Sisters Slams AP CM Jagan : అమ్మలో సగం, నాన్నలో సగం కలిపి 'అన్నా' అని పిలుచుకుంటారు. తండ్రి తర్వాత మళ్లీ అంతటి వాడు అతనే అని భావిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు అన్నకు ఇచ్చే గౌరవ మర్యాదలు అన్నీఇన్నీ కావు. కానీ, తమకు జరిగిన అన్యాయంపై సొంత అన్నే మౌనం వహిస్తున్నారని వాపోతున్నారు వైఎస్ షర్మిల, సునీత. అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తుంటే ఇక అడిగేదెలా? అని షర్మిల, చిన్నాన్న అంటే అర్థం తెలుసా? అని సునీత ప్రశ్నిస్తున్నారు.
Sunita On YS viveka murder case : వైఎస్ వివేకా హత్య జరిగి ఐదేళ్లయిపోయింది. నిందితులకు ఇప్పటికీ శిక్ష పడలేదు. న్యాయం(Justice) కోసం తాము పోరాడుతున్నా హంతకులకు(murderers) జగన్ అండగా ఉంటున్నారని స్వయంగా ఆయన చెల్లెళ్లు షర్మిల, వైఎస్ వివేకా కూతురు సునీత వాపోతున్నారు. సొంత చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలకు పారదర్శక(Transparent Administration) పాలన ఎలా అందిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వేళ ప్రజాక్షేత్రంలోకి(Public) వచ్చి కొంగు పట్టి న్యాయం కావాలని కోరుతున్నారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీకి ఓటు వేయొద్దని విన్నవిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో(Elections) ఆ పార్టీ అభ్యర్థులను ఓడించి జగన్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలను వేడుకుంటున్నారు.
Sharmila Fires On YS Jagan : అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని షర్మిల జగన్‌పై మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమెకు సమాధానం చెప్పేవారు లేకపోగా ఎన్నికల్లో లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తోందంటూ అభాండాలు వేస్తున్నారు. పైగా కుటంబ పరువును బజారున పడేస్తున్నారంటూ మేనత్తను రంగంలోకి దించి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కా చెల్లెళ్లపై అసత్య ప్రచారం నీకు న్యాయమేనా జగన్! అంటూ వైఎస్ అభిమానులు, సగటు ప్రజలు ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు.
ఎన్నికల్లో అవకాశం కల్పించడంపై ఆవేదన : బాబాయి హత్య కేసులో ఆరోపణలు(Allegations) ఎదుర్కొంటున్న అవినాశ్ అరెస్టు కాకుండా ఐదేళ్ల పాటు కాపాడుకున్న జగన్ ఎన్నికల్లో మళ్లీ అవకాశం కల్పించడాన్ని షర్మిల ప్రశ్నించారు. నిందితుడని సీబీఐ తేల్చి చెప్పినా ఓటు వేసి గెలిపించాలని ఎలా కోరుతున్నారు అని నిలదీశారు. అవినాశ్‌ను ఓడించి జగన్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
హంతకుల పార్టీకి ఓటేయొద్దు - జగనన్న పార్టీ గెలవొద్దు : వైఎస్ సునీత
'అన్నా' అని పిలుచుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు - వైఎస్ షర్మిల