ETV Bharat / spiritual

సంతానం కోరుకునే వారు ఇలా చేస్తే శుభఫలితం! సోమవారమే సకల గ్రహ దోషాలు పోగొట్టే ఆడికృత్తిక- చేసేయండి మరి - Aadi Krithigai 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 8:16 PM IST

Aadi Krithigai 2024 : తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజును ఆడికృత్తిక అంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు విశేషమైన ఆడికృత్తిక రోజు చేయాల్సిన పూజలు, దానాలు, పాటించాల్సిన నియమాలు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Aadi Krithigai 2024
Aadi Krithigai 2024 (Getty Images)

Aadi Krithigai 2024 : తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో 28 నక్షత్రాలు వస్తుంటాయి. ఇందులో కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్యుడి జన్మ నక్షత్రమని శివ మహా పురాణం, స్కంద పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి నెలా వచ్చే కృత్తికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్యుని ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో దక్షిణాయనం మొదలయ్యాక వచ్చే కృత్తికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని శాస్త్రవచనం.

ఆడి కృత్తిక రోజు సుబ్రహ్మణ్యుని పూజకు శుభ సమయం
కృత్తికా నక్షత్రం జులై 29వ తేదీ సోమవారం ఉదయం 10 :57 నిమిషాలకు మొదలై జులై 30వ తేదీ మంగళవారం ఉదయం 10: 22 నిమిషాల వరకు ఉంది.

ఆడికృత్తిక - సుబ్రహ్మణ్యుని పూజా విధానం
తమిళనాట ఆడికృత్తిక పెద్ద పర్వదినంగా జరుపుకొంటారు. ఈ రోజు సంతానం కోరుకునే వారు నియమ నిష్టలతో ఉపవాసం ఉండాలి. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియై ముందుగా పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి. అలాగే వినాయకుడు, శివపార్వతుల చిత్రపటాలను కూడా ప్రతిష్టించుకోవాలి. సుబ్రహ్మణ్యుని ఎరుపు రంగు పూలతో పూజించాలి. ఎర్ర చందనం సమర్పించాలి.

పిండి దీపాలు
ఇంట్లో మడిగా తయారు చేసుకున్న బియ్యం పిండి, బెల్లం ఆవు నెయ్యితో తయారు చేసిన చలిమిడితో 5 ప్రమిదలు తయారు చేసుకోవాలి. ప్రమిదల్లో ఆవు నేతిని వేసి ఒక్కో ప్రమిదలో రెండేసి వత్తులు వేసి దీపారాధన చేయాలి. నువ్వులు, బెల్లం, నెయ్యి కలిపి చేసిన చిమ్మిలి, పచ్చి పాలు, వడపప్పు, అరటి పండ్లు షణ్ముఖునికి నివేదించాలి. చివరలో తాంబూలం సమర్పించి సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని దైవ ప్రసాదంగా పిండి దీపము, చిమ్మిలి, వడపప్పు, అరటి పండ్లు స్వీకరించాలి. ఆడికృత్తిక ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష అనుగ్రహం కలుగుతుంది.

ఆలయాలలో ఇలా పూజలు
ఈ రోజు సుబ్రహ్మణ్యుని ఆలయాలలో విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. సంతానం కోరుకునే వారు ఈ రోజు సుబ్రహ్మణ్యుని మొక్కి కావిళ్లు ఎత్తుతారు. కావిళ్లు ఎత్తలేని వారు ఈ కావిళ్ల కిందనుంచి వెళ్లినా సంతానం ప్రాప్తిస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజు అన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో జరిగే ఈ కావిళ్ల ఉత్సవం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.

తిరువణ్ణామలై ఇలా!
పంచభూత లింగాల్లో అగ్ని లింగంగా భాసిల్లుతున్న తిరువణ్ణామలై అంటే అరుణాచలంలో ఉన్న శ్రీరమణ మహర్షి సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపమని భక్తుల విశ్వాసం. ఆడికృత్తిక రోజు శ్రీ రమణుల ఆశ్రమంలో విశేషమైన పూజలు, అన్నదానాలు జరుగుతాయి. ఆడి కృత్తిక రోజు అరుణాచలానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షిణలు కూడా చేస్తారు.

చేయాల్సిన దానాలు
ఆడికృత్తిక రోజు బాలబ్రహ్మచారికి షడ్రసోపేతమైన భోజనం పెట్టి, ఎర్రటి పంచ, కండువా సమర్పించి శక్తిమేరకు దక్షిణ, తాంబూలం, అరటి పండ్లు, గొడుగు, పాదరక్షలు, రాగి పంచపాత్ర ఉద్దరిణ, అర్ఘ్య పాత్ర సమర్పించి, ఆ బాలబ్రహ్మచారిని సుబ్రహ్మణ్యునిగా భావించి ఆశీర్వచనం తీసుకుంటే విశేష ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం.

అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్న
ఒకవేళ బాలబ్రహ్మచారి లభించని పక్షంలో మధ్యాహ్న సమయంలో ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి కడుపు నిండుగా ఆహారం పెట్టినా మంచిదే. అదీ వీలుకాకపోతే పశు పక్షాదులకు ఆహారం సమర్పించి సుబ్రహ్మణ్యుని ప్రార్ధించినా ఉత్తమ ఫలితం ఉంటుందని శాస్త్ర వచనం.

ఆడికృత్తిక పూజాఫలం
నియమ నిష్టలతో ఆడికృత్తిక పూజ చేసుకుంటే సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. వయసు మీదపడినా వివాహం కానివారికి వివాహం జరుగుతుంది. సంతానం వృద్ధిలోకి వస్తారు. ముఖ్యంగా మందమతులు, జడులు, మతిస్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృత తుల్యంగా పనిచేస్తుంది. జ్ఞానం కోరుకునే వారికి జ్ఞానం, మోక్షం కోరుకునే వారికి మోక్షం సిద్ధిస్తుంది. ఈ ఆడికృత్తిక రోజు మనం కూడా సుబ్రహ్మణ్యుని పూజిద్దాం. తరిద్దాం.

ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.