TDP Dhulipalla Narendra on Sajjala Vote : రాష్ట్రంలో దొంగ ఓట్ల దందాకు తాడేపల్లి కేంద్రం. సీఎం క్యాంప్ ఆఫీస్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కూడా అదే అనడానికి సజ్జల, ఆయన కుటుంబసభ్యులకు తాడేపల్లి, పొన్నూరుల్లో రెండు ఓట్లు ఉండటమే ఉదాహరణ అంటూ టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు.
తాడేపల్లి ప్యాలెస్‌లోనే దొంగ ఓట్ల దందా మొదలైందనడానికి ఇదిగో సాక్ష్యమంటూ ఆ వివరాలను ట్వీట్ చేశారు. తెల్లారితే మైక్ ముందు నీతి వ్యాఖ్యలు వల్లించే క్యాంప్ ఆఫీస్ క్లర్క్ సజ్జల అండ్ ఫ్యామిలీకి రెండు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని ధూళిపాళ్ల నరేంద్ర బహిర్గతం చేశారు. క్యాంప్ ఆఫీస్ క్లర్క్ రెడ్ హ్యాండెడ్‌గా బుక్ అంటూ దుయ్యబట్టారు. రెండు చోట్ల దొంగ ఓట్లతో అడ్డంగా దొరికిన సలహాల రెడ్డి ఇప్పుడేం సమాధానం చెప్తారని నిలదీశారు. పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాల్లో రెండు చోట్ల ఉన్న రెండు ఓట్ల వివరాలతో ధూళిపాళ్ల నరేంద్ర విడుదల చేశారు.
దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు- కొత్తగా లిస్ట్‌లోకి 2 కోట్ల మంది యువత
దొంగ ఓట్ల కోసమేనా జనం సొమ్ముధారపోసింది? : "దొంగ సలహాలతోపాటు దొంగ ఓట్లు కోసమేనా సజ్జలకి జనం సొమ్ము రూ.150 కోట్లు జగన్ ధారపోసింది. సజ్జలకి ఉన్నది ఒక ఫ్యామిలీ, కానీ ఓట్లు మాత్రం పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాల్లో రెండేసి ఉన్నాయి. మిల్లెట్ రెడ్డి ఫ్యామిలీ ఈ మిరాకిల్ ఏందో!" అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా విమర్శించారు.
డూప్లికేట్, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు : ఏపీలో డూప్లికేట్ ఓటు, డబుల్ ఓట్లపై ఎన్నికల సంఘం(Election Commission) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) అన్ని జిల్లాల కలెక్టర్లకు గతంలోనే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఓ వ్యక్తికి ఎక్కువ చోట్ల ఓట్లు ఉండడం నిబంధనలకు విరుద్ధమని, తప్పుడు డిక్లరేషన్ ఇచ్చేవారిపై కేసులు నమోదు చేయాలన్నారు.
మారని వాలంటీర్ల తీరు - అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా కార్యకలాపాలు
తప్పుడు డిక్లరేషన్‌తో ఓటుకు దరఖాస్తు చేస్తే జైలుశిక్షకి అర్హులని, వేరే ఎక్కడా తమకు ఓటు లేదని సదరు ఓటరు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే కొత్త ఓటరుగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. 20 ఏళ్లు పైబడిన వారు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేస్తే అధికారులు విచారించి రిమార్క్ ఇవ్వాలని, ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటు హక్కు ఉండేలా చూడాలన్నారు. ఇళ్లు మారే వారు ఓటుకు ఫామ్ 8 ద్వారా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా తప్పుడు డిక్లరేషన్ సమర్పిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఒక ఓటరుకు ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండాలని స్పష్టం చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో ఎం.కె. మీనా కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
తప్పుల తడకగానే ఓటర్ల జాబితా - తిరుపతిలో ఓకే ఇంటి చిరునామాతో 32 ఓట్లు