ETV Bharat / politics

తెలియదు, గుర్తు లేదు - పోలీసులకు సజ్జల సమాధానం - SAJJALA NO ANSWERS

సజ్జలను విచారించిన మంగళగిరి పోలీసులు - ఫోన్ అడిగినా ఇవ్వలేదు

Sajjala No Answer to Questions in Police Enquiry
Sajjala No Answer to Questions in Police Enquiry (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2024, 9:36 PM IST

Updated : Oct 17, 2024, 10:53 PM IST

YSRCP Leader Sajjala Ramakrishna Reddy No Answer to Questions in Police Enquiry: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు విచారించారు. సాయంత్రం పోలీస్​స్టేషన్​కు వచ్చిన సజ్జలను మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, గ్రామీణ సీఐ శ్రీనివాసరావు ప్రశ్నించారు. పోలీసులు ముందే సిద్ధం చేసుకుని అడిగిన 38 ప్రశ్నలకు సజ్జల సరైన సమాధానం ఇవ్వకుండా తెలియదు, గుర్తు లేదని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఏ120 సజ్జలను విచారించగా ఆయన సహకరించలేదని మంగళగిరి గ్రామీణ సిఐ వై శ్రీనివాసరావు తెలిపారు. పక్కా ఆధారాలతో సజ్జలను ప్రశ్నించామని తెలిపారు. సజ్జలను ఫోన్ అడిగినా ఇవ్వలేదని, మా ప్రశ్నలకు వ్యతిరేక ధోరణిలో సమాధానాలు ఇచ్చారని తెలిపారు.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలను విచారించాం. ముందుగా సిద్ధం చేసుకున్న 38 ప్రశ్నలు అడిగాం. చాలా ప్రశ్నలకు తెలియదు, గుర్తు లేదనే సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వంలో సజ్జల సలహాదారుగా ఉన్నారు. మా వద్ద ఉన్న ఆధారాలతో సజ్జలను ప్రశ్నించాం. సజ్జలను ఫోన్ అడిగినా ఇవ్వలేదు. విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి సహకరించలేదు. మా ప్రశ్నలకు వ్యతిరేక ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. ఘటన జరిగిన రోజు తాను అక్కడ లేనని చెప్పారు. ఈ కేసులో సజ్జల పాత్ర ఉన్నట్లు మా వద్ద ఆధారాలున్నాయి. మూడు నెలలుగా ఈ కేసును విచారించాం. కేసు దర్యాప్తు దాదాపు చివరకు వచ్చింది. చాలామంది నిందితులు కోర్టుల ద్వారా రక్షణ పొందారు. దీనివల్ల కేసు విచారణ వేగంగా జరగట్లేదు. నిందితులను అరెస్టు చేస్తే విచారణ త్వరగా పూర్తవుతుంది. కేసును ప్రభుత్వం సీఐడీకి ఇచ్చింది. ఉత్తర్వులు రాగానే విచారణ దస్త్రాలను సీఐడీకి ఇస్తాం'. - మంగళగిరి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు

ఇదిలావుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీని వేధించటమే పనిగా పెట్టుకుందని సజ్జల అన్నారు. ప్రజల సంక్షేమం, పరిపాలనను గాలికి వదిలేసిందన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమం, పరిపాలన గురించి వదిలేసి.. కేవలం తమ పార్టీ వారిని వేదించటం పనిగా పెట్టుకున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేయటం కోసమే పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. ఘటన జరిగిన రోజు తాను ఇక్కడ లేను. చాలా దూరంలో ఉన్నట్లు ఆధారాలను విచారణ అదికారులకు ఇచ్చాను. దర్యాప్తు పేరిట జరుగుతున్నది పార్స్. టీడీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన తప్పుడు సంస్కృతికి బదులు ఇలాగే ఉంటుంది. 2019 నుంచి మేము ఇలా అనుకుంటే టీడీపీ వాళ్లు చాలా ఇబ్బంది పడేవారు. -సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి

అంతకుముందు విచారణకు హాజరైన సమయంలో సజ్జలతో పాటు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా స్టేషన్‌ వద్దకు వచ్చారు. విచారణాధికారి వద్దకు తనను కూడా అనుమతించాలని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పొన్నవోలు వేలు చూపించి మరీ పోలీసులను బెదిరించారు.

పోలీసుల ఎదుట అప్పటి సకల శాఖ మంత్రి సజ్జల – వేలు చూపించి పొన్నవోలు వాగ్వాదం

Last Updated : Oct 17, 2024, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.