TDP Second List of Candidates: తెలుగుదేశం పార్టీ ప్రకటించే మలిజాబితాలో తమ పేరు ఉంటుందా లేదా అనే ఉత్కంఠ సీనియర్ నేతల్లో నెలకొంది. ముఖ్యంగా తొలిజాబితాలో చోటు దక్కని కళావెంకట్రావు, గౌతు శిరీష, గుండా లక్ష్మీదేవమ్మ, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, జవహర్, దేవినేని ఉమా, యరపతినేని శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జైనాగేశ్వర్ రెడ్డి తదితర నేతలు, వారి క్యాడర్ మలి జాబితాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొన్ని చోట్ల తీవ్ర పోటీ నెలకొనటంతో గెలుపుగుర్రాల ఎంపిక అధినేతకు ఒకింత కత్తిమీద సాములానే నడిచిందని చెప్పాలి.
మలి జాబితాలో ప్రకటించాల్సిన స్థానాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గొండు శంకర్ల మధ్య పోటీ నెలకొని ఉంది. నరసన్నపేటలో బగ్గు రమణమూర్తి, బొగ్గు లక్ష్మణరావు కుమారుడు ల మధ్య పోటీ ఉన్నందున అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంది. పలాసలో గౌతు శిరీష నేడు ప్రకటించే జాబితాపై ఆశపెట్టుకున్నారు. పాతపట్నంలో కలమట వెంకట రమణ, మామిడి గోవిందరావుల్లో అభ్యర్థి ఎవరనేది తేలాల్సి ఉంది. ఎచ్చెర్లలో పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు తన పేరు నేటి జాబితాలో వస్తుందనే ధీమాతో ఉండగా, తనవంతు ప్రయత్నం చేసిన కలిశెట్టి అప్పలనాయుడు ఆశ వదులుకోలేదు.
గురువారం టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల: చంద్రబాబు
పేరు ఉంటుందా లేక వేరొక స్థానంలోనా: చీపురపల్లిలో గంటా శ్రీనివాసరావు పేరు ఉంటుందా లేక వేరొక స్థానంలో ఉంటుందా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. రంపచోడవరంలో మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, చిన్నం బాబు రమేష్, సీతంశెట్టి వెంకటేశ్వర్లులలో అభ్యర్థి ఎవరనేది తేలాల్సి ఉంది. శృంగవరపుకోట స్థానానికి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ప్రవాసాంధ్రుడు గొంప కృష్ణల్లో అభ్యర్థి ఎవరనేది నేడు తేలుతుందో లేదో వేచి చూడాలి. చోడవరం స్థానానికి బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ల్లో ఒకరి అభ్యర్థిగా ఎంపిక కానున్నారు.
నేటి జాబితాలో వారికి చోటు దక్కే అవకాశం: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల విషయానికొస్తే, పత్తిపాడు స్థానానికి దివంగత వరపుల రాజా సతీమణి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. రాజమండ్రి రూరల్ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నేటి జాబితాలో చోటు దక్కే అవకాశం ఉంది. గ్రూప్ రాజకీయాలకు కేంద్రంగా మారిన కొవ్వూరు, గోపాలపురం స్థానాలకు నేటి జాబితాలో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. మద్దిపాటి వెంకటరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, అనీల్, జవహర్ లలో ఏ ఇద్దరికి అదృష్టం వరిస్తుందో వేచి చూడాలి. దెందులూరు సీటుపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ధీమాతో ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అభ్యర్థులు పెండింగ్‌లో ఉన్న పెనమలూరు, మైలవరం స్థానాలకు దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్, బోడె ప్రసాద్, ఎంఎస్ బేగ్‌లలో ఏ ఇద్దరికి ఛాన్స్ దక్కుతుందనే సస్పెన్స్‌కు నేడు తెరపడే అవకాశం ఉంది.
ఏ ముగ్గురికి అదృష్టం వరిస్తుందో: గుంటూరు తూర్పు స్థానానికి నజీర్ అహ్మాదా లేక వేరే సామాజిక వర్గం నుంచి పోటీ ఉంటుందా అనే ఉత్కంఠ నేటితో వీడుతుందని జిల్లా నేతలు ఎదురుచూస్తున్నారు. గురజాల, నరసరావుపేట, పెదకూరపాడు స్థానాలకు యరపతినేని శ్రీనివాసరావు, నల్లపాటి రాము, అరవిందబాబు, పార్టీలో చేరే అవకాశం ఉన్న జంగా కృష్ణమూర్తి, భాష్టం ప్రవీణ్, కొమ్మాలపాటి శ్రీధర్లలో ఏ ముగ్గురికి అదృష్టం వరిస్తుందనేది వేచి చూడాలి.
'వారసులొస్తున్నారు'- ఎన్నికల బరిలో గెలుపే లక్ష్యంగా ముందడుగు!
ఇతర పార్టీల నుంచి పలువురు ఆశావహులు: ప్రకాశం జిల్లా మార్కాపురం స్థానానికి కందుల నారాయణరెడ్డి, గిద్దలూరుకు అశోక్ రెడ్డిలు ఇన్‌ఛార్జులుగా ఉన్నారు. దర్శికి కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉన్నందున, ఇతర పార్టీల నుంచి పలువురు ఆశావహులు తెలుగుదేశంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నందున, అందుకు తగ్గట్టుగా సమీకరణాలు చూసుకుని ఈ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. కందుకూరు స్థానం ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మలి జాబితాపై అశలు పెట్టుకోగా, కోవూరులో పోలంరెడ్డి దినేష్ రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతిలలో అభ్యర్థి ఎవరనేది నేడు తేలే అవకాశం ఉంది.
ఆత్మకూరు స్థానం నుంచి ఆనం రాంనారాయణ రెడ్డి పోటీకి సిద్ధమైనట్లు సమాచారం. సర్వేపల్లికి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఇక్కడ పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్‌ల పేర్లపైనా జరిగిన అభిప్రాయ సేకరణ సస్పెన్స్‌కు నేడు తెరపడే అవకాశం ఉంది. వెంకటగిరికి కురుగొండ్ల రామకృష్ణ లేదా ఆయన కుటుంబంలోనే వేరొకరికి సీటు దక్కవచ్చని తెలుస్తోంది.
టీడీపీ-జనసేన తొలిజాబితాలో యువ జోష్ - 45 ఏళ్లలోపు 24 మంది
రాయలసీమ జిల్లాల్లో: రాయలసీమ జిల్లాల విషయానికొస్తే, శ్రీకాళహస్తి స్థానానికి బొజ్జల సుధీర్ రెడ్డి లేదా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడుల్లో అభ్యర్థి ఎవరనేది నేడు తేలే అవకాశం ఉంది. సత్యవేడు స్థానంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం ఆ పార్టీకి దూరంగా ఉన్నందున తెలుగుదేశం నుంచి పోటీ చేస్తారా అనే ప్రచారం నడుస్తోంది. చంద్రగిరికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పులవర్తి నాని, పూతలపట్టు ఇన్ఛార్జ్ కలికిరి మురళీమోహన్‌లు మలిజాబితాపై ఆశలు పెట్టుకున్నారు.
మదనపల్లి స్థానానికి దొమ్మాలపాటి రమేష్ ఇన్‌ఛార్జ్‌గా ఉండగా, ముస్లిం మైనార్టీకి ఈ స్థానం వెళ్లే అవకాశమూ లేకపోలేదు. రాజంపేట స్థానానికి బత్యాల చంగల్ రాయుడా లేక ముక్కా రూపానందరెడ్డా అనేది తేలాల్సి ఉంది. రైల్వే కోడూరులో పంతగాని నరసింహ ప్రసాద్, అనిత దీప్తిల్లో అభ్యర్థి ఎవరనే స్పష్టత నేడు వచ్చే అవకాశం ఉంది. పుంగనూరు స్థానంపై చల్లా జయచంద్రారెడ్డి మలిజాబితాపై అశలు పెట్టుకున్నారు.
కమలాపురానికి పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డిల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ప్రొద్దుటూరు స్థానానికి అభ్యర్థి ముక్కు ప్రవీణ్ రెడ్డి, వరదరాజుల రెడ్డి, లింగారెడ్డిల్లో ఎవ్వరనేదీ నేడు తేలే అవకాశం ఉంది. ఎమ్మిగనూరు స్థానానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బీవీ జయనాగేశ్వర రెడ్డి మలిజాబితా ప్రకటన కోసం అశగా ఎదురుచూస్తున్నారు.
వెనకబడిన వర్గాలకే టీడీపీ-జనసేన తొలి జాబితాలో పెద్దపీట
మంత్రాలయం స్థానానికి తిక్కారెడ్డి, రాఘవేంద్రరెడ్డిల్లో అభ్యర్థి ఎవరో నేడు తెరపడే అవకాశం ఉంది. ఆదోనికి మీనాక్షి నాయుడు లేదా సుధాకర్ రెడ్డి లేదా ఇంకెవరైనానా అనే సస్పెన్స్ వీడనుంది. ఆలూరు స్థానానికి వైకుంఠం కుటుంబ సభ్యులు మల్లిఖార్జున్, జ్యోతిల్లో ఒకరా లేక బీసీ నేత వీరభద్రగౌడా అనేది నేడు తేలనుంది. నందికొట్కూరు స్థానానికి మాండ్రశివానందరెడ్డి ఇక్కడ బాధ్యతలు పర్యవేక్షిస్తుండగా, అభ్యర్థి ఎంపికపై వివిధ సమీకరణాలు బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
గుమ్మనూరుకు సీటు దక్కుతుందా: అనంతపురం జిల్లాలో గుంతకల్ స్థానానికి జితేంద్రగౌడ్ ఇన్‌ఛార్జ్‌గా ఉండగా ఇటీవలే తెలుగుదేశంలో చేరిన మాజీమంత్రి గుమ్మనూరు జయరామ్ తనకే సీటు దక్కుందనే ధీమాతో ఉన్నారు. కదిరి స్థానానికి కుందికుంట ప్రసాద్ లేదా అతని భార్యని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. పుట్టపర్తి స్థానానికి మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఇన్‌ఛార్జ్‌గా ఉండగా ఆయన కోడలు లేదా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారి సుధాకర్‌లలో ఎవరనేది నేడు తేలుతుందో లేదో వేచి చూడాలి.
మూడు పార్టీల పొత్తు జగన్‌ను ఓడించడం కోసమే కాదు - రాష్ట్రాన్ని గెలిపించడం కోసం : చంద్రబాబు