ETV Bharat / politics

'రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలి' - విజయసాయిరెడ్డికి తెలంగాణ హైకోర్టు​ షాక్​ - VIJAYASAIREDDY CASE

ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు

Etelangana_high_court_big_shock_to_mp_vijayasai_reddy
telangana_high_court_big_shock_to_mp_vijayasai_reddy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2024, 12:18 PM IST

Telangana High Court Big Shock To MP Vijayasai Reddy : జగన్ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడైన ఎంపీ విజయసాయిరెడ్డికి సోమవారం తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వృత్తిపరమైన దుష్ప్రవర్తన వ్యవహారంలో ఐసీఏఐ(ICAI) కమిటీ నిర్ణయాన్ని, విజయసాయిరెడ్డికి ఇచ్చిన నోటీసులను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ ఎకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు విచారణ జరిపింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ‘ఐసీఏఐ సంస్థతోపాటు విజయసాయిరెడ్డి కార్యాలయం కూడా చెన్నైలోనే ఉందని అందువల్ల పిటిషన్​ను చెన్నై హైకోర్టులో దాఖలు చేసుకోవాల్సి ఉందని ఐసీఏఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సాయిరెడ్డి పిటిషన్ పై విచారించే పరిధి ఈ హైకోర్టుకు లేదని అభ్యంతరం తెలిపామని దాన్ని సింగిల్ జడ్జి పట్టించుకోలేదని చెప్పారు.

విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ నిర్మాణాలు - కొనసాగుతున్న కూల్చివేతలు - Neha Reddy Illegal Constructions

విజయసాయిరెడ్డి ఛార్టర్డ్ ఎకౌంటెంట్​గా ఉంటూ జగన్​కు చెందిన కంపెనీల్లోకి పెట్టుబడులు రాబట్టడానికి ప్రయత్నాలు చేయడం వృత్తిపరమైన దుష్ప్రవర్తన కిందకు వస్తుందంటూ కమిటీ వెల్లడించిన ప్రాథమిక అభిప్రాయం ఆధారంగా ఐసీఏఐ డిసిప్లినరీ డైరెక్టరేట్ తదుపరి విచారణను కొనసాగిస్తుందన్నారు. కమిటీ ప్రాథమిక అభిప్రాయాన్ని సింగిల్ జడ్జి కొట్టివేయడం సరికాదన్నారు. సంస్థాగత విచారణలో కోర్టులు జోక్యం చేసుకోవని విజయసాయిరెడ్డి విచారణకు అనుమతించాలని కోరారు.

Hearing Adjourned to File Counter Within Two Weeks : సీనియర్‌ న్యాయవాది వెంకటేశ్, న్యాయవాది ఎస్‌.నవీన్‌కుమార్‌ విజయసాయిరెడ్డి తరఫున వాదనలు వినిపిస్తూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను నిలిపివేస్తే తమ పిటిషన్‌ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. దీనిపై కౌంటరు దాఖలు చేస్తామని, గడువు కావాలని వారు కోరారు. వీరి వాదనలు విన్న ధర్మాసనం ఐసీఏఐ (ICAI) అప్పీలును విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులైన విజయసాయిరెడ్డి, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది.

"ఎందుకింత ఆలస్యం?" - జగన్‌ అక్రమాస్తుల కేసుపై ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.