ETV Bharat / politics

హైడ్రా గురించి ఆందోళన వద్దు - బ్యాంకర్లకు స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం

హైడ్రా విషయంలో బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి - ప్రజాభవన్‌లో బ్యాంకర్లతో సమావేశం.

bhatti_on_bankers_meeting
bhatti_on_bankers_meeting (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2024, 9:06 PM IST

Telangana Deputy CM Bhatti Vikramarka met Bankers: బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హైడ్రా భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో బ్యాంకర్లతో భట్టి సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలు పరిశీలించి నిర్మాణాలకు అనుమతులు ఇస్తాయని అన్నారు. హైడ్రా సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రణ, అక్రమార్కుల పార్కులు, సరస్సులు ఆక్రమించుకోకుండా చూస్తుందని వివరించారు. ప్రభుత్వంలోని కొన్ని శాఖలకు బ్యాంకింగ్ రంగం ద్వారా చేయూతను అందించాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు సమావేశం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని కొనియాడారు.

ఉచిత బస్సు ప్రయాణం ఉద్దేశం అదే: భవిష్యత్తులో ఈ సాంప్రదాయాన్ని కొనగసాగిద్దామన్న ఆయన బ్యాంకర్లు, స్పెషల్ సీఎస్ రామకృష్ణారావులను అభినందించారు. ఆది ప్రజా ప్రభుత్వం, ప్రజల పట్ల కమిట్‌మెంట్‌తో ఉన్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంపై కొంత మంది విమర్శలు చేస్తున్నారన్న భట్టి ఈ పథకం కేవలం మహిళలు ఊరికే తిరగడానికి కాదని స్పష్టం చేశారు. వ్యాపారాలు చేయాలి ఆర్థికంగా బలోపేతం కావాలి కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను ఇవ్వాలనేదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వెనుక ఉన్న ఉద్దేశమని వెల్లడించారు.

స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు: స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. వీలైతే అంతకుమించి వడ్డీ లేని రుణాలు ఇస్తాం అన్నారు. కార్పొరేట్ కమర్షియల్ బ్యాంకులు 9 నుంచి 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయని బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలని భట్టి సూచించారు. రుణాలు ఇచ్చే ముందు ఉన్న నిబంధనలు సరళతరం చేయాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు విభాగాల్లో బ్యాంకర్లు ఇచ్చిన రుణాలరికవరీ శాతం తక్కువగా ఉంటుంది, అదే స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చిన రుణాల రికవరీ శాతం చూస్తే 98 శాతానికిపైగా ఉందన్నారు.

అమిత్ షాతో పవన్ కల్యాణ్ కీలక సమావేశం - ఏం చర్చించారంటే?

మహిళలకు ప్రత్యేకంగా కేటాయింపులు: బ్యాంకర్లు స్వయం సహాయక సంఘాల మహిళలకు తక్కువ వడ్డీ రేట్లు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు భట్టి సూచించారు. మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి వారికి లీజుకు ఇవ్వాలన్న ఆలోచన సైతం చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలకు పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా కేటాయింపులు ఉంటాయని, బ్యాంకర్లు విశాల దృక్పథంతో సహకరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు.

బ్యాంకర్లు పెరిగితే రాష్ట్రం పెరుగుతుంది: స్వయం సహాయక సంఘాల సభ్యులు 12 వేల కోట్లపైగా టర్నోవర్ చేస్తున్నారని, ఇదే సమయంలో గిరిజన ప్రాంతాల్లోని సంఘాలు సుమారు 200 కోట్ల వరకు తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వారు తీసుకున్న రుణాలు మాఫీ చేయడంకాని లేదంటే వన్ టైం సెటిల్మెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించాలని బ్యాంకర్లకు సూచించారు. హైదరాబాదులో రూ.3000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వాలని నిర్ణయించామని, వాటిని రూ.5 వేల కోట్లకు తీసుకువెళ్లాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణను గొప్ప రాష్ట్రంగా, ప్రోగ్రెసివ్ స్టేట్​గా ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నమని బ్యాంకర్లు విస్తరించాలని కోరుకుంటున్నాని బ్యాంకర్లు పెరిగితే రాష్ట్రము పెరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన మద్యం సరఫరా - ఏమైందంటే !

మద్దెలచెరువు సూరి హత్య కేసు - 12 ఏళ్ల తర్వాత బయటికొచ్చిన ప్రధాన నిందితుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.