ETV Bharat / politics

టార్గెట్ 17 ఎంపీ స్థానాలు - ఈనెల 20 నుంచి బస్సు యాత్రలు : కిషన్‌రెడ్డి - Telangana BJP Bus Yatra 2024

Telangana BJP Bus Yatra 2024 : లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 17 సీట్లు కచ్చితంగా గెలుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,025 కిలోమీటర్లలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. ఈ నెల 20 తేదీ నుంచి మార్చి 1 వరకు జిల్లాల్లో యాత్రలు కొనసాగుతాయని వెల్లడించారు.

BJP BUS Yatra Details in Telangana
Kishan Reddy on BJP BUS Yatra
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 7:25 PM IST

17 స్థానాల్లో గెలిచేలా మా బస్సు యాత్రలు సన్నద్ధం చేశాం కిషన్‌రెడ్డి

Telangana BJP Bus Yatra 2024 : విజయ సంకల్ప యాత్ర(BJP Vijaya Sankalpa Yatra) పేరుతో బస్సు యాత్ర చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 1 వరకు ఐదు బస్సు యాత్రలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో 1,025 కిలోమీటర్లు మేర ఈ యాత్రలు కొనసాగుతాయని పేర్కొన్నారు. పదేళ్లలో ప్రధాని మోదీ సాధించిన విజయాలు, అదే పదేళ్లలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం వైఫల్యాలు, ఆరు దశాబ్ధాల కాలంలో కాంగ్రెస్‌ లోపాలను ప్రజలకు తెలిపే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.

'కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నా - పనులు పార్టీ ఆఫీసూ దాటలేకపోతున్నాయి'

తెలంగాణలో బీజేపీ బస్సు యాత్రల పేర్లు, వివరాలు :

క్రమ సంఖ్య యాత్ర పేరునిర్వహించే నియోజకవర్గాలు
1కొమురం భీమ్ యాత్రఅదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్
2శాతవాహన యాత్రకరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల
3కాకతీయ యాత్రఖమ్మం, వరంగల్, మహబూబాబాద్
4కృష్ణమ్మ యాత్రమహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ
5భాగ్యనగర యాత్రభువనగిరి, మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్

Kishan Reddy On Lok Sabha Elections 2024 : రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు, 33 జిల్లాలో చేసే విధంగా యాత్ర ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు. 17 సీట్లు కచ్చితంగా గెలుస్తామని, హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీను ఓడిస్తామని దీమా వ్యక్తం చేశారు. ముఖ్య నేతలు అందరూ పాల్గొనే విధంగా కార్యాచరణ ఉంటుందన్నారు. మండల, నియోజకవర్గాలు వారీగా రోడ్ షోలు ప్రధానంగా ఉంటాయని వెల్లడించారు. అన్ని యాత్రలు భాగ్యనగరంలో కలిసే విధంగా ప్రణాళికలు రూపొందించామని వివరించారు. యాత్రకు సంబంధించిన పోస్టర్‌(BJP Bus Yatra Poster)ను బీజేపీ నేతలతో కలిసి ఆవిష్కరించారు.

"కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే, కాంగ్రెస్ పాలన అంకెల గారడీతోపాటు మాటల గారడీ"

"ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. ప్రధానిగా మళ్లీ మోదీ ఉండాలని రాష్ట్ర యువత కోరుకుంటోంది. జాతీయస్థాయిలో ఒక్క ఎంపీ సీటు కూడా ప్రకటించలేదు. టికెట్లపై కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంటారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ భేటీ ఉంది. గతంలోనే మేము మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించాం. ఇప్పుడు మళ్లీ మేడిగడ్డకు వెళ్లాల్సిన అవసరం లేదు. కృష్ణా జలాల సమస్యపై ఏపీ, తెలంగాణ మాట్లాడుకుంటే సరిపోతుంది."- కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Kishan Reddy Comments on Congress : దేశంలో నరేంద్ర మోదీకి ఎదురు నిలబడే కూటమి ఏది లేదని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీకి మధ్యే పోటీ ఉండనుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2024) కాంగ్రెస్ గెలిచినా ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో మోదీ రావాలని యువత కోరుకుంటున్నారని పేర్కొన్నారు. యాత్రలో రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు సుస్థిరతకు అస్థిరతకు మధ్య జరగనున్నాయని చెప్పారు.

త్వరలో చర్లపల్లి టెర్మినల్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితమిస్తారు : కిషన్ రెడ్డి

రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది : కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.