ETV Bharat / politics

ప్రచారంలో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు - ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ - Telangana Election Campaign 2024 - TELANGANA ELECTION CAMPAIGN 2024

Telangana Election Campaign 2024 : లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి సత్తాచాటాలని శ్రమిస్తున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్‌ షోలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

Political Parties Speed up Lok Sabha Election Campaign
Telangana Election Campaign 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 7:13 AM IST

ప్రచారంలో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు - ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ

Political Parties Speed up Lok Sabha Election Campaign : నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చామలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి డిచ్‌పల్లిలో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. తనను గెలిపిస్తే మంచిప్ప ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు.

BRS Election Campaign : దుబ్బాక నియోజకవర్గం అక్బర్‌పేటలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మెదక్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మెదక్ జిల్లా చిన్న శంకారంపేటలో వెంకట్రామిరెడ్డి మద్దతుగా హరీశ్‌రావు రోడ్ షో నిర్వహించారు. రుణమాఫీ అమలుపై అమరవీరుల స్తూపం వద్దకు రమ్మంటే సీఎం రేవంత్‌రెడ్డి తోకముడిచారని ఆరోపించారు.

"కాంగ్రెస్ పార్టీ వచ్చిన నాలుగు నెలల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ప్రజలకు నేను గెలిచిన వెంటనే మంచిప్ప ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా. తెలంగాణలో కాంగ్రెస్ 14 స్థానాలు గెలుస్తుంది." -జీవన్‌రెడ్డి, నిజామాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి

రాష్ట్రంలో రాజకీయ వే"ఢీ"- ఫుల్ స్వింగ్​లో ఎన్నికల ప్రచారం - lok sabha elections 2024

సూర్యాపేట జిల్లా నడిగూడెం, మోతె మండలాల్లో నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ రైతు పొలాల్లోకి నీళ్లు తెస్తే కాంగ్రెస్ కర్షకులకు కన్నీళ్లు తెప్పిస్తోందని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ బీఆర్ఎస్​కు 12 మంది ఎంపీలను ఇస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామని అన్నారు.

BJP Election Campaign : మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన ఓబీసీ సదస్సులో పాల్గొన్న మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరును ఎండగట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి గెలిచిన కాంగ్రెస్‌ లోక్‌సభ పోరులోనూ అదే సూత్రాన్ని నమ్ముకుందని నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు.

" కాంగ్రెస్ ప్రభుత్వం 100 గ్యారెంటీలు ఇచ్చి వంద రోజుల్లో పూర్తిచేస్తానని ప్రజల్ని మోసం చేసింది. పార్లమెంట్​లో బీఆర్ఎస్​ను గెలిపిస్తే ప్రభుత్వాన్ని పనులు చేసే దాకా వెంటాడుతాం. పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అక్కడక్కడ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నేను మీ అందరికి ఒకటే చెబుతున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తిని మించిన శక్తి లేదు." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు

ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ విఫలం : లక్కోరంలో ఏర్పాటు చేసిన యువసమ్మేళనం కార్యక్రమంలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ విఫలమైందని మహబూబ్‌నగర్‌ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో ఎస్సీ మోర్చా సమ్మేళనంలో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌ పాల్గొన్నారు. ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీ నేతలు - అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యం - main Parties Campaign in Telangana

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల హీట్ - జోరందుకున్న పార్టీల ప్రచారాలు - Lok Sabha Campaign In Telangana

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.