YS Sharmila Allegations on Jagan at Congress Meeting: అనంతపురంలో 'న్యాయ సాధన' పేరుతో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.పేదలకు ఒక గ్యారంటీ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు 5 వేల రూపాయలు ఖాతాలో వేస్తామన్నారు. పేదల కోసం కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇస్తోందని ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు అమలు చేస్తోందని ఖర్గే తెలిపారు.
YS Sharmila on Jagan: జగన్ పాలనలో మూడు రాజధానులు చేస్తామన్నారు కానీ మూడింట్లో రాష్ట్రానికి కనీసం ఒక్క రాజధాని అయినా ఉందా అని షర్మిల ప్రశ్నించారు. జగన్ ప్రజలకు సమాధానం చెప్పాకే ఓట్లు అడగాలని అన్నారు. జగనన్న పాలనలో వ్యవసాయం అధ్వాన్న స్థితిలో ఉందని రైతులను ఆదుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని నేడు అప్పు లేని రైతు లేడని అన్నారు. అలానే వారు పండించే పంటకు మద్దతు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పంట మద్దతు ధర కోసం రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి హామీ ఏమైందని పంట నష్టపరిహారం కోసం రూ.4 వేల కోట్లతో నిధి హామీ ఏమైందని షర్మిల ప్రశ్నించారు.
వైఎస్ షర్మిల అరెస్ట్ - మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలింపు
జగన్ పాలనలో ఒక్క ప్రాజెక్టూ పూర్తికాలేదు: అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న జగనన్న హామీ ఇచ్చారు కానీ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. మద్యపానం నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పడు ప్రభుత్వమే నాసిరకం మద్యం అమ్ముతుందని దీనికి జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. చెల్లి అని చూడకుండా జగన్ వ్యక్తిగతంగా దూషిస్తున్నారని షర్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులతో సైన్యాన్ని పెట్టి సోషల్ మీడియాలో దూషిస్తున్నారని అన్నారు. ఒకప్పుడు జగనన్న కోసం 3200 కి.మీ పాదయాత్ర చేసి పార్టీని నడిపించాను కానీ ఇప్పడు నా గురించి, నా భర్త గురించి ఇష్టారీతిన దూషిస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాజధానికి మరో రెండేళ్లంటే- ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమినట్లా?: వైఎస్ షర్మిల
బీజేపీతో దోస్తీ: నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్ ప్రత్యేక హోదాను విస్మరించారని షర్మిల ధ్వజమెత్తారు. ఒక్కమాట కూడా నిలబెట్టుకోని జగన్ వైఎస్ రాజశేఖర్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. జగనన్న ప్రత్యేక హోదా కోసం గతంలో దీక్షలు చేశారు, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదని అన్నారు. జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారని ప్రజలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. కానీ సీఎం అయ్యాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా ? 22 ఎంపీల్లో ఎవరైనా రాజీనామా చేశారా? అని షర్మిల ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై బీజేపీతో వైసీపీ పోరాడకుండా కుమ్మక్కైందని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని అన్నారు.
వైఎస్ షర్మిల, సునీతలపై అసభ్యకర పోస్టులు - ఒకరు అరెస్ట్
New Schemes of Congress: పేదరికం నిర్మూలనకు కాంగ్రెస్ పార్టీ నూతన పథకాలు అమలు చేస్తుందని షర్మిల తెలిపారు. ప్రతి కుటుంబానికి అండగా నిలవాలని ఇందిరమ్మ అభయం అమలు చేస్తామని ప్రతి పేద కుటుంబానికి ప్రతినెలా రూ.5 వేలు, మహిళ పేరిట రూ.5 వేల చెక్కు ఇస్తామని కాంగ్రెస్ గ్యారంటీ ఇస్తోందని షర్మిల తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే వైఎస్‌ఆర్ సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకు వస్తాం అని షర్మిల హామీ ఇచ్చారు.