Secunderabad BRS Candidate Padmarao Goud on Elections : తెలంగాణ ఉద్యమాన్ని నడిపి విజయం సాధించిన తమకు పార్లమెంట్ ఎన్నికలు లెక్క కాదని, విజయం సాధిస్తున్నామని సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. తమ పార్టీకి ఉద్యమాలు, పోరాటాలకు కొత్త కాదన్న ఆయన, ప్రజావ్యతిరేక కాంగ్రెస్ విధానాలపై పోరాడతామని తెలిపారు. పదేళ్లలో బీఆర్‌ఎస్(BRS) హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసిందని వివరించారు.
Padmarao Goud Fires on BJP : కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకురాలేదని అన్నారు. బీజేపీకి రామునిపై పట్టా లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వెంట ఉండి ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకుని తెలంగాణను సాధించుకున్నామని గుర్తుచేశారు. ఎన్నికల్లో బీసీలకు బీఆర్‌ఎస్ (BRS Focus on Lok Sabha Polls) అధికంగా అవకాశం ఇచ్చిందని, బీసీలు ఎన్నికల్లో కొట్లాడతారా అని అనుమానపడే వాళ్లకు ఈ ఎన్నికల్లో గెలిచి సమాధానం ఇవ్వాలని పద్మారావు కోరారు.
లోక్‌సభ ఎన్నికలయ్యాక రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయం : కేటీఆర్ - ktr fires on revanth reddy
'పార్టీకి ఉద్యమాలు, పోరాటాలు కొత్తకాదు, కాంగ్రెస్ విధానాలపై పోరాడుతాం. పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఏ కష్టం కలిగినా అందుబాటులో ఉంటాం. ఈ ఐదేళ్లు ప్రతిపక్షంగా ఉండి ప్రజల తరఫున పోరాడుతాం. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకురాలేదు. మేమందరం హిందువులమే. కేవలం బీజేపీనే హిందువులం అన్నట్లు చెప్పుకుంటుంది.' అని పద్మారావు ఎద్దేవా చేశారు.
బీజేపీ నాయకులు రాముని పేరుతో రాజకీయాలు చేస్తున్నారని పద్మారావు ఆరోపించారు. తమది రాజకీయ కుటుంబం కాదని, కేసీఆర్(KCR) వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు.
"కేసీఆర్ వెంట పనిచేసి ఎన్నో కష్టాలు పడి తెలంగాణ సాధించుకున్నాం. ఆయన చెప్తే సికింద్రాబాద్‌లోనే కాదు దిల్లీలో కూడా కొట్లాడే దమ్ము మాకుంది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి విజయం సాధించిన మాకు ఈ పార్లమెంటు ఎన్నికలు ఒక లెక్కా? ఈ ఎన్నికల్లో బీసీలకు పార్టీ అధికంగా అవకాశం ఇచ్చింది." - పద్మారావు గౌడ్, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి
Lok Sabha Elections 2024 : వంద రోజుల్లోనే కాంగ్రెస్ పాలనలో నీటి, రైతుల కష్టాలు ప్రారంభమైయ్యాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) మండిపడ్డారు. తాగడానికి నీళ్లు కూడా రావడం లేదని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ తరఫున పద్మారావు గౌడ్‌ను గెలిపించుకొని ప్రభుత్వం పోయిన బాధను ఈ ఎన్నికల ద్వారా తీర్చుకుందామన్నారు. కేసీఆర్ పరిపాలనను దేశమంతా పొగిడిందన్న ఆయన కాంగ్రెస్ పాలన ఏమిటో అందరికి అర్థం అవుతోందని వ్యాఖ్యనించారు.