ETV Bharat / politics

ఎన్నికల ప్రసంగాల్లో జర జాగ్రత్త గురూ - అక్కడ దొరికారో మాస్ ట్రోలింగ్ తప్పదు మరి - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 1:38 PM IST

Telangana Election Campaign in Social Media : డిజిటల్‌ యుగంలో సోషల్ మీడియాను ఉపయోగించుకుని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తమ పార్టీలోని ప్రతికూల అంశాలకు పెద్దపీట వేస్తూ, ప్రత్యర్థుల ప్రసంగాల్లోని తప్పులను పట్టుకుని చెడుగుడు ఆడుకుంటున్నాయి. మరోవైపు ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్లు తమకు అనుకూలంగా ప్రచారం చేసేలా వారితో ఒప్పందం చేసుకుంటున్నారు.

Telangana Election Campaign in Social Media

Telangana Election Campaign in Social Media : లోక్‌సభ ఎన్నికల వేళ సోషల్ మీడియా వేదికగా పార్టీల రాజకీయ పోరు తీవ్ర స్థాయిలో సాగుతోంది. ఇందుకోసం వైరల్‌ అయ్యే సత్తా ఉన్న కంటెంట్‌ను పట్టుకోవాలి. ప్రత్యర్థుల ప్రసంగాలు, సభల్లోని లోటుపాట్లను గుర్తించి, వాటికి తగిన సినిమా దృశ్యాలనో, ఫొటోలనో జోడించి సామాజిక మాధ్యమాల్లో (Campaign in Social Media) ఊదరగొడుతున్నారు. అందులో కాస్త నవ్వింపు, కవ్వింపు ఉండాలి. ఎదుటివారిపై ఏహ్యభావం, తమ వారిపై సానుకూల దృక్పథం కలిగించగలగాలి. తమ అభిమానులను అలరించాలి ఇన్ని లక్ష్యాలతో సామాజిక మాధ్యమాల్లో పార్టీలు, అభ్యర్థులు, వారి తరఫు టీంలు చెలరేగిపోతున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో పరిమితులులేని ఈ ఆన్‌లైన్‌ ప్రచారం చేసుకున్నోళ్లకు చేసుకున్నంతగా మారిపోయింది. కొత్త ఉపాధి మార్గాలను చూపుతోంది.

Lok Sabha Elections 2024 : ఓటర్లలో పట్టు పెంచుకునేందుకు పార్టీ స్థాయిలోనే కాకుండా అభ్యర్థులు కూడా వార్‌ రూంలను తెరుస్తున్నారు. మరోవైపు పలుకుబడి ఉన్న యూట్యూబర్లు, గ్రూప్‌ల అడ్మిన్ల కోసం గాలిస్తున్నారు. కొన్ని స్థానాల్లో మినహా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో వారం రోజులుగా ప్రచారం దుమ్మురేగుతోంది. సంప్రదాయ మీడియాలో ప్రసారానికి వీలులేని బూతులు, వివాదాస్పద వ్యాఖ్యలను సోషల్ మీడియాలో యథేచ్ఛగా పోస్టు చేస్తూ పలువురు నేతలు రచ్చ చేస్తున్నారు.

ప్రచారంలో నయా రూట్ - ఏఐ టెక్నాలజీతో ఖర్చు తగ్గించుకుంటున్న అభ్యర్థులు

ప్రస్తుతం తెలంగాణలో ఏర్పడిన క్షామ పరిస్థితులపై సోషల్ మీడియాలో (TS Election Campaign 2024 )రచ్చ జరుగుతోంది. ఈ పరిస్థితికి మీరే కారణమంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పంటల సాగు, తాగునీటి సమస్యలు, ఎండిపోయిన జలాశయాలు, నీటి ఎద్దడి, కరవు, రైతు ఆత్మహత్యలు, వర్షాభావం తదితర సమాచారం, చిత్రాలు, వీడియోలను పోస్టు చేసి ప్రత్యర్థికి ఊపిరిసలపకుండా చేస్తున్నారు.

మీమ్స్‌ - పచ్చిపచ్చిగా : మరోవైపు ఎప్పుడూ లేనంతగా ప్రతికూల అంశాలపై రచ్చ చేయడం ప్రస్తుతం కనిపిస్తోంది. గత సంవత్సరం చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం తీరు తారస్థాయికి చేరినా వ్యాఖ్యల తీవ్రత ఇప్పటిలా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అసభ్య పదాలు, హత్యా రాజకీయాలకు సంబంధించి పలు చిత్రాలు, వ్యాఖ్యలను కొన్ని పార్టీల నేతలు యథేచ్ఛగా వినియోగిస్తున్నారు.

సోషల్ మీడియాపై రాజకీయ పార్టీల ఫోకస్ - ఫాలోవర్స్ ఎక్కువున్న వారి పంట పండినట్టే

యూట్యూబర్లు - ఫాలోవర్స్‌ ఉన్న అడ్మిన్లకు గిరాకీ : సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారానికి స్పందన ఉండటంతో పార్టీలు, నేతలు ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉన్న గ్రూపుల అడ్మిన్లపై ఫోకస్ పెట్టారు. దీంతో ఎక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్లు, యూట్యూబ్‌ వార్తా ఛానళ్లకు గిరాకీ పెరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్‌గాంధీ, కేటీఆర్‌ వంటి కీలక నాయకులు యూట్యూబర్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చిన విషయం తెలిసిందే.

  • తాజాగా ఒక జాతీయ పార్టీ హైదరాబాద్‌ వేదికగా పనిచేసే నాలుగు యూట్యూబ్‌ ఛానళ్లతో పెద్ద మొత్తాలు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
  • లక్ష సబ్‌స్క్రిప్షన్లు ఉన్న యూట్యూబర్లతో తెలంగాణకు చెందిన పలువురు నేతలు ఒప్పందాలు చేసుకుంటున్నారు.
  • వంటలు, గ్రామీణ నేపథ్యంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలను ప్రసారం చేసే ఓ యూట్యూబర్‌ను ఒక పార్టీ సంప్రదించి ఒప్పందం చేసుకుంది.
  • వాట్సప్‌, సిగ్నల్‌, ఇన్‌స్టా వంటి సామాజిక యాప్‌లలో ఎక్కువ మంది సభ్యులు ఉన్న గ్రూపుల అడ్మిన్లను కూడా వెతికిపట్టుకుంటున్నట్లు పలు పార్టీల వార్‌ రూం నిర్వాహకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించిన వారితోపాటు కొత్తవారి కోసం అన్వేషిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
  • ప్రసారం చేయాల్సిన కంటెంట్‌ను పార్టీలు, నేతలే రూపొందించి ఇస్తున్నారు. తాము కోరుకున్న సమయంలో వాటిని యూట్యూబర్లు, గ్రూప్‌ల అడ్మిన్లు వారి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని సూచిస్తున్నారు.

కాకపుట్టిస్తున్న అరెస్టుల పర్వం : ఏ సామాజిక మాధ్యమం తెరిచినా రోజులో పదికిపైగా అరెస్టులకు సంబంధించిన పోస్టులు కనిపిస్తున్నాయి. ఫలానా అంశంలో మీ నేతలు అరెస్టు అయ్యారని ఒక పార్టీ పోస్టు చేస్తోంది. దానికి సమాధానంగా మీరు కాలేదా అంటూ ప్రత్యర్థి శిబిరం నుంచి దాడి కనిపిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దిల్లీ రాజకీయాలూ రాష్ట్రంలో గ్రూపులను ఊపేస్తున్నాయి.

Telangana Election Campaign in Social Media : ఎన్నికల వేళ సోషల్​ మీడియాకు భారీ డిమాండ్​.. పైసా కొడితే క్షణాల్లో లక్షల మంది ఫాలోవర్లు

Telangana Election Campaign in Social Media 2023 : ఎన్నికల ప్రచారంలో సరికొత్త ట్రెండ్.. సోషల్​ మీడియా అడ్మిన్​లతో అభ్యర్థుల అలయ్ బలయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.