Union Home Minister Amit Shah key comments: మెున్న చంద్రబాబు, నిన్న సీఎం జగన్ దిల్లీ పర్యటన నేపథ్యంలో, ఎన్డీఏతో పొత్తుపై రాష్ట్రంలో విసృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఇరువురు నేతలకు బీజేపీ పెద్దలు ఎలాంటి హామీలు ఇచ్చారు అన్న అంశంపై ఉత్కంఠ మెుదలైంది. బీజేపీతో చంద్రబాబు కలుస్తారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తుండగా, వైఎస్సార్సీపీయే బీజేపీతో అంటకాగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత అమిత్ షా పొత్తుల అంశంపై స్పందించారు. ఏపీలో పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.
ఏపీలో పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు: ఎన్నికల వేళ కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Union Home Minister Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై అమిత్ షా స్పందించారు. ఎకనమిక్ టైమ్స్ సమ్మిట్‌లో మాట్లాడిన ఆయన, ఏపీలో పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. ఎన్డీఏ (NDA) లోకి కొత్త మిత్రులు వస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబపరంగా బాగుంటుందన్న అమిత్ షా రాజకీయకూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి కొందరు కూటమి నుంచి బయటకు వెళ్లి ఉండొచ్చని అమిత్ షా అన్నారు.
ప్రధాని మోదీ చంద్రయాన్-3 విజయవంతం - కాంగ్రెస్ రాహుల్‌యాన్ విఫలం : అమిత్‌షా
మరిన్ని పార్టీలు ఎన్డీయేలో చేరతాయి: రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయే కుటమికి మొత్తంగా 400 సీట్లు వస్తాయని అమిత్ షా దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రీయ లోక్‌దళ్, శిరోమణి అకాలీదళ్ వంటి ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేలో చేరతాయా? అని ప్రశ్నించగా, తాము ఫ్యామిలీ ప్లానింగ్‌ను నమ్ముతాం కానీ రాజకీయాల్లో కాదని చలోక్తులు విసిరారు. రాబోయే ఎన్నికలలోపు మరిన్ని పార్టీలు ఎన్డీయేలో చేరతాయని అమిత్ షా పరోక్షంగా వెల్లడించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర గురించి కూడా అమిత్ షా స్పందించారు. 1947లో దేశ విభజనకు కారణమైన ఆ పార్టీ నేతకు ఈ తరహా యాత్రతో ముందుకు వెళ్లే అర్హత లేదని విమర్శించారు.
దిల్లీకి చంద్రబాబు - అమిత్‌షాతో భేటీపై చర్చోపచర్చలు
పోటాపోటీగా దిల్లీ టూర్: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ, రాష్ట్రంలోని పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి. ఇటీవలే తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) అమిత్ షాతో దిల్లీలో భేటీ అయి చర్చలు జరిపారు. ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) కూడా దిల్లీ వెళ్లి అమిత్ షాతో పాటు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ తరుణంలో అమిత్ షా పొత్తులపై చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి పెంచుతున్నాయి.
'సార్వత్రిక ఎన్నికలకు ముందే CAA అమలు, ఆర్టికల్ 370 రద్దుతో 370 సీట్లు పక్కా'