10 Rupee Coin : ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా చెల్లింపులు వేగవంతమయ్యాయి. వస్తువుల కొనుగోలు, చెల్లింపుల్లో ఇవి కీలకంగా మారాయి. గతంలో మాదిరిగా కార్డులు, క్యాష్ చెల్లింపులు చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో నాణేల మార్పిడి దాదాపు నిలిచిపోయింది. చిల్లర ఇవ్వాల్సి వస్తే చాక్లెట్లు, బిస్కెట్లు బలవంతంగా అంటగడుతున్నారు.
దేశీయ కరెన్సీలో గడిచిన దశాబ్దకాలంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక్క రూపాయి నోటు మొదలుకుని 2వేల రూపాయల నోటు వరకూ భారత కరెన్సీ నోట్లు విభిన్న రంగులు, డిజైన్లలో చెలామణీలో ఉన్నాయి. నాణేలు మొదలుకుని నోట్ల వరకు డిజన్లలో తరచూ జరుగుతున్న మార్పులు ప్రజల్లో పలు సందేహాలకు దారి తీస్తున్నాయి. ప్రజల్లో నెలకొన్న అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసేందుకు బ్యాకర్లు, ఆర్బీఏ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆర్బీఐ తాజాగా ఓ హెచ్చరికను జారీ చేసింది. అదేమిటో తెలుసా?
మీ దగ్గర చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయా? ఈజీగా మార్చుకోండిలా! - How To Exchange Torn Notes
ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ఊగిసలాడించిందనే చెప్పుకోవచ్చు. వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేసి కొత్తగా 2వేల నోటను ప్రవేశ పెట్టడం తెలిసిందే. ఆ తర్వాత పాతవి 500నోట్లు సైతం రద్దు చేసి వాటి స్థానంలో కొత్త డిజైన్ తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా నాణేల విషయంలోనూ రూ.10, 20 నాణేలు ప్రవేశ పెట్టారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో వాటిని తీసుకునేందుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. దీంతో బ్యాంకుల్లో అవి కొండలా పేరుకుపోతున్నాయి. ఒక దశలో పది రూపాయల నాణేన్ని బ్యాంకర్లు సైతం నిరాకరించే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 20 రూపాయల నాణెం చెలామణీ పెద్దగా లేకపోగా 10రూపాయల నాణేన్ని ఎవ్వరూ తీసుకోవడం లేదన్నది కాదనలేని వాస్తవం. హైదరాబాద్ సిటీ బస్సుల్లో కండక్టర్లు తప్ప ఎవ్వరూ వాటిని అనుమతించడం లేదు. కాగా, వాటిని మార్పిడి చేసుకుంటున్న ప్రయాణికులు తిరిగి తీసుకోవడంలో వెనుకాడుతున్న పరిస్థితి.
చాలా మంది పేదలు, డిజిటల్ పేమెంట్స్ తెలియని వారు తమ వద్ద నాణేలున్నా చెలామణీలో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పది రూపాయల నాణెం తీసుకోకపోవడంతో చిల్లర కోసం అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఏ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన కొంతమందికి హెచ్చరిక లాంటిదే అవుతుంది.
ప్రభుత్వం ఆమోదించిన నాణేలను తిరస్కరించడం నేరం అవుతుందని స్పష్టం చేసింది. తిరస్కరించడమే గాకుండా అవి చెల్లవంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసినా శిక్ష ఖాయమని చెప్తోంది. 10, 20 రూపాయల నాణేలు చెలామణీలో ఉన్నాయని వాటిని తిరస్కరిస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది. ఎవరైనా నిరాకరిస్తే ఐపీసీ సెక్షన్ 124 ప్రకారం ఫిర్యాదు చేయాలని, విచారణలో ఆ విషయం రుజువైతే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.
రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన - 97.62% నోట్లు వాపస్!
డేంజర్ న్యూస్ : ఫోన్ వెనక డబ్బులు దాస్తున్నారా? - అది మీ ప్రాణాలకే ప్రమాదం!