- దేశంలోని పవిత్ర నగరాలు- 108
- భరతనాట్యంలో భంగిమలు- 108
- ఉపనిషత్ల సంఖ్య- 108
- జపమాలలో ఉండే పూసలు- 108
గుడిలో 108 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకుంటాం- 108 ప్రదక్షిణలు చేయాలని అంటుంటాం- ఇలా సనాతన సంస్కృతిలో ఎక్కడ చూసినా 108 సంఖ్య గురించే వినిపిస్తోంది. నిజానికి 108 సంఖ్యకు విశేష ప్రాధాన్యం ఉంది. ధర్మశాస్త్రాల్లో 108 సంఖ్యను ఎంతో పవిత్రమైనదిగా, పరిపూర్ణమైనదిగా భావిస్తారు. అందుకే 108తో ముడిపడిన అనేక అంశాలు మనకు మేలు చేస్తాయని అన్ని ధర్మశాస్త్రాల్లో వివరించారు. చూడ్డానికి చిన్న సంఖ్య అయినప్పటికీ దీనికి చాలా లోతైన, శాస్త్రీయ వివరణలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
108 అంటే అమృతతత్వం
108 Number Importance In Hinduism : 108 సంఖ్యను అమృతతత్వానికి చిహ్నంగా వివరిస్తారు. సముద్ర మథనం చేసే సమయంలో 54 మంది దేవతలు, 54 మంది రాక్షసులు పాల్గొని, పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని బయటకు తీశారు. ఇలా అమృతాన్ని బయటకు తీయడంలో 54 మంది దేవతలు, 54 మంది రాక్షసులు మొత్తం 108 మంది కలిసి కృషి చేశారు. అందుకే 108కి అమృతతత్వం ఉందని మన పురాణాల్లో వివరించారు.
ఆయుర్వేదంలో 108 :
ఆయుర్వేద శాస్త్రంలోనూ 108కి ప్రాధాన్యం ఉందని తేలింది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరానికి 108 ఆయువు పట్లు ఉంటాయని, ఈ ఆయువు పట్లలో ఏర్పడిన సమస్యను గుర్తించి పరిష్కరిస్తే ఆరోగ్య సమస్యలు తీరుతాయి.
ఖగోళశాస్త్రంలో 108:
వేల ఏళ్ల క్రితమే భూమికి, చంద్రుడికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరాన్ని లెక్కించిన మన పూర్వీకులు 108 ప్రాధాన్యంను నాడే గుర్తించారు. సూర్యుడి చుట్టు కొలతతో 108 సంఖ్యను గుణిస్తే భూమికి, సూర్యుడికి మధ్య దూరం లెక్కకట్టవచ్చు. అలాగే చంద్రుడి చుట్టుకొలతను 108 సంఖ్యతో గుణిస్తే భూమికి, చంద్రుడికి మధ్య దూరం లెక్క తేలుతుంది.
జ్యోతిష్యంలో 108 సంఖ్య:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులు, నవగ్రహాలు 9 ఉన్నాయి. ఈ ద్వాదశ రాశుల వారికి నవ గ్రహాల వల్ల కలిగే ఫలితాలను లెక్కించడానికి 108 సంఖ్యకు విశేష ప్రాధాన్యం ఉంది. అలాగే జ్యోతిష్యం ప్రకారం 27 నక్షత్రాలు, ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. అంటే మొత్తం 108.
ఆధ్యాత్మికపరంగా 108 సంఖ్య:
హిందువులకు ఎంతో పవిత్రమైన ఉపనిషత్తులు 108 ఉన్నాయి. అలాగే జపమాలలో 108 పూసలు ఉంటాయి. 108 నామాలతో దేవుడి అర్చన చేయడానికి అష్టోత్తర శతనామావళి చేస్తారు. భగవంతుడి 108 నామాలను ఎవరైతే పలుకుతారో, ఎవరైతే చదువుతారో, వింటారో వారి జాతక దోషాలు అన్నీ తొలుగుతాయని భక్తుల విశ్వాసం.
108 సంఖ్యలోని అంకెలు అయిన 1, 8లను కలిపితే 9 వస్తుంది. 9 సంఖ్య అంటే పూర్ణతత్వానికి ప్రతిరూపం. అందుకే 'నజహాతి పూర్ణరూపం నవమీ సంఖ్యైవ' అని వివరించారు. పూర్ణత్వానికి ప్రతిరూపమైన రాముడు నవమి రోజునే జన్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">