YS Sharmila Allegations on Jagan : రాజకీయ కాంక్షతోనే తన చెల్లెలు వ్యవహరిస్తోందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. భర్త, పిల్లలను వదిలి జగన్ కోసమే వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశానని భావోద్వేగానికి గురయ్యారు. అప్పట్లో తన అన్న కోసమే పనిచేశానని బైబిల్‌పైనా ప్రమాణం చేసి చెబుతానని ఇందుకు మీరు సిద్ధమా? అని జగన్‌ను ప్రశ్నించారు. మీ కోసం పనిచేసిన చెల్లిని గౌరవించకపోగా మానసికంగా హింసిస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేయించిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని షర్మిల అన్నారు.
YS Sharmila Questions TO Ys Jagan : ఒకే కుటుంబం నుంచి ఇద్దరు రాజకీయాల్లో ఉంటే ఇబ్బందని జగన్ అన్నారు. అసలు నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా అని షర్మిల ప్రశ్నించారు. జైలులో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమన్నది మీరు కాదా అని ప్రశ్నించారు. భర్త, పిల్లలను వదిలి వేల కి.మీ. పాదయాత్ర చేశానని కాలికి గాయమైనా మీ భవిష్యత్తు కోసం పనిచేశానని అన్నారు. పాదయాత్ర సమయంలో వైసీపీ అంతా నా చుట్టే తిరిగిందని రాజకీయ కాంక్ష ఉంటే అప్పుడే పార్టీని హైజాక్ చేసేదాన్ని కాదా? అని అన్నారు. మీనుంచి పైసా సాయం కోరినట్టయినా నిరూపించగలరా? అని అన్నారు. ఇలా మాట్లాడి మీరు వైఎస్ కుమారుడినని ఎందుకు మరిచిపోతున్నారని అన్నారు. రాజకీయ విభేదాలున్న చాలామంది ఒకే కుటుంబంలో ఉన్నారని షర్మిల తెలిపారు.
YS Sharmila Comments On Smear campaign : వైసీపీ నాయకులు సోషల్ మీడియా ద్వారా తనపై దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న బిడ్డనన్న కనీసం ఇంగితం లేకుండా 'నాపై, నా పుట్టుకపై దుష్ప్రచారం చేస్తున్నారని' షర్మిల అన్నారు. జగన్ తన రాక్షస సైన్యంతో నాపై ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు. తనపై వికృత ప్రచారం చేయించిన జగన్ చరిత్రలో నిలుస్తారని అన్నారు. మీ కోసం పనిచేసిన చెల్లిని గౌరవించకపోగా మానసికంగా హింసిస్తారా అని ప్రశ్నించారు. చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేయించిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. జగన్‌కు చంద్రబాబు పిచ్చిపట్టుకుంది అందుకే భ్రమల్లో బతుకుతున్నారని దుయ్యబట్టారు. జగన్ మానసిక పరిస్థితిపై నాకు ఆందోళనగా ఉందని షర్మిల అన్నారు.
గొడ్డలితో మిగతావాళ్లను నరికేయండి - వైఎస్ భారతిపై షర్మిల ఫైర్ - YS Sharmila comments ys bharathi