Babu, pawan meet Modi : రాష్ట్రంలో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి చేరుకున్న ఆయన ప్రపంచంలోనే భారతదేశం కీలకపాత్ర పోషించబోతుందన్నారు. 2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ కృషిచేస్తున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో NDA క్లీన్ స్వీప్ చేస్తుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ ఘట్టంలో ఎన్డీయే నేతలు, చంద్రబాబుతో కలిసి జనసేనాని పాల్గొన్నారు. మూడోసారి కూడా మోదీ ప్రధాని అవుతారని స్పష్టం చేశారు.