ETV Bharat / politics

ఆడబిడ్డ చావుపైనా జగన్ రెడ్డి రాజకీయాలు చేయడం దుర్మార్గం: వంగలపూడి అనిత - Geetanjali Murder Issue

Geetanjali Murder Issue Hulchul in AP: గీతాంజలి మృతిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Geetanjali_Murder_Issue_Hulchul_in_AP
Geetanjali_Murder_Issue_Hulchul_in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 5:22 PM IST

Geetanjali Murder Issue Hulchul in AP: ఎన్నికల వేళ గీతాంజలి మృతి అంశం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. టీడీపీ సోషల్ మీడియా ప్రచారం వల్లే గీతాంజలి చనిపోయినట్లు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. శవాలతో రాజకీయాలు చేయటానికి అలవాటుపడిన సీఎం జగన్ శవ రాజకీయాలకు తెరలేపాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రతీ ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనా ?: నారా లోకేశ్

ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబును విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పని పోలీసులు తెనాలిలో గీతాంజలి ఆత్మహత్య కేసులో అరెస్టు చేసినట్లు తెలిపారు. రాంబాబు వెంట పోలీసులతో పాటు ఆయన కుమార్తె కూడా వెళ్లింది. పసుమర్తి రాంబాబును తెనాలి తీసుకెళ్లే అవకాశం ఉంది. గీతాంజలి మృతిపై ఇప్పటికే పోలీసులు తెనాలిలో కేసు నమోదు చేశారు.

గీతాంజలిని హత్య చేసింది వైసీపీ అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఆడబిడ్డ చావుపైనా జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. శవాలతో రాజకీయాలు చేయడం జగన్ రెడ్డికి అలవాటేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ బాబాయ్ హత్య, కోతి కత్తి డ్రామాలు రక్తి కట్టించాడని గుర్తు చేశారు. గీతాంజలి మృతి సమయంలో ఆమె వెంట ఉన్న ఇద్దరి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని అనిత నిలదీశారు.

'గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారాలు' - ఐటీడీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

గీతాంజలిని గుర్తించని శవంగా రెండు రోజులు ఆస్పత్రిలోనే ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. టీడీపీ సోషల్ మీడియా ప్రచారం వల్లే గీతాంజలి చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గీతాంజలి భర్తతో వైసీపీ వాళ్లే కంప్లైంట్ ఇప్పించింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ఎనిమిదేళ్ల గీతాంజలి కుమారుడికి 5 ఏళ్లుగా అమ్మఒడి ఎలా వస్తోందని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఆడబిడ్డలే జగన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడిస్తారని అనిత వ్యాఖ్యానించారు.

"గీతాంజలిని హత్య చేసిన వైసీపీ శవాలతో రాజకీయాలకు తెరలేపింది. ఆడబిడ్డ చావుపైనా జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం దుర్మార్గం. గతంలో కూడా బాబాయ్ హత్య, కోతి కత్తి డ్రామాలు రక్తి కట్టించిన విషయం అందరికీ తెలిసిందే. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ సోషల్ మీడియా ప్రచారం వల్లే గీతాంజలి చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు." - వంగలపూడి అనిత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.