ETV Bharat / politics

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌ రెడ్డి - Telangana Graduate MLC Elections - TELANGANA GRADUATE MLC ELECTIONS

BRS Graduate MLC Candidate : వరంగల్‌ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏనుగుల రాకేశ్‌రెడ్డిని తమ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. హన్మకొండ జిల్లాకు చెందిన ఆయన శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి బీఆర్ఎస్​లో చేరారు. పలువురు పేర్లను పరిశీలించిన బీఆర్ఎస్ అధిష్ఠానం విద్యావంతుడైన రాకేశ్‌రెడ్డి వైపు మొగ్గు చూపింది.

BRS Graduate MLC Candidate
Telangana Graduates MLC By Elections 2024 (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 4, 2024, 7:05 AM IST

Telangana Graduates MLC By Elections 2024 : వరంగల్, ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి బరిలో దిగనున్నారు. ఈమేరకు రాకేశ్‌రెడ్డి పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆ స్థానం నుంచి ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేరును బీఆర్ఎస్ ప్రకటించింది.

BRS Graduate MLC Candidate : ఉన్నత విద్యావంతుడైన ఏనుగుల రాకేశ్‌రెడ్డి స్వస్థలం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌. బీజేపీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన నగరంలోని అనేక సమస్యలపై పోరాటాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ టికెట్టు దక్కకపోవడంతో బీఆర్ఎస్​లో చేరారు. పలువురు పేర్లను పరిశీలించిన బీఆర్ఎస్ అధిష్ఠానం విద్యావంతుడైన రాకేశ్‌రెడ్డి వైపు మొగ్గు చూపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం రావడంతో హన్మకొండలోని రాకేశ్‌రెడ్డి ఇంటివద్ద కోలాహలం నెలకొంది. ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తంచేశారు.

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక - షెడ్యూలు విడుదల - Telangana Graduate MLC Elections

మరోవైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఇప్పటికే అధికార కాంగ్రెస్‌ తన అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న పేరును ఖరారు చేసింది. బీఆర్ఎస్ సైతం తమ అభ్యర్థి పేరును ప్రకటించింది. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. అభ్యర్థిపై కమలం సైతం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. గతసారి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి బరిలో నిలిచారు. ఈసారీ ఆయనకే అవకాశం ఇస్తుందా? మరో అభ్యర్థిని బీజేపీ పోటీలో నిలుపుతుందా అనేది తెలియాల్సి ఉంది.

2027 వరకు పదవీ కాలం : 2021 మార్చిలో పల్లా రాజేశ్వర్​ రెడ్డి ఈ స్థానానికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు ఆయన పదవీ కాలం ఉండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. దాంతో డిసెంబర్ 9న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పల్లా రిజైన్​ చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా, మే 27న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, జూన్ 5న ఓట్లు లెక్కించి, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వచ్చేసింది - నేటి నుంచే నామినేషన్లు షురూ - Telangana Graduate MLC Elections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.