Buddha Venkanna Complaint on Vijayasai Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన ప్రతికూల వ్యాఖ్యలపై తెలుగుదేశం మండిపడింది. విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకి ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు గురించి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని సీపీని కోరామని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చే పద్ధతిలో విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకు అన్ని కులాలు అండగా ఉన్నాయని, విజయసాయి రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి స్కాంలో జైలుకు వెళతారని తెలిసే విజయసాయి రెడ్డి ముందుగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని విజయసాయి రెడ్డి విషప్రచారం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని, లేకుంటే కోర్టుకు అయినా వెళ్తానని బుద్దా వెంకన్న తేల్చిచెప్పారు.
"సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసిన విజయసాయిపై కేసు పెట్టాలని కోరాం. విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు. జగన్ స్కామ్‌లో జైలుకెళ్తారని తెలిసి విజయసాయి వ్యాఖ్యలు చేశారు. గతంలో పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని విషప్రచారం చేశారు". - బుద్దా వెంకన్న, టీడీపీ నేత
TDP Varla Ramaiah on VijayaSai reddy Comments: సీఎం చంద్రబాబుపై ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రతికూల వ్యాఖ్యలను డీజీపీ ద్వారకా తిరుమలరావు, మానవ హక్కుల కమిషన్ సీరియస్గా తీసుకోవాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు తలపెడుతున్నారనే కుట్ర విజయసాయి వ్యాఖ్యల్లో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ సాయి, అతని బృందం కదలికలపై నిఘా ఉంచాలని ఎక్స్ వేదికగా కోరారు.
DGP Sir ! In view of the recent negative comments of MP Vijaya Sai Reddy on Sri Chandrababu Naidu, reflects a doubt of conspiracy targeting a conspicuous threat to his life. An unobtrusive watch has to be kept on the movements of A2 Vijaya Sai Reddy and his team.@VSReddy_MP
— Varla Ramaiah (@VarlaRamaiah) December 8, 2024
నేను ఎక్కడికి వెళ్లాలన్నా సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
విజయసాయి రెడ్డిని విచారించాల్సిందే - హైకోర్టులో అప్పీలు చేసిన ఐసీఏఐ