ETV Bharat / politics

కడప ఎంపీగా వైఎస్‌ బిడ్డ కావాలో, హంతకుడు కావాలో ప్రజలే తేల్చుకోవాలి: షర్మిల - YS Sharmila Election Campaign - YS SHARMILA ELECTION CAMPAIGN

YS Sharmila Election Campaign: కడప ఎంపీగా వైఎస్‌ బిడ్డ కావాలో, హంతకుడు అవినాష్‌ కావాలో ప్రజలే తేల్చుకోవాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిందితులను సీఎం హోదాలో జగన్‌ కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. ఓటు వేసే ముందు ధర్మం ఎవరివైపు ఉందో చూసి వేయాలన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న షర్మిలకు ప్రజలు మద్దతివ్వాలని వైఎస్‌ వివేకా కుమార్తె సునీత విజ్ఞప్తి చేశారు.

ANDHRA PRADESH ELECTIONS 2024
YS Sharmila Election Campaign
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 5:48 PM IST

ఎంపీగా వైఎస్‌ బిడ్డ కావాలో, హంతకుడు కావాలో ప్రజలే తేల్చుకోవాలి: షర్మిల -

YS Sharmila Election Campaign : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరు పాత బస్టాండ్‌ వద్ద షర్మిల షర్మిల ప్రసంగించారు. రాముడికి లక్ష్మణుడు ఎలానో వైఎస్‌కు వివేకా అలాంటి వారని తెలిపారు. ఎప్పుడు, ఎక్కడికి పిలిచినా వివేకానందరెడ్డి వచ్చేవారని గుర్తు చేశారు. వివేకానే వెళ్లి సమస్య పరిష్కరించి వచ్చేవారని అన్నారు. కడప స్టీల్‌ప్లాంట్‌కు వైఎస్‌ శంకుస్థాపన చేశారని, ఇంతవరకు దానిని పూర్తిచేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు దానిని శంకుస్థాపనల ప్రాజెక్టుగా మార్చేశారని దుయ్యబట్టారు.

అవినాష్‌ పాత్ర ఉందని సీబీఐ చెప్పింది: వివేకా హత్యలో అవినాష్‌ పాత్ర ఉందని స్వయానా సీబీఐ చెప్పిందన్న షర్మిల, ఇవాళ్టివరకు ఒక్కసారైనా అవినాష్‌ను జైలుకు పంపలేదని అన్నారు. నిందితులను సీఎం హోదాలో ఉన్న జగన్‌ కాపాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అధికారమిస్తే హంతకుడిని జగన్‌ కాపాడుతున్నారన్న షర్మిల, ఐదేళ్లుగా హంతకుడిని వెనకేసుకొస్తూనే ఉన్నారని విమర్శించారు.

పులివెందుల ప్రజలారా కొంగుచాచి అడుగుతున్నాం- న్యాయం చేయండి: షర్మిలా, సునీత - Sharmila Election Campaign

ధర్మం ఎవరివైపు ఉందో చూసి ఓటు వేయాలి: నిందితుడు అవినాష్‌కే మళ్లీ టికెట్‌ ఇవ్వడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. ఎంపీగా వైఎస్‌ బిడ్డ కావాలో, హంతకుడు అవినాష్‌ కావాలో ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేసే ముందు ధర్మం ఎవరివైపు ఉందో చూసి వేయాలని కోరారు. అభ్యర్థిగా అవినాష్‌ను మారుస్తారనే వార్తలు వస్తున్నాయన్న షర్మిల, అవినాష్‌ను మారుస్తున్నారంటే సీబీఐ చెప్పింది నిజమేనని నమ్ముతున్నారా అని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేయరు, అవినాష్‌ ఓడిపోతారని తెలిసే మారుస్తున్నారా అని నిలదీశారు. హత్యా రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో జగన్‌ చెప్పాలని అన్నారు.

వివేకా గొడ్డలి పోటుతో చనిపోతే, సాక్షి ఛానల్‌లో గుండెపోటు అని చిత్రీకరిస్తారా? అని ధ్వజమెత్తారు. గుండెపోటు అని ఎందుకు చిత్రీకరించారో జగన్‌ సమాధానం చెప్పాలన్న షర్మిల, ముందుగా సీబీఐ విచారణ కోరి సీఎం అయ్యాక ఎందుకు వద్దన్నారని ప్రశ్నించారు. హంతకులకు అధికారం ఉండకూడదనే తాను పోటీచేస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు. ధర్మం వైపు ఉన్న తనను ఆశీర్వదించాలని కోరుతున్నానన్నారు.

పులివెందులకు రండి - వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం : షర్మిల - YS Sharmila election campaign

YS Sunitha Comments: గత ఎన్నికల్లో షర్మిలకు మద్దతు తెలుపుతారేమోనని వివేకాను దారుణంగా చంపేశారని, తీరా ఆరా తీస్తే చంపింది తన వాళ్లే అని తెలిసి బాధపడ్డానని వైఎస్‌ వివేకా కుమార్తె సునీత వెల్లడించారు. వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరు పాత బస్టాండ్‌ వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిలతో కలిసి పాల్గొన్న సునీత, తప్పు ఎవరు చేసినా శిక్షించాల్సిందేనన్నారు. నిందితులకు శిక్షపడలేదని, అందుకే న్యాయ పోరాటం చేస్తున్నానని అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న షర్మిలకు ప్రజలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.

వివేకానందరెడ్డి రాజకీయ అజాతశత్రువు అని, ఆయనకి ఎవరిపై కోపం, ద్వేషం ఉండదని అన్నారు. ఏ పని చేయాలన్నా కులం, మతం, ప్రాంతాలు చూసేవారు కాదని తెలిపారు. వివేకానందరెడ్డిని దారుణంగా హత్యచేశారన్న సునీత, గొడ్డలితో నరికి ఇంత క్రూరంగా చంపడానికి వాళ్లకు మనసెలా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వివేకా ఘాట్‌ వద్ద నివాళులర్పించిన షర్మిల: అంతకు ముందు వైఎస్ షర్మిల వివేకానంద రెడ్డి సమాధికి నివాళులర్పించారు. న్యాయ యాత్రలో భాగంగా వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె, పులివెందులలో సోదరి సునీతా రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వివేకా ఘాట్ వద్దకు వెళ్లారు. వివేకా సమాధి వద్ద పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం అక్కడే ఉన్న స్థానికులతో కలిసి మాట్లాడారు. నేడు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో షర్మిల ప్రచారం నిర్వహిస్తున్నారు.

అవినాశ్​ను ఓడించి జగన్‌కు బుద్ధి చెప్పండి - పులివెందుల ప్రజలకు వైఎస్ షర్మిల, సునీత పిలుపు - Sharmila election campaign

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.