Bandi Sanjay Fires On Congress : కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేంద్రాన్ని బద్నాం చేయాలని చూస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. రేవంత్ సర్కారు అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్‌పై వ్యతిరేకత వస్తుందని గ్రహించే కేంద్ర బడ్జెట్‌పై అనవసరమైన నిందలు మోపి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులే రిపీట్ : గత సర్కార్ చేసిన తప్పిదాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తోందన్నారు. విమర్శలు, ప్రతివిమర్శలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి, హామీల అమలుపై దృష్టిసారించాలని సూచించారు. అభివృద్ధికి సహకరిస్తామని తాము ముందే చెప్పామని స్పష్టం చేశారు. ప్రధాని అనే గౌరవం కూడా లేకుండా కొంతమంది మంత్రులు విమర్శలు చేస్తున్నారన్నారు.
Bandi Sanjay On Congress : గొడవలు వద్దు అభివృద్ధికి సహకరిస్తామని చెప్పినా పట్టించుకోకుండా విమర్శలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేంద్రంతో సఖ్యత అవసరం లేదనేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తోందని ఫైర్ అయ్యారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మహిళా, యువ, రైతు సంక్షేమ బడ్జెట్ అని ఆయన అభివర్ణించారు. వ్యవసాయ, అనబంధ రంగాలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించామని తెలిపారు.
అంకెల గారడీ, ఆర్భాటం తప్ప బడ్జెట్లో ఏమీ లేదు : బీజేపీ - BJp on Telangana Budget 2024
రెండేళ్లలో కోటిమంది రైతులను సేంద్రీయ సాగుకు మళ్లించాలనే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. మహిళాభివృద్ధికి రూ. 3 లక్షల కోట్లు కేటాయించిందని వివరించారు. యూత్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్కు పెద్దపీట వేశామన్న కేంద్రమంత్రి అందుకోసం లక్షా నలభై ఎనిమిదివేల కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు తెలిపారు.
Bandi Sanjay On Union Budget : కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో తెలంగాణ వారు కూడా లబ్ధి పొందుతారని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి అవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే మరో 3 కోట్ల ఇండ్లలో లక్షల ఇళ్లు కేటాయించే అవకాశం ఉందన్నారు. కేంద్ర పన్నుల రూపంలో రాష్ట్రానికి రూ.26 వేల కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా రూ.21075కోట్లు ఎఫ్ఆర్బీఎంకు లోబడి రూ.62 వేల కోట్ల రుణాలు వస్తాయని వివరించారు. రుణాల రూపంలో కేంద్రం రూ.లక్షా 9 వేల కోట్లకు పైగా నిధులు సమకూరుస్తోందని తెలిపారు.