Yellandu Municipal Council No Confidence Motion Fails Today : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ ఛైర్మన్ డి.వెంకటేశ్వర్లుపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం పాస్‌కావడానికి కావాల్సిన కోరం(17 మంది) సభ్యులలో 16 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఒకరు తక్కువగా ఉండటంతో అవిశ్వాసం వీగిపోయింది. మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్కు(BRS) చెందిన 19 మంది కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులు జారీ చేశారు.
ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం - క్యాంపులో 15 మంది కౌన్సిలర్లు
ఇల్లందులో మొత్తం 24 మంది పాలకవర్గ సభ్యులు ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) ఎక్స్ అఫీషియో ఓటు హక్కుతో మొత్తం సభ్యుల సంఖ్య 25 ఉంది. మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గేందుకు 17 మంది సభ్యుల సంఖ్య బలం కావాల్సి ఉంది. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జానీతో సహా మరో 17 మంది సభ్యులకు ఇవాళ పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. పార్టీ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ విప్ జారీ చేశారు.
Bhadradri Kothagudem Latest News : అవిశ్వాస సమావేశానికి అవసరమైన సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా కాంగ్రెస్(Congress) సభ్యులు పావులు కదిపారు. సీపీఐ కౌన్సిలర్ ఓటింగ్‌లో పాల్గొనకుండా సీపీఐ జిల్లా నాయకులు సాబీర్ పాషా, సారయ్య మున్సిపల్ కార్యాలయ ఆవరణలోనే ఉన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ వారిని నిలువరించి నాగేశ్వరరావుని ఓటింగ్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఇల్లందు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కొరత - అవస్థలు పడుతున్న రోగులు
వీరిలో నాగేశ్వరరావును కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య తీసుకెళ్లారు. వారిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూశారు. దీంతో కోరం (17 మంది సభ్యులు) లేనందున అవిశ్వాసం వీగిపోయింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సభ్యులకు రక్షణ కల్పించలేదన్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో తమ సభ్యుడిని బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని మండిపడ్డారు. మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ డిమాండ్ చేశారు. అంతకుముందు కౌన్సిలర్ నాగేశ్వర్‌రావు భార్య సైతం ఆందోళనకు దిగారు. భర్తను చూపించాలని కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. కాగా, ఇల్లెందులో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా, 23 మంది భారాస, ఒకరు సీపీఐ మద్దతుతో గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నలుగురు భారాస సభ్యులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
'బీఆర్ఎస్‌లో కార్యకర్తలకు విలువ లేదు - అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది'