ETV Bharat / politics

కలల కేబినెట్‌ - 'మంత్రి' కోసం నిజామాబాద్ నేతల ఎదురుచూపులు, ఆశ నెరవేరేనా? - shabbir ali in cabinet

Nizamabad congress Politics : కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా, నిజామాబాద్‌ జిల్లా ప్రముఖ పాత్ర పోషించింది. అప్పట్లో అర్గుల్‌ రాజారాం, సంతోశ్​ రెడ్డిలు మంత్రులుగా పని చేశారు. వీరి స్ఫూర్తితో డి.శ్రీనివాస్‌, షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌ రెడ్డిలు రాజకీయాల్లో రాణించి మంత్రులుగా పని చేశారు. డీఎస్‌ ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా కీలక పాత్ర వహించారు. అలాంటి జిల్లాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏర్పాటైన రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఒక్క మంత్రి పదవీ లభించలేదు. అదిగో ఇదిగో అంటున్నా, మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్న ఆందోళన కేడర్‌లో నెలకొంది.

Nizamabad Political News
Nizamabad congress Politics
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 8:00 AM IST

Nizamabad congress Politics : కాంగ్రెస్‌ పార్టీ క్రియాశీల రాజకీయాల్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా(Nizamabad Politics) కీలక పాత్ర పోషించింది. ఎప్పుడు అధికారంలో ఉన్నా, జిల్లా నుంచి మంత్రివర్గంలో, ఇతర పదవుల్లో కచ్చితంగా ప్రాతినిథ్యం లభించింది. 1980ల్లో జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులు అర్గుల్‌ రాజారాం, సంతోశ్​ రెడ్డిలు మంత్రులుగా పని చేశారు. జిల్లాపై వీరికి ఉన్న పట్టు సాధారణమైంది కాదు. వీరి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చిన డి.శ్రీనివాస్‌, షబ్బీర్‌ అలీలు సైతం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా పని చేశారు.

Nizamabad Political News : నిజామాబాద్‌ నేత డి.శ్రీనివాస్‌ రెండు పర్యాయాలు 2004, 2009లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు వైఎస్సార్ హయాంలో షబ్బీర్‌ అలీ (Shabir ali), సుదర్శన్‌ రెడ్డిలు మంత్రులుగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోగా, మళ్లీ ఇన్నాళ్లకు రాష్ట్రంలో అధికారం చేపట్టింది. అయితే రేవంత్‌ రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు ప్రాతినిథ్యం లభించలేదు.

తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్​రెడ్డి

ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో బోధన్‌, నిజామాబాద్‌ రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ నిజామాబాద్‌ నుంచి పోటీ చేసి బీజేపీ చేతిలో ఓడిపోయారు. అయితే ఓడినప్పటికీ కామారెడ్డి స్థానం త్యాగం చేసినందుకు ప్రభుత్వ సలహాదారు పదవి అప్పగించారు రేవంత్‌రెడ్డి(CM Revanth reddy). ప్రమాణ స్వీకార సమయంలోనే జిల్లాకు మంత్రి పదవి ఖాయమని భావించినా అందలేదు.

మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి మొదట్నుంచి మంత్రి పదవి వస్తుందని అంచనా ఉంది. ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రమాణ స్వీకార సమయంలో సుదర్శన్‌ రెడ్డి పేరు వినిపించినా, చివరి క్షణంలో జాబితాలో పేరు లేకపోయింది. ఆ తర్వాత విస్తరణ జరుగుతుందని, కచ్చితంగా సుదర్శన్‌ రెడ్డికి పదవి వస్తుందని అనుకున్నా, ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదని పార్టీ కేడర్‌లో చర్చ మొదలైంది. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ వస్తుందని అందరూ భావిస్తున్నారు.

ఈ తరుణంలో పార్లమెంట్‌ ఎన్నికలు జరిగి, ఫలితాలు వెల్లడించే వరకు జిల్లా కాంగ్రెస్‌ కేడర్‌ మంత్రి పదవి గురించి ఆగాల్సిందే. ఈ లెక్కన వారికి మే నెల వరకు ఎదురుచూపులు తప్పేలా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేపూమాపు అంటూ నిత్యం జిల్లా నేతలు, కార్యకర్తలు ఆశలు పెట్టుకోవడం, ఎలాంటి ప్రకటన రాక ఉసూరుమనడం జరుగుతూనే ఉంది. ఏదేమైనా ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష స్థానం అధిరోహించిన జిల్లాకు, మంత్రి పదవి లేకపోవడం పట్ల కేడర్‌లో నిరుత్సాహం నెలకొంది.

మేడిగడ్డ దేవాలయం అప్పుడే బొందలగడ్డ ఎందుకు అయిందో కేసీఆర్ చెప్పాలి : పొంగులేటి

అన్నారం, సుందిళ్లకూ ముప్పు పొంచి ఉంది : మంత్రి ఉత్తమ్ ​కుమార్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.