ETV Bharat / politics

వైఎస్సార్సీపీ సోషల్‌ సైకో నెట్‌వర్క్‌ - 50 వేల మందితో ఉన్మాదుల కర్మాగారం! - YSRCP ONLINE TROLLING ON WOMEN

జగన్‌ను విమర్శిస్తే అసభ్య పోస్టులతో రెచ్చిపోతున్న సోషల్‌ సైకోలు - తాడేపల్లి కేంద్రంగా దాదాపు 50 వేల మంది ఉన్మాదులతో నెట్‌వర్క్

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 7:15 AM IST

YSRCP Online Trolling on Women in AP : పాము తన పిల్లల్ని తానే తింటుంది. వైఎస్సార్సీపీ విషనాగులూ అంతే! ఆ పార్టీ అధినేత జగన్‌ను విమర్శిస్తే చాలు, ఆ పార్టీతో విభేదిస్తే చాలు కాట్లకుక్కల్లా రెచ్చిపోతారు. తల్లి, చెల్లి, అక్క అనే తేడాలుండవు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేశ్, అనిత మొదలుకుని చివరకు విజయమ్మైనైనా, షర్మిలనైనా బండబూతులతో తిట్టిపోస్తారు. ఫోటోలు మార్ఫింగ్‌ చేస్తారు. సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేసి పైశాచికానందం పొందుతారు. ఇందుకోసం దాదాపు 50 వేల మంది సైకోలతో ఓ నెట్‌వర్క్‌ నడుస్తోంది. తాడేపల్లిలో కాస్కో అనగానే, ఉస్కో అంటూ ఉచ్ఛనీచాలు వదిలేసివిషం చిమ్ముతోంది. ఈ ఉన్మాద నెట్‌వర్క్‌ను ఛేదించడమే పనిగా పెట్టుకున్న పోలీసులు ఇప్పటికే వందల మందికి నోటీసులిచ్చారు.

విషం చిమ్మేలా ఉన్మాద నెట్‌వర్క్‌ : తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం కేంద్రంగా వైఎస్సార్సీపీ ఏకంగా సోషల్‌ మీడియా సైకోల కర్మాగారాన్ని నడిపిస్తోంది. ఒకరిద్దరుకాదు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ దాదాపు 50వేల మందిని తయారు చేసి, జగన్‌ అంటే గిట్టనివాళ్లపైకి ఉసిగొల్పుతోంది. తాడేపల్లిలో మొదలైన ఈ ఉన్మాదమూక మూలాలు హైదరాబాద్, బెంగళూరుతోపాటు విదేశాల దాకా వేళ్లూనుకున్నాయి. జగన్‌ను విమర్శించగానే అసభ్య పదజాలంతో విషం చిమ్మేలా ఆ ఉన్మాద నెట్‌వర్క్‌ను వ్యవస్థీకృతం చేశారు.

వాళ్లు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరం - ఎక్కడ దాక్కున్నా వదలం : హోంమంత్రి అనిత

వారికి శిక్షణ : రాష్ట్రంలో తాజా పరిణామాలేంటి?వాటి ఆధారంగా కూటమి ప్రభుత్వంలో ఎవరెవర్ని లక్ష్యంగా చేసుకోవాలి? వారికి సంబంధించిన మార్ఫింగ్‌ వీడియోలు, ఫొటోలు ఎలా తయారు చేయాలి? తదితర అంశాలపై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆలోచనలు సిద్ధమవుతాయి. సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జునరెడ్డి, హర్షారెడ్డి ఈ ఉన్మాదుల శిబిరానికి నాయకత్వం వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టుల రూపకల్పనకు గ్రాఫిక్‌ డిజైనింగ్, ఫొటోషాప్, కంటెంట్‌ రైటింగ్‌పై కొందరిని ఎంపిక చేసుకునిమరీ వారికి శిక్షణ ఇస్తున్నారు.

వేతనాలూ చెల్లిస్తున్నారు. ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు బెంగళూరు, హైదరాబాద్ సహా విదేశాల్లోని పలు ప్రాంతాల్లో వారిని పెట్టుకున్నారు. సర్వర్లు అక్కడే పెట్టించి బూతు పోస్టులు, మార్ఫింగ్‌ చిత్రాలు, వీడియోలు అక్కడే తయారు చేయిస్తున్నారు. అక్కడి నుంచి ఆ పోస్టులు వైఎస్సార్సీపీ జాతీయ, రాష్ట్ర స్థాయి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు, గ్రూపులు నిర్వహించే సజ్జల భార్గవరెడ్డి, అర్జునరెడ్డికి పంపుతారు. వారు సోషల్‌ మీడియా సైకోల ద్వారా వాట్సప్, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టా ఖాతాల్లో పోస్టు చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

50 వేల మందికి పైనే సోషల్ సైకోలు : జుగుప్సాకర ఫోటోలు, అసభ్య వీడియోలను నిత్యం సోషల్‌ మీడియాలో గ్రామస్థాయి వరకూ సర్క్యులేట్‌ చేసేలా వైఎస్సార్సీపీ ఉన్మాద నెట్‌వర్క్‌ వ్యవస్థీకృతం అయింది. ఈ సైబర్‌ సైకో ముఠాకు ప్రతి జిల్లాకు ఓ కన్వీనర్‌, ఆయనకు అనుబంధంగా, ఇద్దరు ముగ్గురు కో కన్వీనర్లను పెట్టుకున్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక కన్వీనర్, ఐదారుగురు కో కన్వీనర్లు, మండలానికి ఒక కన్వీనర్, ఇద్దరు ముగ్గురు కో కన్వీనర్లను పెట్టుకున్నారు. వీరంతా వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా సైనికుల్లా చలామణి అవుతుంటారు.

"చంద్రబాబుకూ కోపం తెప్పించారుగా" - వాళ్లందరి కొవ్వు కరిగిస్తామని హెచ్చరించిన సీఎం

జిల్లా స్థాయిలో పార్టీ సోషల్‌ మీడియా విభాగానికి నాయకత్వం వహించే కన్వీనర్‌ కో కన్వీనర్లు, నియోజకవర్గ కన్వీనర్లు, కో కన్వీనర్లు సభ్యులుగా 500 నుంచి 600 మందితో వాట్సప్, ఫేస్‌బుక్‌ గ్రూపులు ఏర్పాటు చేశారు. అందులో పెట్టే పోస్టుల్ని నియోజకవర్గ కన్వీనర్లు, కో కన్వీనర్లు మండల స్థాయి కన్వీనర్లున్న గ్రూపుల్లో రీ పోస్టు చేస్తారు. అక్కడి నుంచి అవి గ్రామాల్లోకి వెళ్తున్నాయి. ఇలా అసభ్యకర పోస్టులను వ్యవస్థీకృతంగా వైరల్‌ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేల మందికి పైనే సోషల్ సైకోలున్నట్లు భావిస్తున్నారు. జగన్‌ అంటే గిట్టనివారిపై సోషల్‌ మీడియా వేదికల్లో దాడి చేయడమే వీరందరి లక్ష్యం.

వారికి మరణశిక్షే! : సామాజిక మాధ్యమాల్లో నీచమైన దాడి కోసం వైఎస్సార్సీపీ సైబర్‌ సైకో మూకలు తమ ఉన్మాద ఫ్యాక్టరీలో ఏకంగా చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజింగ్‌ మెటీరియల్‌ తయారుచేస్తోంది. మహిళలపైనా అలాంటి పోస్టులు సృష్టించి, వ్యాప్తిచేస్తోంది. తద్వారా మానసికంగా కుంగదీసి మరోసారి జగన్‌ గురించి గొంతెత్తకుండా చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది. కొందరు ఇలాంటి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ సామాజిక సైకోలపై పోక్సో చట్టం కింద కేసులు నమోదుచేయాలని భావిస్తున్నారు. ఈ నేరపూరిత వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ ఛేదనపై ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే వందల మందికి నోటీసులిచ్చారు. చట్టవిరుద్ధమైన సైబర్‌ నేరాల కార్యకలాపాలు వ్యవస్థీకృతంగా పాల్పడితే భారతీయ న్యాయసంహితలోని సెక్షన్‌ 111 ప్రకారం మరణశిక్షగానీ జీవితఖైదుగానీ విధించవచ్చు. 10 లక్షల వరకూ జరిమానా ఉంటుంది.

సైకో పార్టీ సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది - ఆఖరికి తల్లిని, చెల్లిని వదల్లేదు: షర్మిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.