ETV Bharat / politics

త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ - ఆ నలుగురికే ఛాన్స్ - నామినేటెడ్ పదవుల భర్తీపైనా ఫోకస్ - TELANGANA CABINET EXPANSION 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 13, 2024, 7:43 AM IST

Updated : Aug 13, 2024, 8:42 AM IST

Telangana Cabinet Expansion Latest : సీఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాగానే కాంగ్రెస్‌లో పదవుల భర్తీ జరుగుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 17, 18 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఎంపిక, నామినేటెడ్‌ పదవుల భర్తీలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నాయి. ఆరు మంత్రి పదవులు ఉన్నప్పటికీ, నాలుగు మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రి పదవులు ఆశిస్తున్న కొందరు ఎమ్మెల్యేలకు ఆర్టీసీ, పౌర సరఫరాలు వంటి నామినేటెడ్‌ పదవులు ఇచ్చి క్యాబినెట్‌ హోదా కల్పించి సంతృప్తి పరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Congress Leaders Are Seeking Party Posts
Congress leadership focus on TPCC Selection (ETV Bharat)

Congress Leadership Focus on TPCC Selection : రాష్ట్ర కాంగ్రెస్‌లో పార్టీ పదవులతోపాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీకి సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ సమావేశాల ముందే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా, సామాజిక సమతుల్యత విషయంలో ఏకాభిప్రాయం కుదరక తాత్కాలికంగా వాయిదా పడ్డట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పెట్టుబడుల కోసం అమెరికా, దక్షిణ కొరియాల పర్యటనకు సీఎం బృందం వెళ్లడంతో పదవులు ఆశిస్తున్న నాయకులు వేచి చూస్తున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్‌ రెడ్డి, బుధవారం హైదరాబాద్‌ రానున్నారు. మరుసటి రోజు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 13 రోజులుగా విదేశాల్లో పర్యటించిన సీఎం, ఈ నెల 16న పాలనాపరమైన అంశాలపై దృష్టి సారిస్తారు. ఆ తర్వాత ఈ నెల 17న లేదంటే 18న దిల్లీ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

Cabinet Expansion in Telangana : పీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు సీనియర్‌ నాయకులు పోటీ పడుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ బలరాం నాయక్‌, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్, మాజీ ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్‌ గౌడ్‌లు.. పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు మంత్రివర్గంలో స్థానం కోసం ఏఐసీసీ కోటా కింద మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు, మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామితోపాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. అయితే ఆరు మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం ఉన్నా, నాలుగు మాత్రమే ఇప్పుడు భర్తీ చేసే యోచన కనిపిస్తోంది.

రెండు మంత్రివర్గ స్థానాలు పక్కన పెడుతున్న నాయకత్వం : ఒకటి మైనారిటీల కోసం పక్కన పెడుతున్న రాష్ట్ర నాయకత్వం, మరొకటి కూడా పక్కన పెడుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సామాజిక సమతుల్యతను పాటించేందుకు పీసీసీ అధ్యక్ష పదవితోపాటు నాలుగు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవులు వెంటనే భర్తీ చేసే అవకాశం ఉంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. మధుయాష్కీ, బలరాంనాయక్‌, సంపత్‌కుమార్‌లల్లో ఒకరికి మాత్రం పీసీసీ అధ్యక్ష పదవి దక్కితే మిగిలిన వారిని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవులు ఇచ్చి సరిపెట్టాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా మంత్రి పదవులు దక్కే అవకాశం లేని ఎమ్మెల్యేలకు నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది.

పార్టీ పదవులకు వేళాయే! - త్వరలోనే పీసీసీ, వర్కింగ్​ ప్రెసిడెంట్ల నియామకం! - Congress Party Posts

ఆర్టీసీ, పౌరసరఫరాలు, మూసీ డెవలెప్‌మెంట్‌ అథారిటీ తదితర వాటికి ఎమ్మెల్యేలను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ స్థాయిలో సుదీర్ఘ చర్చ జరిగిన తరువాత ఒకేసారి పదవులు భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పదవుల కోసం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Last Updated : Aug 13, 2024, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.