ETV Bharat / politics

టీడీపీలో చేరిన టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్- ఆహ్వానించిన నారా లోకేశ్ - actor nikhil joined in tdp - ACTOR NIKHIL JOINED IN TDP

Tollywood Hero Nikhil Siddharth Joined in TDP : టాలీవుడ్‌ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్‌ యాదవ్ శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. హైదరాబాద్​లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Nikhil_Siddharth_join_in_tdp
Nikhil_Siddharth_join_in_tdp
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 10:49 PM IST

Tollywood Hero Nikhil Siddharth Joined in TDP : 'హ్యాపీడేస్' సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన టాలీవుడ్‌ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్‌ యాదవ్ పాన్ ఇండియా స్టార్​గా ఎదిగి ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ దేశంలో ఎన్నికల పండుగ జోరుగా సాగుతున్న తరుణంలో రాజకీయ పార్టీ అయిన పసుపు కండువా కప్పుకొని అందరకీ ఆశ్చర్యాన్ని కలిగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.

"మీ అందరి ఆశీస్సులు మామయ్యకు కావాలి" : టాలీవుడ్‌ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్‌ శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. హైదరాబాద్​లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బాపట్ల జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య యాదవ్​కు ఆయన దగ్గరి బంధువు. కొండయ్య యాదవ్​కు నిఖిల్‌ అల్లుడు వరుస అవుతారు. పార్టీలో చేరిన సందర్భంగా నిఖిల్‌ ట్విటర్ వేదికగా స్పందించారు. "చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ పొందినందుకు మావయ్య ఎమ్ఎమ్ కొండయ్య యాదవ్​కు అభినందనలు అలాగే ధన్యవాదాలు. మా కుటుంబానికి ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని, మీ అందరి ఆశీస్సులు మామయ్యకు కావాలి." అని కోరారు. దీంతో నారా లోకేశ్​తో నిఖిల్‌ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిలకలూరిపేటలో వైసీపీ ఖాళీ - మాజీ ఇన్‌ఛార్జితో పాటు మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ సహా కౌన్సిలర్లు టీడీపీలో చేరిక - YCP WIPED OUT IN CHILAKALURIPETA

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? : నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండే నిఖిల్‌ సిద్ధార్థ్‌ యాదవ్ తరచూ సామాజిక బాధ్యతతో సమస్యలపై పోస్టులతో స్పందిస్తుంటారు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీలో చేరడంతో టీడీపీ అభిమానులు, శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. చీరాల టీడీపీ ఎమ్మెల్యే కొండయ్య యాదవ్​కు అండగా ఎన్నికల ప్రచారంలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలా జరిగితే పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదో ఎదురు చూడాలి మరీ?

మే 13న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు కూలదోస్తారు- జగన్​ నాటకాలు హాలీవుడ్​నే తలదన్నేలా ఉన్నాయి: చంద్రబాబు - Chandrababu Election Campaign

స్వయంభూ సినిమా షూటింగ్​లో బిజీ : హ్యాపీడేస్ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టిన నిఖిల్ సిద్దార్ధ్ ప్రస్తుతం స్వయంభూ సినిమా (Swayambhu Movie) షూటింగ్​లో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన కార్తికేయ - 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్​లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్య కాలంలో కార్తికేయ-2, 18 పేజెస్, స్పై సినిమాలతో ప్రేక్షకులను ఆలరించారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా స్వామి రా రా, కార్తికేయ, వంటి చిత్రాలతో ఆయన నటించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ వేడుకలు - TDP 42nd Foundation Day

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.