ETV Bharat / spiritual

నేడు మిథునంలోకి బుధుడు- ఈ రాశుల వారికి భద్ర మహాపురుష యోగం- పట్టిందల్లా బంగారమే! - Bhadra Mahapurusha Yoga Benefits

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 5:10 AM IST

Bhadra Mahapurusha Yoga Benefits : ప్రతి ఒక్కరికి గ్రహసంచారం ఆధారంగానే అనుకూల ఫలితాలు కానీ వ్యతిరేక ఫలితాలు కానీ ఉంటాయి. గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఆ ప్రభావం కొన్ని రాశులకు విశేష యోగాలను ఇస్తుంది. ఈ నెల 14న బుధుడు, మిథునంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా కొన్ని రాశులకు విశేష యోగం కలుగనుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Bhadra Mahapurusha Yoga Benefits
Bhadra Mahapurusha Yoga Benefits (ETV Bharat)

Bhadra Mahapurusha Yoga Benefits : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో బుధుడు వృషభరాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సందర్భంగా మిథున రాశిలో బుధ సంచారం వల్ల భద్ర మహా పురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ప్రభావం అన్ని రాశుల వారి పైన కచ్చితంగా ఉంటుంది.

పట్టిందల్లా బంగారం
జూన్ 14వ తేదీ రాత్రి పది గంటల 55 నిమిషాలకు బుధుడు మిథున రాశిలోకి వెళతాడు. ఇక ఈ బుధ సంచారం వల్ల భద్ర రాజయోగం ఏర్పడి అనేక శుభ ఫలితాలను అందుకుంటారు. అంతేకాకుండా భద్ర మహా పురుష రాజయోగం కొన్ని రాశుల వారికి సంపద వర్షాన్ని కురిపిస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది!. ఈ సందర్భంగా ఏయే రాశులపై ఈ ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.

మిథున రాశి
మిథున రాశి వారికి భద్ర మహా పురుష రాజయోగం కారణంగా అనేక శుభ ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారు ఈ సమయంలో కెరీర్​లో ఉత్తమ ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అన్ని రంగుల వారికి ఈ సమయంలో జీవితంలో ఏర్పరుచుకున్న అన్ని లక్ష్యాలు నెరవేరుతాయి. విశేషమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శుభ సమయం నడుస్తోంది. విదేశీయానం కోసం ఈ సమయంలో చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సంతోషం, సమన్వయం నెలకొంటాయి.

సింహరాశి
సింహరాశి వారికి భద్ర మహా పురుష రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపార రంగంలో లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. చేపట్టిన ప్రతి పనీ విజయవంతమవుతుంది. ఉద్యోగులు ఆశించిన ప్రమోషన్లు పొందుతారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు భద్ర మహా పురుష రాజ యోగం వలన మంచి లాభాలను ఆర్జిస్తారు. సింహ రాశి జాతకులు విదేశాల్లో డబ్బు సంపాదించడానికి ఇది మంచి సువర్ణవకాశం. అంతేకాకుండా ఈ సమయంలో సింహ రాశి జాతకులు ఉత్సాహంగాను, ఆరోగ్యంగానూ ఉంటారు. ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేసుకోగలుగుతారు.

మకర రాశి
మకర రాశి జాతకులకు జూన్ నెలలో భద్ర మహా పురుష రాజయోగం కారణంగా అదృష్టం వరిస్తుంది. ఈ జాతకులు ఈ సమయంలో విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. ధనానికి లోటుండదు. ఉద్యోగులకు ఈ సమయం మంచి యోగం ఉంటుంది. కోరుకున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపారులు ఈ సమయంలో తమ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తారు. విదేశాలలో నివసించే వారికి భద్ర మహా పురుష రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో జీతం కూడా పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృత్తి నిపుణులకు, కళాకారులకు, సినీ రంగం వారికి గౌరవం, సత్కారం, సన్మానాలు అందుకుంటారు.

మిగిలిన రాశుల వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఏది ఏమైనా స్వశక్తిని నమ్ముకుని, దైవ బలం మీద విశ్వాసం ఉంచి స్వధర్మాన్ని పాటిస్తే అన్నీ సాఫీగా సాగిపోతాయి. శుభం భూయాత్

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.