ETV Bharat / politics

తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడు ఎవరు? - రేసులో ఆ ఇద్దరు! - TELANGANA PCC CHIEF BC CANDIDATE

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2024, 8:10 AM IST

Updated : Aug 25, 2024, 8:26 AM IST

TPCC Chief Selection 2024 : నూతన పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నాయకుడే ఎంపికయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వం నుంచి అభిప్రాయం తీసుకున్న పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధ్యక్షుడితోపాటు కార్యనిర్వహక అధ్యక్షులు సహా మరికొన్ని పదవులు కూడా ప్రకటించే యోచనలో ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు మంత్రి పదవులు భర్తీకి కూడా అధిష్ఠానం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.

TPCC Chief Selection
TPCC Chief Selection (ETV Bharat)

Telangana Congress New PCC Chief Selection : పీసీసీ అధ్యక్షుడి పేరు దాదాపు ఖరారు అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం రోజంతా దిల్లీలో పార్టీ అధిష్ఠానంతో పలు దఫాలు సమావేశమైన రాష్ట్ర నాయకులు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చించినట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెంది ప్రచార కమిటీ సభ్యుడు మధుయాస్కీ గౌడ్‌, ప్రస్తుత కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్‌ పేరు తెరపైకి వచ్చింది.

ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్లు కూడా చర్చకు వచ్చాయి. ఇందులో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌, మంత్రిగా దామోదర రాజనర్సింహ ఉండడంతో పీసీసీ చీఫ్‌ ఆ సామాజిక వర్గానికి దక్కే అవకాశం లేదని సమాచారం. ఎంపీ బలరామ్‌ నాయక్‌ ఎంపీగా ఉంటూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏ మేరకు అవకాశం ఉంటుందన్న అంశంపై చర్చించినట్లు సమాచారం.

సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలు అభిప్రాయాలను వేర్వేరుగా అధిష్ఠానానికి చెప్పినట్లు సమాచారం. అత్యధిక జనాభా కలిగిన బీసీ సామాజికవర్గం నుంచి పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు గౌడ సామాజిక వర్గానికి చెందిన మహేష్‌కుమార్‌ గౌడ్‌, మధుయాస్కీలు నువ్వానేనా అన్నట్లుగా పోటీపడుతున్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ దిల్లీ వెళ్లినప్పటికీ ఆమె అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

మహేశ్​ కుమార్​ గౌడ్​ వైపే మొగ్గు : త్వరలో అదనపు ఇన్‌ఛార్జీ బాధ్యత నుంచి ఆమెను తప్పించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీలో ఎలాంటి వివాదం లేకుండా డీఫ్యాక్టో పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మహేశ్​ కుమార్‌ గౌడ్‌ వైపు పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాహుల్‌ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, వేణుగోపాల్‌తో రాష్ట్ర నాయకులు తమ అభిప్రాయాలను తెలియచేసినందున తుది నిర్ణయం అధిష్ఠానం తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మంత్రి వర్గ విస్తరణపై చర్చ : మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర నాయకత్వం చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత మంత్రి వర్గానికి అదనంగా మరో ఆరుగురికి పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే ఇందులో నాలుగు మాత్రమే భర్తీ చేసి మరొక రెండు అంటి పెట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డి హామీ మేరకు వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు పదవి దక్కే అవకాశం ఉంది. బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డికి చోటు దక్కుతుందని చెబుతున్నారు.

మరొకటి రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వాలని యోచిస్తున్నారు. ఏఐసీసీ హామీ మేరకు కోమటిరెడ్డి రాజాగోపాల్‌ రెడ్డి, సీఎం రేవంత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలలో ఒకరికి మాత్రమే పదవి వరిస్తుందని చెబుతున్నారు. ఇక్కడ రాజగోపాల్‌ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే లంబాడ సామాజిక వర్గానికి చెందిన బాలునాయక్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. రాజగోపాల్‌ రెడ్డికి మంత్రి హోదా దక్కకపోతే ఆయనకు ఆర్టీసీ కాని, పౌరసరఫరాల శాఖ ఛైర్మన్‌ పదవి ఇచ్చి సంతృప్తి పరచాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే యాదవ సామాజిక వర్గానికి చెందిన బీర్ల ఐలయ్యను మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ తర్వాతే కార్యనిర్వహక అధ్యక్షుల నియామకం ఉంటుందని నేతలు చెబుతున్నారు.

వీడిన 'పదవుల' చిక్కుముడి! - రెండు మూడు రోజుల్లో నూతన సారథి పేరు ప్రకటన!! - New TPCC President Selection

మంత్రివర్గంలో వీరికేనా ఛాన్స్​? - 11మందిలో ఆరుగురికే అవకాశం - telangana cabinet Expansion problem

Last Updated : Aug 25, 2024, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.