ETV Bharat / politics

జులై​ 2న మంత్రివర్గ విస్తరణ! - ఒకేసారి మరో ఆరుగురు అమాత్యుల నియామకం - Telangana Cabinet Expansion

Telangana Cabinet Expansion : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ త్వరలో జరిగే అవకాశం ఉంది. ఆరుగురు మంత్రులను నియమించేందుకు ఏఐసీసీ, పీసీసీ స్థాయిల్లో కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వచ్చే నెల రెండో తేదీన శ్రీహరి ముదిరాజ్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఏఐసీసీ నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఉండటంతో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Telangana Cabinet Expansion
Telangana Cabinet Expansion (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 9:19 AM IST

Updated : Jun 23, 2024, 1:45 PM IST

CM Revanth Reddy Focus on Telangana Cabinet Expansion : గతేడాది డిసెంబర్‌ 7న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టిలతో పాటు 11 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు. మరో ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ రేవంత్‌ రెడ్డి వేచి చూసే ధోరణలో ముందుకు వెళుతున్నారు. ఏఐసీసీ ఇచ్చే మార్గదర్శకాలను అనుసరించి ముందుకు వెళ్లాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. కీలకమైన హోం శాఖ, విద్యా శాఖ, మున్సిపల్‌, కార్మిక శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల నియమావళి ముగియడంతో సీఎం పాలనపై దృష్టి సారించారు.

మంత్రిమండలి విస్తరణపై సీఎం కసరత్తు : ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల్లో తలమునకలైన సీఎం, మంత్రుల నియామకాల అంశంపైనా దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో కొన్నింటిపై కొందరు మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మార్పులు చేర్పులు చెయ్యాలన్న యోచనతో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ 37 నామినేటెడ్ పదవుల్లో కొన్నింటిని తొలిగించాల్సి వస్తే, వాటి స్థానంలో పార్టీ కోసం కస్టపడి పని చేసిన, చేస్తున్న వారిని చేర్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో అది కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

Revanth Govt Focus On Cabinet Expansion : ఇక మంత్రివర్గ విస్తరణపై కసరత్తు పూర్తి చెయ్యాల్సి ఉంది. ఇప్పటికే అధిష్ఠానం వద్ద కూడా మంత్రివర్గ కూర్పుపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆరుగురు మంత్రులను విస్తరణలో భర్తీ చేయాల్సి ఉంది. మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం చాంతాడంత ఉంది. కానీ 6 మంత్రి పదవుల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, రెండు బీసీలకు, ఒకటి లంబాడీకి, మరొకటి మైనారిటీకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కీలకమైన హోం శాఖను బోధన్‌ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌ రెడ్డికి ఇవ్వాలని సీఎం రేవంత్‌ రెడ్డి యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్న ఆశావహులు : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి, ఏఐసీసీ హామీతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిలు కూడా మంత్రి పదవుల కోసం వేచి చూస్తున్నారు. ఎవరికి వారు దిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేసుకుంటున్నారు. అయితే పోటీ పడుతున్న నలుగురు రెడ్డి సామాజికవర్గ నాయకుల్లో ఇద్దరికి మంత్రి వర్గంలో చోటు దక్కుతుంది.

మరో ఇద్దరిలో ఒకరికి డిప్యూటీ స్పీకర్‌, ఇంకొకరు ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా మక్తల్‌ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏదైనా కారణాలతో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోతే ఎమ్మెల్సీ మహేశ్​కుమార్ గౌడ్​కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

కీలకం కానున్న సామాజిక సమీకరణాలు : ఇక మిగిలిన రెండింటిలో ఒకటి లంబాడి సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకో మంత్రి పదవి మైనారిటీలకు ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ, ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న ధోరణిలో రాష్ట్ర నాయకత్వం సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. మానకొండూరు ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ చేస్తూ జులై రెండో తేదీన ముదిరాజ్‌ శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పడంతో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనేందుకు దీనిని సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.

త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ - కేబినెట్​లోకి ఆ నలుగురు? - Telangana Cabinet Expansion

త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ - వారికి ఛాన్స్ దక్కుతుందా?

Last Updated : Jun 23, 2024, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.