ETV Bharat / politics

ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు - ప్రత్యర్థి అభ్యర్థులే లక్ష్యంగా మాటల దాడులు - Lok Sabha Campaign in Telangana

Telangana Main Parties Election Campaign 2024 : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రత్యర్థి పక్షంపై పైచేయి సాధించే వ్యుహాల్ని అమలు చేస్తున్నాయి. ఆకట్టుకునే హామీలతో ఓట్లవేట కొనసాగిస్తున్న పార్టీల నేతలు, పోటీగా ఉన్న అభ్యర్థిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.

Lok Sabha Elections 2024
Telangana Political Leaders Election Campaign
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 8:20 AM IST

ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు ప్రత్యర్థి అభ్యర్థులే లక్ష్యంగా మాటల దాడులు

Telangana Political Leaders Election Campaign : అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరుమీదున్న రాష్ట్ర కాంగ్రెస్‌ సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్​ ప్రజలకు చేసిందేం లేదంటూ జనంలోకి వెళ్తోంది. నిర్మల్ జిల్లా ముధోల్‌ మండంలోని నాయబాది వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క బీజేపీపై విమర్శలు గుప్పించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజలను పట్టించుకోని బీజేపీకు రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని ఉద్ఘాటించారు.

Telangana Lok Sabha Elections 2024 : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్​ మరింత జోరు పెంచించి. జనంలోకి క్షేత్రస్థాయిలో వెళ్తున్న అభ్యర్థులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్లో జిల్లా బోయినపల్లిలోని రోడ్‌ షోలో కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పాల్గొన్నారు. మరోవైపు మెదక్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన మాట తప్పడం, పచ్చి అబద్దాలు ఆడటం రేవంత్ రెడ్డి నైజమన్న హరీశ్ 100 రోజుల్లో హామీలు అమలు చేయనందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత బీఆర్ఎస్​ ప్రభుత్వానికే దక్కుతుందని దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఏం చేయాలో తోచని కాంగ్రెస్​ పక్కదారి రాజకీయాలకు పాల్పడుతుందని ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. జిల్లాలో బీఆర్​ఎస్​కు మంచి స్పందన లభిస్తుందని ఖమ్మం బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు.

గడిచిన ఐదేళ్లలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిజామాబాద్​లో అభివృద్ధి : జీవన్​రెడ్డి - Jeevan Reddy On CM visit

‍‌ప్రజలతో మమేకమై ప్రచారం : నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలోని బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్​ కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. అనంతరం నిజామాబాద్‌లోని రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్​ను సందర్శించిన బాజిరెడ్డి ట్యాంక్ బ్యాండ్‌పై సందర్శకులతో కలిసి నగర అభివృద్ధిపై వివరించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నల్గొండ జిల్లా గుర్రం పోడులోని బీఆర్ఎస్​ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డితో కలిసి వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిన పాగా వేసేందుకు. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచే లక్ష్యంతో బీజేపీ ప్రచార జోరు కొనసాగిస్తోంది. మహబూబాబాద్‌లోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ ఎస్టీ మోర్చా సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్‌ ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్‌ కంటోన్‌మెంట్‌లో మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్న ఈటల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణకు హాని చేసే వారు ఎవరైనా సరే వారితో పోరాడతాం : రఘునందన్‌ రావు - Raghunandan Rao Meet The Press

సీఎం రేవంత్ రెడ్డి తన హోదా మర్చిపోయి - దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు : వివేకానంద - MLA Vivekanand Fires On CM Revanth

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.