ETV Bharat / politics

సికింద్రాబాద్​లో త్రిముఖ పోరు - అభ్యర్థులను కలవరపెడుతున్న పోలింగ్​ శాతం - Secunderabad Lok Sabha election

Secunderabad Lok Sabha Election 2024 : గ్రేటర్​ హైదరాబాద్​లో రాజకీయంగా సికింద్రాబాద్​ లోక్​సభ స్థానం చాలా కీలకమైంది. అక్కడ గెలుపు జెండా ఎగురవేయడం కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ముందే ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అధికార కాంగ్రెస్​ నుంచి ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​, బీజేపీ తరఫున కిషన్​రెడ్డి, బీఆర్​ఎస్​ నుంచి పద్మారావు గౌడ్​ బరిలో నిలిచారు. ఈ త్రిముఖ పోటీ నెలకొన్న సికింద్రాబాద్​లో రాజకీయం రసవత్తరంగా మారింది.

Secunderabad Lok Sabha Election 2024
Secunderabad Lok Sabha Election 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 23, 2024, 7:23 AM IST

సికింద్రాబాద్​లో త్రిముఖ పోరు - అభ్యర్థులను కలవరపెడుతున్న తగ్గుతున్న పోలింగ్​ శాతం

Secunderabad Lok Sabha Election 2024 : లోక్​సభ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచే స్థానం సికింద్రాబాద్​ నియోజకవర్గం. ఇక్కడ ముగ్గురు దిగ్గజాలు పోటీపడుతున్న సికింద్రాబాద్​ లోక్​సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ అభ్యర్థులు నువ్వానేనా అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నాయకులు మాటల తూటాలతో ఓటరును తమవైపు తిప్పుకునేందుకు శ్రమిస్తున్నారు. సికింద్రాబాద్ స్థానానికి ఇద్దరు ఎమ్మెల్యేలు లోక్‌సభ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు గౌడ్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి హస్తం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. వీరిద్దరూ తొలిసారిగా ఎంపీలుగా పోటీచేస్తున్నారు. ఒకేపార్టీ నుంచి ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీపడుతున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండోసారి సికింద్రాబాద్ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

కాంగ్రెస్ గెలుపు​ వ్యూహం : సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఒక్క స్థానం ఎంఐఎం మినహా మిగతా అన్నింటా బీఆర్​ఎస్​దే విజయం. ఖైరతాబాద్‌లో బీఆర్​ఎస్​ గెలిపిచినప్పటికీ దానం నాగేందర్‌ పార్టీ మారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబడ్డారు. బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్‌లు అధికార పార్టీ గూటికి చేరారు. నాంపల్లి మినహా సికింద్రాబాద్, ముషీరాబాద్, సనత్ నగర్, అంబర్ పేట్, కంటోన్మెంట్‌ బీఆర్​ఎస్​ ఖాతాలోనే ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్‌లోకి పెరుగుతున్న చేరికలతో పార్టీ బలం పుంజుకుంటోంది. సికింద్రాబాద్‌ను ఒడిసిపట్టాలనే పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ప్రభుత్వ పథకాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.

సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గంలో గెలుపు బీఆర్​ఎస్​దే : ​పద్మారావు గౌడ్​

"యువకులు ఎప్పుడైతే ముందుకొచ్చి పని చేస్తారో మేం అలసిపోయినా మిమ్మల్ని చూడగానే కొత్త ఎనర్జీ వస్తుంది. పక్క పార్టీల కంటే కాంగ్రెస్​లో యువకులు చాలా యాక్టివ్​గా ఉంటారు. కష్టం చేసినప్పుడే సరైన సమయంలో మీకు దక్కాల్సిన ప్రతిఫలం అనేది దక్కుతుంది." - దానం నాగేందర్‌, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి

మళ్లీ బీజేపీ పట్టం కట్టండి : బీజేపీ సైతం ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. రెండోసారి సికింద్రాబాద్​లో కాషాయ జెండా ఎగురవేయాలనే కృతనిశ్చయంతో కిషన్ రెడ్డి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. దేశ సుస్థిర అభివృద్ధి జరగాలంటే మళ్లీ బీజేపీకే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యక్తిగతంగానూ, పాదయాత్రల ద్వారాను అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈసారి సికింద్రాబాద్​ నియోజవర్గంలో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Padmarao Goud Slams BJP and Congress : కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని బీఆర్​ఎస్​ ప్రజల్లోకి తీసుకెళుతోంది. బలమైన ప్రతిపక్షంగా ప్రజాగొంతుకగా ఉండడమే కాక హామీల అమలుకు పోరాటం చేస్తామని ప్రజలకు వివరిస్తోంది. సర్వీసులో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అవకాశం బీఆర్​ఎస్​ పార్టీ ఇచ్చిందని బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్​ అన్నారు. అందరూ లాభపడ్డారని తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ పార్టీ వాళ్లు అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. అందులో ఏం ప్రజలకు చేరువయ్యాయో తమ కన్నా ప్రజలకే బాగా తెలుసునని విమర్శించారు.

తగ్గుతున్న పోలింగ్​ శాతం : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​, కేంద్రంలో పాలకపక్షంగా ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్​ఎస్​ సికింద్రాబాద్​లో పాగా వేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. తగ్గుతున్న పోలింగ్​ శాతం అభ్యర్థులను కలవరపెడుతోంది. 2019 ఎన్నికల్లో 48.9 శాతం ఓటింగ్​కే పరిమితమైంది. తగ్గుతున్న పోలింగ్​ ఎవరి సీటుకు ఎసరు పెడుతుందోనని ప్రధాన పార్టీ అభ్యర్థులు కిందామీదా పడుతున్నారు. కీలకంగా మారబోతున్న యువ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు నానా తంతా పడుతున్నారు. సికింద్రాబాద్​ లోక్​సభ స్థానానికి 1957 నుంచి 16 దఫాలు ఎన్నికలు జరిగితే 10 సార్లు కాంగ్రెస్​, ఐదుమార్లు బీజేపీ, ఒక్కసారి తెలంగాణ ప్రజా సమితి విజయం సాధించింది.

హైదరాబాద్‌ లోక్​సభ ఎన్నికల పోలింగ్‌పై ఈసీ ప్రత్యేక దృష్టి - ఓటింగ్‌ శాతం పెంచేలా చర్యలు

దానం నాగేందర్​ను లక్ష లేదా రెండు లక్షల మెజారిటీతో గెలిపించుకుంటాం : మంత్రి కోమటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.