Telangana Republic Day Celebrations 2024 : హైదరాబాద్‌లో 75వ గణతంత్ర వేడుకులను ( Republic Day Celebrations in Telangana) రాజకీయ పక్షాలు ఘనంగా జరుపుకున్నాయి. గాంధీ భవన్‌లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలను కాపాడింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నది కూడా హస్తం పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజానికమేనని తెలిపారు. బీజేపీకి స్వాతంత్రోద్యమంతో సంబంధం లేదని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.
"ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆనాడు స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాణ త్యాగం చేశారు. ఆ స్వేచ్ఛా ఫలాలను ఇవాళ మనం అనుభవిస్తున్నాం. గుండు సూది తయారు కానీ పరిస్థితుల్లో రాకెట్‌లను ప్రయోగించే విధంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇవాళ వాటి ముందు నిలబడి ప్రధాని ఫొటోలు దిగుతున్నారు. ఈ ఫలాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉంది." - మహేశ్‌కుమార్ గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఘనంగా గణతంత్ర వేడుకలు- అబ్బురపరిచిన విన్యాసాలు
Republic Day Celebrations in Telangana Bhavan : గణతంత్ర వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులు ఎంపికైన వారికి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
"తెలంగాణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగాన్ని మనకు అందించిన అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దేశం పురోగమించాలని కోరుకుంటున్నాం. పద్మవిభూషణ్‌కు ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి, సీని నటుడు చిరంజీవికి అభినందలు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి అభినందలు." - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
Republic Day in Telangana BJP Office : నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ప్రజాస్వామ్యానికే మాతృమూర్తి భారతదేశమని ఆయన అన్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్నారని కొనియాడారు. యాభై రోజుల కాంగ్రెస్ పాలన బీఆర్ఎస్ కనుసన్నల్లో సాగుతుందని ఆరోపించారు. హస్తం పార్టీ, భారత్ రాష్ట్ర సమితి రెండు ఒక్కటే తోడు దొంగలని లక్ష్మణ్ ధ్వజమెత్తారు.
సైనిక సామర్థ్యం చాటిన రిపబ్లిక్ డే పరేడ్- నడిపించిన నారీమణులు- ఆకట్టుకున్న శకటాలు
Republic Day Celebrations in Telangana :ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో గణతంత్ర వేడుకలను తెలంగాణ టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. రాజ్యంగాన్ని నిరంతరం పరిరక్షించేందుకు తెలుగు దేశం పార్టీ పోరాడుతుందని నేతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగం నిర్మాణంలో పాల్గొన్న వారిని స్మరించుకున్నారు.