Astrological Tips for Bedroom: మనం పడుకునే మంచాన్ని బట్టి కూడా మన ఆర్థిక స్థితిగతులు ఆధారపడి ఉంటాయంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. ముఖ్యంగా బెడ్రూమ్, మంచం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. అప్పుడే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ సంపాదన రెట్టింపు అవుతుందట! ఇంతకీ, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మంచం, బెడ్రూమ్ విషయంలో పాటించాల్సిన ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఎప్పుడైనా సరే మనం పడుకునే మంచం సరిగ్గా గుమ్మానికి ఎదురుగా రాకుండా జాగ్రత్త పడాలి. అలాకాకుండా ఇళ్లు ఇరుకుగా ఉండి తప్పనిసరి పరిస్థితులలో గుమ్మానికి ఎదురుగా మంచం వచ్చిందనుకో.. అప్పుడు దానికి ఎదురుగా ఒక కట్టె వేసుకోవాలని చెబుతున్నారు జ్యోతిష్యులు కిరణ్ కుమార్.
- అలాగే.. బాత్ రూమ్ ఎదురుగా మంచం ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా వస్తే మామూలు సమయాల్లో ఎప్పుడూ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండకుండా జాగ్రత్త పడాలి. ఈ నియమం తప్పకుండా పాటించాలి.
- మంచం విషయంలో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. పడకగదిలో బెడ్‌ను ఒక గోడకు అనించి ఉంచుతుంటారు. కానీ, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. అలా ఉంచడం మంచిది కాదంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. ఎప్పుడూ మంచానికి నాలుగు వైపులా ఖాళీ ఉండేలా చూసుకోవాలంటున్నారు. అలా ఉంటేనే ప్రాణశక్తి అనేది బాగా ఉంటుంది. అదృష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అదే.. గోడకు అనుకుని ఉంటే ప్రాణశక్తితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందని చెబుతున్నారు.
- అలాగే.. బెడ్కాట్ మంచాలకు ఉండే స్టోరేజ్ ర్యాక్స్‌లో కొన్ని వస్తువులు పెడుతుంటారు చాలా మంది. అయితే, వాటిల్లో అనవసరమైన వస్తువులు ఎక్కువగా ఉంచకూడదు. అలా ఉంచితే.. అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుందంట.
- అదేవిధంగా.. కొందరు మంచం కింద పనికిరాని వస్తువులు ఉంచుతుంటారు. అంటే.. బొమ్మలు, పాత సూట్‌కేసులు, పాత సామానులు వంటివి పెడుతుంటారు. ఇలా పనికిరాని వస్తువులు మంచం కింద ఉన్న కూడా లక్ష్మిదేవి అనుగ్రహం తగ్గిపోతుందని సూచిస్తున్నారు.
- అలాగే.. ఉదయం నిద్రలేవగానే మంచం మీద కళ్లు తెరవగానే ఎదురుగా గడియారం, క్యాలెండర్లు కనిపించేలా ఉండకూడదు. కొద్దిగా పక్కకు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అయితే, దేవుళ్ల క్యాలెండర్లైతే పర్వాలేదు! కానీ.. గడియారం ఎట్టిపరిస్థితుల్లో ఉండకుండా జాగ్రత్త పడాలంటున్నారు.
- బెడ్రూమ్లో ఎప్పుడూ సీలింగ్‌కి బ్లూ కలర్ వేయించుకోకూడదు. ఇలా ఉంటే.. భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తే ఛాన్స్ ఉంటుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. ఎప్పుడైనా సరే పడకగదిలో నారింజ, పసుపు, ఎరుపు రంగు వంటివి ఉండేలా చూసుకోవాలి. అప్పుడు దంపతుల మధ్య అనుకూలత చాలా బాగుంటుందని చెబుతున్నారు.
- బెడ్రూమ్లో బెడ్ మీద ఉపయోగించే దుప్పట్లు నలుపు, నీలం రంగులో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇలా ఉంటే.. దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందట.
- అలాగే.. మంచం మీద ఉపయోగించే దుప్పట్లపై త్రిభుజాకారం లేదా ఏదైనా కోణం ఆకారంలో గుర్తులు ఉండకుండా చూసుకోవాలి. అలా ఉన్న కూడా అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుందంటున్నారు.
- పడకగదిలో మొక్కలు ఉండకూడదట. ప్లాస్టిక్ కుండీలు బెడ్రూమ్లో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ఛాన్స్ ఉంటుందంటున్నారు.
- అంతేకాదు.. పడకగదిలో నీళ్లకు సంబంధించిన ఫొటోలు ఉండకుండా చూసుకోవాలి. అంటే.. వాటర్ ఫౌంటెయిన్, పర్వతాల నుంచి వాటర్ జారుతున్నట్లు ఉన్న చిత్రాలు వంటివి ఉండడం అంత మంచిది కాదంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్.
- ఇకపోతే.. బెడ్రూమ్లో మనం పడుకున్నప్పుడు మంచం నీడ పడకగది అద్దంలో పడకూడదు. అలా కనిపిస్తే దరిద్రం చుట్టుకుంటుందట. కాబట్టి.. ఈ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవీ చదవండి :
కొత్తగా పెళ్లైన వారు బెడ్రూమ్ ఇలా సెట్ చేసుకున్నారంటే - బంధం బలపడడం ఖాయం!
బెడ్రూమ్లో ఈ వస్తువులు ఉంచుతున్నారా? - అయితే నెగిటివ్ ఎనర్జీకి వెల్కమ్ చెబుతున్నట్టే!