ETV Bharat / politics

ప్రభుత్వానికి సమాంతరంగా సొంత సైన్యం- వైసీపీ ప్రచారంలో ఎమ్మెల్వోలు - YSRCP Politics IN AP - YSRCP POLITICS IN AP

YSRCP Political Strategies with MLOs: వాలంటీర్లకు శిక్షణ కోసమంటూ వాళ్లను నియమించారు. నాలుగున్నరేళ్లపాటు కోట్ల రూపాయల ప్రజాధనం జీతభత్యాలుగా చెల్లించారు. ప్రజలు, ఓటర్ల సమస్త సమాచారాన్ని వాళ్లు సేకరించి పెట్టుకున్నారు. ఇప్పుడు వైసీపీ అనుకూల ప్రచారానికి వినియోగిస్తున్నారు. ఒప్పందం గడువు ముగిసినప్పటికీ వాలంటీర్లతో వాళ్లు అంటకాగుతునే ఉన్నారు.

YSRCP_Political_Strategies_with_MLOs
YSRCP_Political_Strategies_with_MLOs
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 8:38 AM IST

ప్రభుత్వానికి సమాంతరంగా సొంత సైన్యం- వైసీపీ ప్రచారంలో ఎమ్మెల్వోలు

YSRCP Political Strategies with MLOs: 'మీకు ఇదే చివరి ఛాన్స్‌. ఇకపై గ్రూప్‌ నుంచి ఎవరు వైదొలిగినా వారి పేర్లను ప్రభుత్వానికి నివేదిస్తాం. తర్వాత విషయం సీరియస్‌గా ఉంటుంది' అంటూ ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలోని వాలంటీర్లకు ఎమ్మెల్వో మురళీరెడ్డి మంగళవారం పెట్టిన సందేశం ఇది.

'మీ క్లస్టర్‌ పరిధిలోని కుటుంబాలకు చెందిన అత్యధిక ఓట్లు వైసీపీకి పడేలా చూడాలి. రాబోయే రోజుల్లో సమయస్ఫూర్తితో పనిచేయాలి. తెలివిగా ప్రచారాన్ని నిర్వహించాలి. మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే మాకు సమాచారమివ్వండి. చేతనైన సాయం చేస్తాం' అంటూ వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో వాలంటీర్లకు ఎమ్మెల్వో ఇటీవల పెట్టిన సందేశమిది.

'వైసీపీకి ఓటేసేలా జనాన్ని మోటివేట్‌ చేయాలి. జగనన్న మిమ్మల్ని వాలంటీర్లుగా నియమించారు. మేం చెప్పినట్టు వినాలి. లేకపోతే వచ్చే ప్రభుత్వంలో వాలంటీర్లుగా మిమ్మల్ని తీసుకోం. వేరేవారిని నియమించుకుంటాం' అంటూ గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్వో వాలంటీర్లను హెచ్చరించారు.

'వాలంటీర్‌ పోస్టుకు రాజీనామా చేయాలి. ఇది పైనుంచి వచ్చిన ఆదేశం. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. వైసీపీ అధికారంలోకి రాగానే మిమ్మల్నే మళ్లీ తీసుకుంటాం' అంటూ అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వాలంటీర్లకు ఎమ్మెల్వో ఇటీవల దిశానిర్దేశం చేశారు. ఇక్కడ ఎమ్మెల్వో అంటే ఎవరనే కదా మీ సందేహం? ఈయన్ను మండల స్థాయి అధికారి అని పిలవాలని జగన్‌ నిర్దేశించారు.

వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించేందుకు: ఈ హోదా చూసి ప్రభుత్వ అధికారేమో అనుకుంటే పొరపాటే. వైసీపీకి వేగు. వాలంటీర్లను వినియోగించుకుని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అధీకృతంగా దొంగలించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ఇన్నాళ్లూ ఏర్పాటు చేసుకున్న సొంత సైన్యం. ఇలాంటి వారిని రాష్ట్రవ్యాప్తంగా 1,000 మందికిపైగానే నియమించుకున్నారు.వాలంటీర్లకు శిక్షణ ఇచ్చే నెపంతో ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ మాటున నాలుగున్నరేళ్లపాటు 260 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎమ్మెల్వోలకు జీతభత్యాలుగా చెల్లించారు. జనాల సమస్త సమాచారాన్ని సేకరించి గుప్పిట పెట్టుకున్నారు. ఎన్నికలు దగ్గర పడేసరికి ఎమ్మెల్వోలకు వేసిన ముసుగును జగన్‌ తీసేశారు. ఎఫ్​ఓఏ పేరిట రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఎమ్మెల్వోలను వైసీపీకి స్లీపర్‌సెల్స్‌లా ప్రజలపైకి వదిలారు. ప్రభుత్వాధిపతిగా ఉండి పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ప్రైవేట్‌ సంస్థ చేతిలో పెట్టడం తీవ్రమైన నేరం. ఇది తెలిసీ జగన్‌ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.

ఎసైన్డ్‌ భూములు కొల్లగొట్టి - కోట్లకు పడగలెత్తి - assigned lands purchase

ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్వో: ఇప్పుడు ఇదే సమాచారంతో ఎన్నికల్లో వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు ఎమ్మెల్వోలు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల వెంట తిరుగుతున్నారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ముగిసినా వాలంటీర్లను గుప్పిట పెట్టుకుని పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడిపిస్తున్నారు. వైసీపీకి ఓటేయించాలనే ప్రచారాన్ని వాలంటీర్ల ద్వారా ప్రజల్లోకి పంపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇది విశృంఖలంగా కొనసాగుతున్నా ఎన్నికల సంఘం అధికారులు, కలెక్టర్లు కళ్లకు గంతలు కట్టుకుని చూస్తున్నారు.

జగన్‌ ప్రజాపాలకునిగా ఉండి పార్టీకి వ్యక్తిగత లబ్ధి చేకూర్చుకునేందుకు ప్రభుత్వానికి సమాంతరంగా ఒక కరడుగట్టిన వ్యవస్థను నడిపారు. అదీ ప్రజాధనంతో నడిపించారు. ఈ నియామకం వెనుక పెద్ద కుట్రే ఉంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు వ్యూహాన్ని పన్ని వైసీపీకి అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి పెట్టుకునేందుకు, వాలంటీర్ల ద్వారా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఎఫ్‌ఓఏ అనే సంస్థను నియమించుకున్నారనే విషయం ఇప్పుడు బట్టబయలైంది.

ఏడాదికి రూ.65 కోట్ల చొప్పున: ఈ సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,000 మందికిపైగా ఎమ్మెల్వోలను 2019 డిసెంబర్‌లో నియమించారు. మండల లేదా పురపాలక స్థాయిలో ఒకరు చొప్పున 1,000 మందికి పైగానే ఉన్నారు. జిల్లా స్థాయిలో ఒక్కో జిల్లాకు ఇద్దరు చొప్పున మొత్తం 50మంది వీరిని పర్యవేక్షిస్తున్నారు. మండల, జిల్లా స్థాయిల్లోని ఎమ్మెల్వోలను సమన్వయం చేసుకునేందుకు రాష్ట్రస్థాయిలో మరో 5మందిని నియమించారు. నాలుగేళ్లుగా వీరికి ఏడాదికి 65 కోట్ల రూపాయల చొప్పున సుమారు రూ.260 కోట్ల ప్రజాధనాన్ని జీతంగా చెల్లించారు. ఇప్పుడు వీరి ద్వారానే వాలంటీర్లతో వైసీపీ అనుకూల ప్రచారాన్ని చేయిస్తున్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎమ్మెల్వోలు నాలుగున్నరేళ్ల పాటు విధుల్లో ఉన్నా ఎంపీడీవో నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు ఏ అధికారికీ వీరిపై అజమాయిషీ లేదు. వీరు సేకరిస్తున్న వివరాలు ఎక్కడి వెళుతున్నాయో? వాటితో ఏం చేస్తున్నారో అంతా గోప్యమే.

'ఆ పత్రాలు IRR కేసుకు సంబంధించినవే' సీఐడీ ధ్రువీకరణ - దహనంపై టీడీపీ ఆగ్రహం - Inner Ring Road case files

పట్టించుకోని అధికారులు: దర్జాగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి కావాల్సిన సమాచారాన్ని తీసుకున్నా అధికార యంత్రాంగం నిద్ర నటించింది. వాలంటీర్ల పరిధిలోని కుటుంబాల సమాచార సేకరణ, క్లస్టర్ల వారీగా పార్టీల బలాబలాలు, పథకాలపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ, ఎవరు ఏ పార్టీకి ఓటేసే అవకాశముందో ఆరా తీయడం, వాలంటీర్ల వాట్సప్‌ గ్రూపుల్లో వైసీపీ అనుకూల ప్రచారం వంటివి ఎమ్మెల్వోలు ఇన్నాళ్లూ చేశారు. ఎమ్మెల్వోల విధుల గడువు ఫిబ్రవరితోనే ముగిసింది. వారు వాలంటీర్లతో సమావేశాలు పెట్టేందుకు, సమాచారం సేకరించేందుకు వీల్లేదు. కానీ క్షేత్రస్థాయిలో వాలంటీర్లతో ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల పరిధిలోని ఓటర్ల వివరాలు సేకరించారు. వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, విజయనగరం తదితర చోట్ల వివరాలు తీసుకున్నారు.

వాట్సప్​ గ్రూపుల్లో బెదిరింపులు: పలు నియోజకవర్గాల పరిధిలో క్లస్టర్ల వారీగా వైసీపీకి అనుకూలంగా ఓటేసేవారు ఎంతమంది? తటస్థులు ఎవరు? టీడీపీ, ఇతర పార్టీలకు ఓటేసే వారెవరనే వివరాలు సేకరించారు. ఎన్నికల్లో వైసీపీకి ప్రచారాన్ని నిర్వహించేందుకు వీలుగా రాజీనామాలు చేయాలని కొన్నిచోట్ల వాలంటీర్లను బెదిరిస్తున్నారు.ఇప్పటివరకు వాలంటీర్లకు ప్రభుత్వమిచ్చిన నంబర్‌ ఆధారంగా ఎమ్మెల్వోలు వాట్సప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంఘం వాలంటీర్లపై చర్యలకు దిగుతుండటం, వారి అధికారిక ఫోన్‌, నంబర్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో వైసీపీ వ్యూహం మార్చింది. అధికారుల కంటపడకుండా ఉండేందుకు ఎమ్మెల్వోలు వాలంటీర్ల వ్యక్తిగత మొబైల్‌ నంబర్లు తీసుకుని వాటితో ప్రత్యేక వాట్సప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో వైసీపీ అనుకూల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ పోస్టులను పెడుతున్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాలంటీర్లు వారి పరిధిలోని 50 కుటుంబాలతో ప్రత్యేక వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ప్రతిపక్షాలపై దుష్ప్రచారం కోసం: ఇప్పటికే చాలాచోట్ల వాటిని ఏర్పాటు చేయించారు కూడా. ఈ గ్రూప్‌ల నుంచి ఏ వాలంటీర్‌ కూడా బయటికి వెళ్లడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. నూజివీడు నియోజకవర్గంలో ప్రతి బీఎల్వో పరిధిలో ముగ్గురు వాలంటీర్లను నియమించారు. వారు పోలింగ్‌ వరకు వైసీపీ నిర్దేశించే అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని ఆదేశించారు.సరిపడా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులున్నా ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్న వైసీపీ ఆ నెపాన్ని టీడీపీపై నెట్టేలా దుష్ప్రచారం చేయిస్తోంది. దీనికీ ఎమ్మెల్వోలనే రంగంలోకి దింపింది. వైసీపీ పెట్టిన పోస్టులను వారు వాలంటీర్ల గ్రూపుల్లో విస్తృతంగా పోస్ట్‌ చేశారు. వారి పరిధిలో ఉండే పింఛనుదార్లకు ఈ విషయం చెప్పాలని ఉసిగొల్పారు.

'జగనన్న సందేశాలు, మ్యానిఫెస్టోను ప్రతి ఒక్కరికీ వాట్సప్‌ ద్వారా పంపాలి. వీలుంటే ప్రత్యక్షంగా కలిసి తెలియజేయాలి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని విధుల్లోంచి తీసేసినా వైసీపీ మళ్లీ అధికారంలోకి రాగానే తీసుకుంటాం. వైసీపీ అభ్యర్థులకు మీ పరిధిలోని ఓటర్లతో ఓటేయించాలి' వంటి సందేశాలను ఎమ్మెల్వోలు వాలంటీర్లకు పంపిస్తున్నారు.

అరాచక 'గ్రంథం'- గోదావరి జిల్లాల్లో పేట్రేగిపోతున్న వైసీపీ నేత - YSRCP Leader Irregularities

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.