CM Revanth will attend Vizag meeting: విశాఖ ఉక్కుపరిశ్రమను ప్రైవేటికరించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ గిడుగు రుద్రరాజు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నిర్వహించే సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని ఆయన తెలిపారు. విశాఖ సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్ అంశంపై నేడు జరిగే సభలో కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించనుందని తెలుస్తోంది.
హాజరుకానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి: నేడు తృష్ణా మైదానంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బహిరంగ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ విశాఖలో నిర్వహించనున్న సభకు రేవంత్ రెడ్డి హాజరు అవుతారని పీసీసీ వర్గాలు స్పష్టం చేసాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో నిర్వహించే సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
విశాఖ సభలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్ అంశంపైనా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందని ఇప్పటికే ఆ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిల ప్రకటించడం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టత నిచ్చే అంశంలో ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇచ్చింది.
విశాఖ ఉక్కు భూములు విక్రయించారా? కొనుగోలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా?: హైకోర్టు
ఉక్కు పరిశ్రమ కోసం కలిసి పోరాడుదాం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గతంలోనే వ్యతిరేకించినట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ గిడుగు రుద్రరాజు వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో నేడు జరగనున్న సభ ఏర్పాటు ఆయన పరిశీలించారు. అనంతరం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో గిడుగు భేటీ అయ్యారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీ కేంద్ర న్యాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నేడు జరగబోయే సభకు సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు నేతలు హాజరవుతారని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలంటే అంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
ఏపీలో తెలంగాణ సీఎం పర్యటన తేది ఖరారు- విశాఖలో కాంగ్రెస్ బహిరంగ సభకు హజరు కానున్న రేవంత్
హాజరు కానున్న కాంగ్రెస్ నేతలు: 'న్యాయసాధన సభ’ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న బహిరంగ కార్యక్రమానికి రేవంత్‌తో పాటు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్‌తోపాటుగా, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, సీడీబ్ల్యూసీ సభ్యులు ఎన్.రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేవీ రామచంద్రరావు, తదితర కీలక నేతలు హాజరుకానున్నారు.
విశాఖ ఉక్కు ఊపిరి తీశారు - మెడలు వంచుతామని కేంద్రం ముందు సాగిలపడ్డ జగన్