ETV Bharat / politics

నీ చిన్నానను చంపిన వాళ్లని పక్కన పెట్టుకుని - వారికే ఓటు వేయమని ఎలా అడుగుతున్నావు : సునీత - Sunita Requested Not To Vote YSRCP - SUNITA REQUESTED NOT TO VOTE YSRCP

Sunita Requested Voter That Not To Vote YSRCP : హత్య చేసిన వారితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు, నిందితుడిని పక్కన పెట్టుకుని ఓటు వేయాలని కోరుతున్నారని వైఎస్ వివేకా కుమార్తె సునీత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డిని విమర్శించారు. సొంత చిన్నాన్నను చంపించిన వ్యక్తికి ఓటు వేయమని కోరడం తప్పుగా అనిపించట్లేదా అని సునీత నిలదీశారు. అన్నీ మరిచిపోయి ఓటు కోరేందుకు మనసెలా అంగీకరిస్తుందని ఆమె మండిపడ్డారు.

Sunita Aggressive Speech Against CM Jagan
Sunita Requested Voter That Not To Vote YSRCP
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 28, 2024, 4:58 PM IST

Sunita Requested Voter That Not To Vote YSRCP : ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి పొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలు వైఎస్ వివేకా హత్యోదంతాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా కూతురు నర్రెడ్డి సునీత సీఎం జగన్​పై విరుచుకుపడ్డారు. హత్య కేసు దర్యాప్తు, నిందితులు, ఆధారాలు, విచారణ కుట్రలను బయటపెట్టారు.

రాష్ట్ర సీఎం చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధరించలేదని సునీత ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేయడం న్యాయమా?, మీ చెల్లి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటి? అని నిలదీశారు. తన పైనే కేసులు పెట్టడం ఏమైనా న్యాయమా? అని సునీత వాపోయారు. చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు గడిచిందన్న సునీత ఐదేళ్లుగా మీ ప్రభుత్వమే ఉన్నా ఏం చేశారని? జగన్​ను ప్రశ్నించారు.

వైఎస్​ వివేకా హత్యపై జగన్​ కామెంట్స్ - దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో ! - Jagan On YS Viveka Murder Case

Sunita Aggressive Speech Against CM Jagan : ప్రతిపక్షంలో ఉన్నట్లు మీరు మాట్లాడటం సరికాదని, జగన్​ చేయాల్సిన పని సరిగ్గా చేయనందునే బయటకు రావాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. వివేకాను ఎవరు చంపారో దేవుడికి తెలుసని చెబుతున్నారే తాను చెప్పేదంతా నిజం ఆమెలాగే ఆయన చెప్పగలుగుతారా? అని కడిగిపారేశారు. వివేకాను హత్య చేసిన వారికి రక్షణ కల్పిస్తున్నారన్న సునీత హత్య చేసిన వ్యక్తి తనను ఎవరు ప్రేరేపించారో, ఎవరు చంపించారో స్పష్టంగా చెబుతున్నారని గుర్తు చేశారు.

నిందితుల వెనక అవినాష్‌, భాస్కర్‌రెడ్డి ఉన్నారని చెబుతున్నా, జగన్​ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు భద్రత కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్​ సీబీఐ విచారణ కోరారని, మళ్లీ వారే వద్దన్నారని గుర్తు చేస్తూ వారి పేరు బయటకు వస్తుందని సీబీఐ విచారణ కోరట్లేదా? అని నిలదీశారు. నిందితుడని సీబీఐ చెబుతున్నా, అవినాష్​ను పక్కన పెట్టుకుని ఓటు వేయాలని ఎలా కోరుతున్నారని ప్రశ్నించారు.

హంతకుల పార్టీకి ఓటేయొద్దు - జగనన్న పార్టీ గెలవొద్దు : వైఎస్ సునీత

"మీ చిన్నాన్నను చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పుగా అనిపించట్లేదా. ఐదేళ్లు అధికారంలో ఉన్నా కూడా చిన్నాన్న గుర్తు రాలేదు. ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాన్న గుర్తుకు వచ్చారు? సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్నను తెరపైకి తెస్తున్నారు. నేను పోరాడేది న్యాయం కోసమైతే మీరు పోరాడేది పదవుల కోసమే." - సునీత, వివేకా కుమార్తె

'అన్నా' అని పిలుచుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు - వైఎస్ షర్మిల

పదవులు ఆశించి రాజకీయాలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్న మీకు ఐదేళ్లపాటు చెల్లెళ్లు గుర్తు రాలేదా? అని నిలదీశారు. జగన్​ ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటున్నారు, అన్నీ మరిచిపోయి ఓటు కోరేందుకు మనసెలా అంగీకరిస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. 'హంతకులకు ఓటు వేయకూడదు. వైఎస్సార్సీపీ పార్టీ పునాదులు వైఎస్ వివేకా రక్తంలో మునిగి ఉన్నాయి. ఆ పార్టీకి, జగన్​ అన్నకి, హత్య చేసిన ఎంపీకి ప్లీజ్​ ఓటు వేయకండని సునీత విజ్ఞప్తి చేశారు.

శత్రువులు ఇంట్లోనే ఉన్నారని గుర్తించలేక పోయా : వివేకా సతీమణి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.