ETV Bharat / politics

పరారీలో మాజీ ఎంపీ నందిగం సురేష్- ఫోన్​ స్విచాఫ్​, గాలిస్తున్న పోలీసులు - Nandigam Suresh Escaped - NANDIGAM SURESH ESCAPED

Nandigam Suresh Escaped When Police Went to Arrest Him: వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో ముందస్తు బెయిల్‌కు నిరాకరిస్తూ ఉన్నత న్యాయస్థానం బుధవారం ఉదయం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మాజీ ఎంపీ నందిగం సురేష్​ను అరెస్టు చేయడానికి ఆయన ఇంటికి పోలీసులు వెళ్లగా ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుతిరిగారు.

nandigam_suresh_escaped
nandigam_suresh_escaped (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 4:25 PM IST

Updated : Sep 4, 2024, 5:05 PM IST

Nandigam Suresh Escaped When Police Went to Arrest Him: వైఎస్సార్​సీపీ నేతలకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో ముందస్తు బెయిల్‌కు నిరాకరిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు 2 వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని వైఎస్సార్​సీపీ నేతలు ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై హైకోర్టు నిర్ణయం వెలువరించింది. వైఎస్సార్​సీపీ నేతల విజ్ఞప్తిని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం నిందితులుగా ఉన్నారు. చంద్రబాబు నివాసంపై దాడికేసులో జోగి రమేశ్‌ నిందితుడిగా ఉన్నారు.

పరారీలో నందిగం సురేష్: నందిగం సురేష్ హైకోర్టులో పిటీషన్​ను కొట్టేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. నందిగం సురేష్​ను అరెస్టు చేసేందుకు తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్లారు. తుళ్లూరు సీఐ వెంకటేశ్వర్లు, మరో 15 మంది సిబ్బందితో సురేష్ నివాసానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సురేష్ అక్కడి నుంచి పారిపోయారు. దాదాపు 15 నిమిషాలు ఎదురు చూసిన పోలీసులు సురేష్ రాకపోవడంతో వెనుదిరిగారు. సురేష్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపడతున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఈ ఉదయం నుంచి ఏయే ప్రాంతంలో సురేష్ ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఎలాగైనా అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

న్యూడ్‌ కాల్స్‌ వివాదమే హిడెన్‌ కెమెరాల ప్రచారం - ఫేక్‌ న్యూస్‌ వెనుక హైదరాబాద్ యూట్యూబర్‌ - విచారణ బృందాల నివేదిక ఇదే - Nude calls controversy in college

ప్రజలకు సేవ చేయడంతో పాటు రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తోంది : సీఎం చంద్రబాబు - cbn fire on jagan

Last Updated : Sep 4, 2024, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.