ETV Bharat / politics

'వైనాట్​ కాంగ్రెస్'- పార్టీ పునరేకీకరణ దిశగా షర్మిల - Sharmila focus on YSRCP cadre - SHARMILA FOCUS ON YSRCP CADRE

Sharmila's focus on YSRCP cadre : ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారిన తరుణంలో కాంగ్రెస్ వ్యూహమేంటి? రాష్ట్రంలో దివంగత వైఎస్సార్ స్థానాన్ని తిరిగి భర్తీ చేయాలని కాంగ్రెస్​ పార్టీ భావిస్తోందా? ఆయన రాజకీయ వారసురాలిగా వైఎస్​ షర్మిలకు ఇప్పటికే రాష్ట్ర బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానం.. రానున్న ఐదేళ్లలో పూర్వవైభవం సాధించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించిందా? ​ఆ దిశగా షర్మిల పావులు కదుపుతున్నారా?

sharmila_focus_on_ysrcp_cadre
sharmila_focus_on_ysrcp_cadre (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 5:37 PM IST

Sharmila's focus on YSRCP cadre : రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ఊహించని ఘోర పరాజయం పాలైంది. కేవలం 11సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కోల్పోయింది. దీనికి తోడు జగన్​పై ఈడీ కేసులు, బెయిల్​పై ఉంటున్న ఆయన ఎప్పుడు తిరిగి జైలుకు వెళ్తాడో అని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్న పరిస్థితి. వచ్చే ఐదేళ్లలో షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్​ పార్టీ పావులు కదుపుతోంది. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో తిరిగి బలం పుంజుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ వైఎస్ షర్మిలకు మద్దతుగా ఉన్నారని ప్రజల్లోకి మెసేజ్​ వెళ్లేలా విజయవాడలో వైఎస్​ జయంత్యుత్సవాలు ఏర్పాటు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.

వైఎస్​ వారసులు ఎవరు? - తేల్చేసిన విజయమ్మ - Vijayamma Support Sharmila

రాహుల్​ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలన్నది వైఎస్​ సంకల్పమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి హైదరాబాద్​లోని పంజాగుట్ట సర్కిల్​లో జరిగిన వైఎస్​ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ చెప్పారు. వైఎస్సార్ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ రాహుల్ గాంధీని ప్రధాని చేయడం తన లక్ష్యమని చెప్పారని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా తాను సైతం వైఎస్​ను స్ఫూర్తిగా తీసుకుని భారత్​ జోడో యాత్ర పూర్తి చేశానని రాహుల్​గాంధీ ట్వీట్​ చేసిన వీడియోలో వెల్లడించడం గమనార్హం.

sharmila_focus_on_ysrcp_cadre
sharmila_focus_on_ysrcp_cadre (ETV Bharat)

జగన్​ రాజకీయ భవిష్యత్​పై నీలినీడలు కమ్ముకొన్న తరుణంలో ఆ పార్టీ నాయకులు ఎంతోమంది ఇప్పటికే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. మరికొందరు కాంగ్రెస్​ వైపు చూస్తున్నారు. ఇక ఇదే సమయంలో షర్మిల ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కొద్ది రోజుల కిందట దిల్లీ వెళ్లి సోనియా, రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్​ పార్టీ జాతీయ నేతలను షర్మిల కలిశారు. అనంతరం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నేతలతో వరుసగా భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్​ నేతలను కలిసి వైఎస్​ జయంత్యుత్సవాలకు ఆహ్వానించారు. కాంగ్రెస్​ అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రం కర్ణాటకకూ వెళ్లి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ను సైతం ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ శ్రేణుల పునరేకీకరణపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత అనుకూల పరిణామాలు, భవిష్యత్​ కార్యాచరణపైనా మాట్లాడినట్లు సమాచారం.

కాంగ్రెస్​ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న షర్మిల వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. "జగన్​ మా మాట వినకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయాం" అంటున్న వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు షర్మిలతో టచ్​లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఎంతో మంది కాంగ్రెస్​ పార్టీ నేతలు హైదరాబాద్​లో వ్యాపార సంస్థలు నెలకొల్పారు. తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలో ఉన్న నేపథ్యంలో వారంతా ఇప్పుడు కాంగ్రెస్​వైపు చూస్తున్నారు.

నేడు వైఎస్సార్ 75వ జయంతి - ఇడుపులపాయలో వేర్వేరుగా నివాళులర్పించిన జగన్, షర్మిల - YSR 75th Birth Anniversary

సోనియా, రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.