ETV Bharat / politics

రాష్ట్ర పోలీసు శాఖ గౌరవాన్ని దిగజార్చిన ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకు?: చంద్రబాబు - ఏపీలో పోలీసుల తీరుపై చంద్రబాబు

TDP Chandrababu on AP Police: పోలీసులు అనుసరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చట్టాన్ని అమలు చేయలేని ఆయా జిల్లాల ఎస్పీలు ఖాకీ యూనిఫాం తీసేసి వైఎస్సార్సీపీ జెండానే యూనిఫాంగా కుట్టించుకోవాలని ఎద్దేవా చేశారు.

TDP_Chandrababu_on_AP_Police
TDP_Chandrababu_on_AP_Police
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 12:17 PM IST

TDP Chandrababu on AP Police: రాష్ట్రంలో పాలనా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయినందున, ఊరూరా జగన్ గూండా రాజ్ పాలన మాత్రమే ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మార్టూరులో మారణాయుధాలతో మైనింగ్ తనిఖీలు, క్రోసూరులో రౌడీ మూకల విధ్వంసానికి పోలీసుల సహకారం అనేది పూర్తిగా గాడి తప్పిన పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.

మార్టూరులో గూండాలతో, మారణాయుధాలతో గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీల పేరిట చేసిన అరాచకం వ్యవస్థల విధ్వంసం కాదా అని దుయ్యబట్టారు. మైనింగ్ శాఖలో ఒక ఏడీ స్థాయి అధికారి రౌడీలతో తనిఖీలకు వచ్చిన ఘటన రాష్ట్రంలో గూండా రాజ్​కు ఉదాహరణగా నిలుస్తుందని విమర్శించారు. దీనిని ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టి అరెస్టు చేసినందుకు పోలీసులు, అధికారుల సిగ్గుపడాల్సిన అవసరం ఉందని మండిపడ్డారు.

'సాక్షి పేపర్​ తనదే అని చెప్పే ధైర్యం జగన్​కు ఉందా?' - వాటాల వివరాలు బయటపెట్టిన ఆనం

"రాష్ట్రంలో పాలనా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయినందున, ఊరూరా జగన్ గూండా రాజ్ మాత్రమే ఉంది. మార్టూరులో మారణాయుధాలతో మైనింగ్ తనిఖీలు, క్రోసూరులో రౌడీ మూకల విధ్వంసానికి పోలీసుల సహకారం అనేది పూర్తిగా గాడి తప్పిన పాలనకు నిదర్శనం. మైనింగ్ శాఖలో ఒక ఏడీ స్థాయి అధికారి రౌడీలతో తనిఖీలకు వచ్చిన ఘటన రాష్ట్రంలో గూండా రాజ్​కు ఉదాహరణగా నిలుస్తుంది. రాష్ట్ర పోలీసు శాఖ గౌరవాన్ని దిగజార్చిన ఇలాంటి ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకు? చట్టాన్ని అమలు చేయలేని ఆయా జిల్లాల ఎస్పీలు ఖాకీ యూనిఫాం తీసేసి వైఎస్సార్సీపీ జెండానే యూనిఫాంగా కుట్టించుకోవాలి." - టీడీపీ అధినేత చంద్రబాబు

అదే విధంగా క్రోసూరులో ఎమ్మెల్యే కొడుకు వందల మందితో ప్రజల ఆస్తులపై దాడికి దిగితే చర్యలు తీసుకోకపోగా పోలీసులు సహకరించడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. రాష్ట్ర పోలీసు శాఖ గౌరవాన్ని దిగజార్చిన ఇలాంటి ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకని ప్రశ్నించారు. తాను అధిపతిగా ఉన్న వ్యవస్థను తానే నడిపించలేని పరిస్థితి వచ్చినప్పుడు డీజీపీ ఆ స్థాయి పోస్టులో కూర్చోవడానికి అనర్హులని స్పష్టంచేశారు.

ఉద్యోగాల భర్తీపై జగన్ ఏనాడూ శ్రద్ధ పెట్టలేదు - నాది విజన్‌, జగన్‌ది పాయిజన్‌: చంద్రబాబు

ఒకప్పుడు దేశం కీర్తించిన మన పోలీసు శాఖ ఇప్పుడు కళ్ల ముందే పతనం అవుతుంటే కట్టడి చేయలేని డీజీపీ తక్షణమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని హితవుపలికారు. కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన జిల్లా ఎస్పీలు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అరాచకాలకు కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. చట్టాన్ని అమలు చేయలేని ఆయా జిల్లాల ఎస్పీలు ఖాకీ యూనిఫాం తీసేసి వైఎస్సార్సీపీ జెండానే యూనిఫాంగా కుట్టించుకోవాలని సూచించారు.

పోలీసు శాఖలో ఇలాంటి అసమర్థ ఎస్పీలు, అధికారులు హోంగార్డుతో సెల్యూట్ కొట్టించుకునేందుకు కూడా అర్హులుకారని మండిపడ్డారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న అధికారులు చట్టానికి కట్టుబడి పనిచేయాలని అన్నారు. మరో రెండు నెలల్లో ఈ రౌడీ మూకలను ప్రజాకోర్టు శిక్షిస్తుందని, తప్పు చేసిన అధికారులను న్యాయస్థానాలు తప్పక శిక్షిస్తాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

రింగ్​రోడ్​ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ - చంద్రబాబు బెయిల్​ రద్దుకు సుప్రీం 'నో'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.