ETV Bharat / spiritual

దీపావళికి కొత్త వాహనం కొంటున్నారా? మీ రాశి ప్రకారం ఏ రంగు వెహికల్ కొనాలో తెలుసా? - DIWALI 2024

దీపావళికి కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా? పండుగ రోజు కొత్త వాహనం కొనే వారి కోసం కొన్ని సూచనలు

Car Purchase Muhurat On Diwali 2024
Car Purchase Muhurat On Diwali 2024 (ETV Bharat, Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2024, 4:30 AM IST

Car Purchase Muhurat On Diwali 2024 : హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి అతి పెద్ద పండుగ. దీపావళి పండుగకు ప్రతి ఒక్కరు నూతన వస్తు వాహనాలు కొంటూ ఉంటారు. వస్తువుల సంగతి ఎలా ఉన్నా వాహనం కొనడమంటే ఎంతో ప్రత్యేకంగా కదా. మరి ఇంతటి ప్రత్యేకమైన పండుగ రోజు కొత్త వాహనం కొనే వారి కోసం కొన్ని సూచనలు ఈ కథనంలో చూద్దాం.
కలర్ థెరపీ ప్రభావం
పురాతన కాలం నాటి కలర్ థెరపీ ప్రకారం రంగులు మానవ మెదడు పైనా, శరీరం పైనా ప్రభావం చూపిస్తాయని అనడంలో సందేహం లేదు. భారతీయ ఆయుర్వేదంలో కూడా నిర్దిష్ట రంగుల ద్వారా శారీరక సమస్యలను సరి చేసే పద్ధతి ఉంది. అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశికి ఒక్కో రంగు ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. ఎంత చదువుకున్న వారైనా సరే ఖరీదైన కార్లు కొనేటప్పుడు ఇలాంటి విషయాలు జాగ్రత్తగా పరిశీలించి మరీ కొంటూ ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే. ఇదేమి మూఢనమ్మకం కాకపోయినా కొన్ని విషయాలు పాటించడంలో ఎవరికీ ఎలాంటి నష్టం లేనప్పుడు పాటించడంలో తప్పు లేదన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం. దీపావళి పండుగ సందర్భంగా కారు కొనాలనే వారు తమ రాశి ప్రకారం ఎలాంటి రంగు కారు కొంటే బాగుంటుందో చూద్దాం.

పండితులు ఏం చెబుతున్నారంటే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వాహనం శక్తి స్వరూపమని, మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని తెలుస్తోంది. అందుకే వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా జాతకం ప్రకారం తమ రాశికి సంబంధించిన రంగు వాహనాన్నే కొనుగోలు చేయాలి. దీంతో ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు. అలాగే ఆ వాహనంపై ఎక్కడికి వెళ్లి ఏ పని చేసినా కలసి వస్తుంది. కనుక ఎవరైనా సరే తమ రాశికి అనుగుణంగా కలర్‌ను ఎంపిక చేసుకుని దాని ప్రకారం వాహనాన్ని కొనుగోలు చేస్తే మంచిదని పండితుల అభిప్రాయం.

మేష రాశి
మేష రాశి వారు ఎరుపు రంగు వాహనాలను వాడితే మంచిది. ఈ రంగు వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే ప్రస్తుతం కొన్ని వాహనాలు మిక్సింగ్ కలర్‌లో వస్తున్నాయి. అలాంటప్పుడు మెయిన్ కలర్ రెడ్ ఉండేలా చూసుకోవాలి. దీంతో రాశి ప్రకారం వాహనానికి కలర్ సెట్ అవుతుంది. శుభ ఫలితాలను అందిస్తుందని పండితులు అంటున్నారు.

వృషభ రాశి
వృషభ రాశి వారు పింక్ లేదా తెలుపు రంగులో ఉండే వాహనాలను వాడితే మంచిది. ఈ రంగులు వారికి బాగా కలసి వస్తాయని, ఇలాంటి వాహనాలలో వారు చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

మిథున రాశి
మిథున రాశి వారు పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగుల్లో ఏదైనా వాడవచ్చు. ఆ రంగుల్లో ఉండే వాహనాలను కొనడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. మిక్సింగ్ కలర్‌లో ఉండే వాహనం కొంటే మెయిన్ కలర్ పసుపు, ఆకుపచ్చ ఉండేలా చూసుకుంటే చాలు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు బూడిద రంగు లేదా తెలుపు, సిల్వర్‌, క్రీమ్ కలర్లలో ఏ రంగు వాహనాన్ని అయినా వాడవచ్చు. ఈ రంగులలో ఉండే వాహనం వీరికి శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు అంటున్నారు.

సింహ రాశి
సింహరాశి వారు బంగారం, నారింజ, పర్పుల్ రంగుల్లో ఉండే వాహనాలను వాడితే మంచి జరుగుతుంది. ఈ రంగుల్లో ఉండే వాహనాలలో వీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రయోజనకరంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.

కన్యా రాశి
కన్యారాశి వారికి నీలం, ఆకుపచ్చ, పసుపు, తెలుపు రంగులు శుభ ఫలితాలను అందిస్తాయి. ఈ రంగుల్లో ఉండే వాహనాలను వాడడం శ్రేయస్కరమని పండితులు అంటున్నారు.

తుల రాశి
తుల రాశి వారు తెలుపు, నీలం రంగుల్లో ఉండే వాహనాలను వాడితే అనుకూల ఫలితాలను పొందవచ్చునని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు తెలుపు, ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉండే వాహనాలను వాడితే శుభకరమని పండితుల అభిప్రాయం.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు ముదురు పసుపు లేదా నారింజ రంగుల్లో ఉండే వాహనాలను వాడితే అనుకూల ఫలితాలు వస్తాయని తెలుస్తోంది.

మకరరాశి
మకరరాశి వారు నలుపు, పర్పుల్‌, ముదురు గోధుమ, ఆకుపచ్చ రంగుల్లో ఉండే వాహనాలను వాడడం వలన శుభ ఫలితాలు ఉంటాయని పండితులు అంటున్నారు.

కుంభరాశి
కుంభరాశి వారు నీలం, పర్పుల్‌, తెలుపు రంగుల్లో ఉండే వాహనాలను వాడితే మేలు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

మీనరాశి
మీనరాశి వారు పసుపు, నారింజ రంగుల్లో ఉండే వాహనాలను వాడితే అనుకూల ఫలితాలను పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.

మిక్సింగ్ కలర్స్ లో ఉంటే ఇలా!
ప్రస్తుతం చాలా వరకు వాహనాలను మిక్సింగ్ కలర్స్​లో వాస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే కలర్ కలిగిన వాహనాలు లభించడం కాస్త కష్టమే అని చెప్పవచ్చు. అయితే మిక్సింగ్ కలర్స్ ఉండే వాహనాలను తీసుకునే వారు వాటిల్లో మెయిన్ కలర్ లేదా అధిక భాగం కలర్ రాశి చక్రానికి సంబంధించినది అయి ఉండే విధంగా చూసుకోవాలి. దీంతో జాతక చక్రం సెట్ అవుతుంది. అనుకూల ఫలితాలు పొందవచ్చు.ఇంకెందుకు ఆలస్యం దీపావళికి కారు కొనాలనుకునే వారు మీ రాశికి సరిపడా రంగులో ఉండే కారును కొనుగోలు చేసి శుభఫలితాలను అందుకోండి.శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.