక్కగా వివరించారు. యమభటులు కనిపిస్తున్నప్పుడు, కుమారుడిపై వ్యామోహంతో నారాయణ అని పిలవడం వల్ల అతడికి స్వర్గప్రాప్తి కలిగిందట. ఈ రోజుల్లో మనం గమనిస్తే ఎవరూ పిల్లలకు భగవంతుని పేర్లు పెట్టడం లేదు. అనునిత్యం భగవంతుని నామస్మరణ చేసుకోవాలంటే పిల్లలకు దేవుడి పేర్లు పెట్టాలి.

24 గంటలూ అవసరం లేదు
కలియుగంలో స్మరణ చేసి తరించవచ్చని మన సంప్రదాయం తెలియజేస్తున్నది. 24 గంటలూ స్మరణ చేయాల్సిన అవసరం లేదు. మన మనస్సు నిలకడగా ఉన్నప్పుడు స్మరణ చేయడం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. యాంత్రికంగా అర్చన చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. క్షణక్షణానికి మన ఆయుర్దాయం తరిగిపోతున్నందున ప్రతి క్షణం స్మరణ చేయడం మంచిది.

ఎప్పుడు చేసినా ఫలితం పక్కా
సర్వకాల సర్వావస్థల్లోనూ నామస్మరణ చేసుకోవచ్చు. మంత్రాలకు మాత్రమే నియమాలు పాటించాల్సి ఉంటుంది. నామస్మరణ భక్తితో ఎప్పుడు చేసినా సరిపోతుందని, నిరంతరం భగవంతుని చింతలో ఉండటమే నామస్మరణ గొప్పతనమని సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు తన ఉపదేశంలో నారద మునికి చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. తనకంటే గొప్ప భక్తుడు లేడని, నిత్యం నారాయణ స్మరణతో తరిస్తున్నానని నారదుడు గొప్పలకు పోతే విష్ణుమూర్తి మరో గొప్ప భక్తుడు ఉన్నాడని నారదుడికి చెబుతాడంట.

భూలోకంలో ఓ రైతు ఉదయం లేచినప్పటి నుంచి మళ్లీ రాత్రివరకు తన నామస్మరణ చేస్తున్నాడని నారదుడికి చెబుతాడంట. అయితే నారదుడు ఆ రైతు తనకంటే ఎలా గొప్పభక్తుడయ్యాడని పరిశీలిస్తే, రైతు ఉదయం నిద్రలేచినప్పుడు మూడుసార్లు నారాయణ, నారాయణ అంటూ భగవంతుడిని స్మరిస్తాడట. తర్వాత స్నానం చేసినప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు, రాత్రి మళ్లీ నిద్రపోయేటప్పుడు భగవంతుని నామం స్మరిస్తాడు. ఇలా రోజుకు నాలుగుసార్లు మొత్తంగా 12 సార్లు భగవంతుడి నామాన్ని జపించిన రైతు తనకంటే ఎలా గొప్పవాడయ్యాడని నారదుడు శ్రీమహా విష్ణువుని ప్రశ్నిస్తే, సకల బాధలు ఎదుర్కొంటున్న మానవుడు వీలుచిక్కినప్పుడల్లా తనను స్మరించుకోవడానికి కన్నా గొప్ప ఏముందని వివరిస్తాడట.

అందుకే అంత విశేషం
సర్వసంగ పరిత్యాగివయిన నారదుడుకి ఓ పరీక్ష పెట్టి, దోసెడు పాలను చుక్క కూడా ఒలకకుండా ముమ్మారు ప్రదక్షిణ చేసి రమ్మంటే, నారదుడు చక్కగా తన బాధ్యత నిర్వహిస్తాడట. కానీ, ఆ సమయంలో విష్ణు నామ జపాన్ని మరచిపోతాడట. సర్వసంగ పరిత్యాగి అయిన నారదుడే ఓ చిన్నపని కోసం నామస్మరణ మరచిపోతే, సాధారణ మనిషి అన్ని బాధలు అనుభవిస్తూ నామస్మరణ చేయడం చాలా గొప్పవిషయమని విష్ణువు ఉదహరిస్తాడట. అందుకే కలికాలంలో భగవంతుని నామస్మరణకు అంత విశేషముందని పండితులు చెబుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వాస్తు దోషం - ఇంటి మెయిన్‌ డోర్‌ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!

ఇంట్లో బీరువా ఎక్కడ పెట్టాలో తెలుసా? ఆ దిక్కున పెడితే మీకు అన్ని శుభాలే!

వంట గదిలో వాస్తు - ఈ టిప్స్​ పాటించకపోతే ఇబ్బందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.