Shabbir Ali fires on KCR : పార్లమెంట్ ఎన్నికలు జరిగేలోపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోబోతున్నారని ప్రభుత్వ సలహాదారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వారు అలా డ్రాప్ కాకుండా ఉండటానికే, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో ఉన్నారని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో నిర్వహించిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్తో కలిసి పాల్గొన్నారు.
Shabbir Ali on BRS Candidates : అంతకుముందు కాంగ్రెస్ నాయకుడు వేణుగోపాల్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఇష్టం లేదన్నారు. కానీ కేసీఆర్ మాటిమాటికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతామని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకులను చేర్చుకుంటున్నట్లు తెలిపారు.
20 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్‌కి టచ్‌లో ఉన్నారనడం అబద్దమని షబ్బీర్ అలీ తెలిపారు. ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఎలక్షన్ మధ్యలో డ్రాప్ ఆవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్ భయపడి అబద్దపు మాటాలు మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని పడగొడుతామంటే చూస్తు ఊరుకోమని షబ్బీర్ అలీ హెచ్చరించారు. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నారన్నారు.
కేసీఆర్‌కు జైలులోనే డబుల్ రూం కడుతామని, కుటుంబ సభ్యలందరిని ఒకే దగ్గర జైలులో ఉంచనున్నట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో కవిత తీహాడ్ జైల్లో ఉందని, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ అరెస్టు కానున్నట్లు తెలిపారు. అందువల్ల జైలులో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టనున్నట్లు ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో సురేశ్ షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎంపీ ఎన్నికల అనంతరం నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతానన్నారు.
"పార్లమెంట్ ఎన్నికలు జరిగేలోపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోబోతున్నారు. వారు అలా డ్రాప్ కాకుండా ఉండటానికే, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో ఉన్నారని మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు కాబోతుంది". - షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారుడు
కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం - షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ - Shabbir Ali hot comments
సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలు అమలయ్యే బాధ్యత మాది : షబ్బీర్ అలీ