ETV Bharat / politics

త్వరలో తెలంగాణ కేబినేట్​ విస్తరణ - ఏడెనిమిది మందికి చోటు - ఎవరెవరికి ఛాన్స్​ దక్కేనంటే? - Cabinet Expansion in Telangana - CABINET EXPANSION IN TELANGANA

Telangana Cabinet Expansion 2024 : తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. సామాజిక సమీకరణాల ఆధారంగా చేసిన కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అధిష్ఠానంతో చర్చించి తుదిరూపు ఇవ్వడానికి సీఎం రేవంత్‌రెడ్డి సహా రాష్ట్ర ముఖ్య నేతలు, ఇవాళ లేదా రేపు దిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడున్న అమాత్యుల శాఖల్లోనూ మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

tg_cabinet
tg_cabinet (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 9:53 AM IST

త్వరలో తెలంగాణ కేబినేట్​ విస్తరణ - ఏడెనిమిది మందికి చోటు (ETV Bharat)

Cabinet Expansion in Telangana : తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ విస్తరణ కసరత్తు తుది దశకు చేరుకుంది. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా, మరో ఏడెనిమిది మందికి చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. ఇటీవల ఐదు రోజులపాటు దిల్లీలో మకాం వేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర సీనియర్ నేతలు, కాంగ్రెస్ పెద్దలతో మంత్రివర్గ విస్తరణపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు. సామాజిక సమీకరణాల ఆధారంగా నాలుగు మంత్రి పదవులకు ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి రెండు, వెలమలకు ఒకటి, బీసీలకు ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.

లోక్‌సభ ఎన్నికల వేళ ఏఐసీసీ ఇచ్చిన హామీ మేరకు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వరించే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. నిజామాబాద్ నుంచి బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేరు గట్టి వినిపిస్తోంది. అయితే.. ఈ ముగ్గురిలో ఒకరికి మాత్రమే మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. మిగిలిన ఇద్దరిలో ఒకరికి ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి, మరొకరికి ప్రభుత్వ చీఫ్ విప్ ఇచ్చే దిశలో కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.

నాడు ఎన్టీఆర్ క్యాబినెట్​లో నేడు చంద్రబాబు జట్టులో- ఆ మంత్రులెవరో తెలుసా? - ap ministers list

బీసీ సామాజికవర్గానికి చెందిన మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌కు మంత్రి పదవి పక్కా అయ్యిందని సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్‌రావుకు అమాత్యయోగం పట్టనుందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇవాళ లేదా రేపు దిల్లీ వెళ్లి, మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంపై తుదిచర్చలు జరపనున్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపికపైనా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బాధ్యతలు స్వీకరించిన మంత్రులు- తొలిసంతకాలు వాటిపైనే! - AP MINISTERS

ప్రభుత్వపరంగా లాంఛనాలు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తాజాగా రాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నిమాయంపైనా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకం, అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన ఆర్వోర్ చట్టం, ధరణి స్థానంలో భూమాత పేరుతో తేనున్న అత్యాధునిక వ్యవస్థపైనా చర్చించినట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఆమోదించి, గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న 12 బిల్లులపైనా చర్చించినట్లు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటన అనంతరం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. ఈనెల ఏడో తేదీ లోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి.

'గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తాం' - మొదటి ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రులు - AP Ministers take charge

Damodara Rajanarsimha Chit Chat on Cabinet Expansion : త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని మంత్రి దామోదర రాజ నర్సింహ పేర్కొన్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్​లోని తన నివాసంలో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి, ఐదారుగురికి కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కనుందన్నారు. శాఖల మార్పులకు సైతం అవకాశం ఉందన్న ఆయన, కీలకమైన హోం మంత్రి పదవి ప్రస్తుతం మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న సీతక్కకు ఇచ్చే అవకాశం ఉందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.