Political Reaction on Kavitha ED Raids : రాష్ట్రంలో రేపోమాపో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న క్రమంలో, బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఐటీ ఈడీ అధికారుల సోదాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ ఘటనలపై పలువురు రాజకీయ నేతల స్పందించారు. ఎన్నికల వేళ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) నివాసంపై ఈడీ, ఐటీ సంస్థల దాడులు పలు అనుమానాలను తావిస్తోందని, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
Komatireddy on Kavitha IT and ED Raids : శనివారం ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్న క్రమంలో, ఇవాళ ఈడీ దాడులు ఎవరి కోసం చేస్తున్నారో చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి(Komatireddy) డిమాండ్ చేశారు. దిల్లీ మద్యం కుంభకోణంలో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా అరెస్టు అయ్యారని, కానీ ఇంతవరకు కవిత అరెస్టు కాలేదన్నారు. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బండి సంజయ్, త్వరలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాబోతోందని గతంలో చెప్పారని, ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు గల్లీలో కోట్టుకుంటారని, దిల్లీలో దోస్తీ అవుతారని మంత్రి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధిపొందడానికి ఇలాంటివి చేస్తున్నారన్నారని మంత్రి కోమటిరెడ్డి దుయ్యబట్టారు.
"పార్లమెంట్ ఎన్నికల వేళ ఎమ్మెల్సీ కవిత నివాసంపై ఈడీ, ఐటీ సంస్థల దాడులు పలు అనుమానాలను తావిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు గల్లీలో కొట్టుకుంటారు, దిల్లీలో దోస్తీ అవుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధిపొందడానికి ఇలాంటివి చేస్తున్నారు. - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి
Kishan reddy on MLC Kavitha Arrest : దిల్లీ మద్యం కుంభకోణంలో నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కవిత ఇంట్లో ఈడీ సోదాలపై ఆయన స్పందించారు. ఈడీ విచారణకు కవిత సహకరించాలని కిషన్‌రెడ్డి సూచించారు. ఇన్నాళ్లు విచారణకు సహకరించకుండా కవిత తప్పించుకుని తిరిగారని ఆయన విమర్శించారు. సహకరించలేదనే, ఈడీనే ఆమె ఇంటికి వెళ్లిందన్నారు.
"దిల్లీ మద్యం కుంభకోణంలో నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకు? విచారణ సంస్థలకు కవిత సహకరించాలని సూచిస్తున్నాను. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుపోతాయి". - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
Etela on Kavitha arrest : కవితపై ఈడీ, ఐటీ దాడులు కొత్తకాదని, చట్టం తన పని తాను చేసుకుపోతోందని బీజేపీనేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదని ఆయన స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు - సెల్ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
బీఆర్ఎస్లో చివరికి మిగిలేది ఆ నలుగురు మాత్రమే : మంత్రి కోమటిరెడ్డి